23. యోగ ముద్రలు



చేతికి, శరీరానికి సంబంధించిన ప్రత్యేక స్థితినే ముద్ర అని అంటారు. పంచ ప్రాణాల్ని, చత్రాల్ని కుండలినీ శక్తిని జాగృతం చేసూ మహత్తరమైన యోగసిద్యలను ముద్రలు కలిగిస్తాయి. యీ ముద్రలను అభ్యసించడం వల్ల అన్నమయకోశం, (బాహ్య శరీరం), మనోమయు కోశం (మానసిక శరీరం) ప్రాణమయు కోశం (ప్రాణశరీరం) మూడింటికి సమన్వయం ఏర్పడుతుంది. ఆరంభంలో శరీరమందు ప్రసారమయ్యే ప్రాణశక్తిని మనస్సు గ్రహించి, దాని అనుభూతిని పొందుతుంది. దానితో సాధకుడు మొల్ల మొల్లగా సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం వైపుకు పయనిస్తాడు.

యోగముద్రలు ముఖ్యంగా అలుదు భాగాలుగా విభజించబడ్డాయి.

1. హస్తము(దలు:

ఇవి ధ్యానానికి సంబంధించిన ముద్రలు, ఇవి చాలా వున్నాయి, కాని ప్రధానమైనవి అయిదు.

1) జానముద్ర,
2) చిన్కుద్ర,
3) యోని ముద్ర,
4) భైరవముద్ర,
5) హృదయముద్ర.

2. మనోముద్రలు:

ఇవి కుండలినీశక్తి యొక్క ఉద్దీపనకు ఉపయోగపడతాయి. ప్రధానమైనవి తొమ్మిది.

1) సాంభవీ ముద్ర,
2)నాసికాగ్ర దృష్టి ముద్ర,
3) భేచరీ ముద్ర,
4) కాకిముద్ర,
5) భుజంగినీ ముద్ర,
6) భూచరీ ముద్ర,
7) ఆకాశ ముద్ర,
8) షణ్ముఖీ ముద్ర,
9) ఉన్మనీ ముద్ర

వీటి యందు కన్ను ముక్కు, చెవి, నాలుక, పెదవులు వీటి స్థితులు ఉపయోగపడతాయి.

3. కాయాముద్రలు:

ఇవి శరీరం, శ్వాస మరియు ఏకాగ్రతకు ఉపయోగ పడతాయి. ఇందు ముఖ్యమైనవి ఆరు.

1) ప్రాణముద్ర,
2) విపరీత కరణి ముద్ర,
3) యోగముద్ర,
4) పాషిణీ ముద్ర,
5) మండుకీ ముద్ర,
6) తాడగీ ముద్ర

ఇందు వివిధ యోగాసనాలు ఉపయోగపడతాయి.

4. బంధము(దలు:

ఇందు ముద్రలు, బంధ్లు రెండు కలుపబడతాయి. వీటి అభ్యాసం వల్ల కుండలినీ శక్తి యొక్క జాగృతికి ప్రాణశక్తి తయారవుతుంది. ఇందు మూడు ముఖ్యమైనవి.

1) మహాముద్ర;
2) మహాభేదముద్ర,
3) మహావేధ ముద్ర,

యీ మూడింటి యందు వివిధ బంధాలు ఉపయోగపడతాయి.

5. అధరముద్రలు :

ఇందు శరీరమందలి క్రింది కేంద్రాల నుంచి మెదడుకు శక్తి చేర్చ బడుతుంది. ప్రధానంగా యీ ముద్రలు లైంగిక శక్తిని నియమితం చేస్తాయి. ఇందు ముఖ్యమైనవి మూడు.

1) అశ్వనీ ముద్ర,
2) వజ్రాలీ ముద్ర (పురుషులకు మాత్రమే),
3) సహజోలీ ముద్ర (స్త్రీలకు మాత్రమే).


పైన తెలిపిన యోగముద్రలను నిపుణుల మార్గదర్శకత్వంలో వారి సమక్షంలో నేర్చుకొని అభ్యాసం చేసి అత్యద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.