1. యోగ సాధన

1. యోగమంటే ఏమిటి ?

యోగమంటే అదృష్టం, కూడిక, కలయిక, సంబంధం, ధ్యానం అను అర్థాలు ప్రచారంలో వున్నాయి.

అదృష్టం అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ యోగం బాగుండటం వల్ల ఇంతవాడు అంత వాడైనాడని అంటూ వుంటారు.

కూడిక అను అర్థంలో యోగశబ్దాన్ని వాడుతూ ఒకటి ప్రక్కన సున్నాచేరిస్తే పది, పది ప్రక్కన ఆరు చేరిస్తే పదహారు, నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది, ఎనిమిది అయిదు కలిపితే పదమూడు అని అనడం మనకు తెలుసు.

కలయిక లేక సంబంధం అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ తల్లి – కొడుకు, తల్లి – కూతురు, తండ్రి – కొడుకు, తండ్రి – కూతురు, భార్య – భర్త, అత్త- కోడలు, గురువు – శిష్యుడు అని అంటూ వుంటారు.

ఇంకా కొంచెం ముందుకు వెళ్లి ఆత్మ- పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నాన్ని ధ్యానం అని అంటారు. యిది ఏకాగ్రతపై ఆధారపడి వుంటుంది. దీనికి విశ్వాసం, నమ్మకం చాలా అవసరం. యోగ శాస్త్రంలో ధ్యానం ఒక ప్రధానమైన అంశం. ధ్యానందేని కోసం అని అడిగితే ఆత్మ పరమాత్మల కలయిక లేక ఆత్మ సాక్షాత్కారం కోసం అని సమాధానం లభిస్తుంది. యిది సాధ్యమా అని అడిగితే చిత్త ప్రవృత్తుల్ని ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్పర్యాల్ని జయించ గలిగితే సాధ్యమేనని సమాధానం లభిస్తుంది. యోగశాస్త్ర ప్రణేత పతంజలి మహర్షి మాటల్లో యోగశ్చిత్త వృత్తి నిరోధ; అంటే చిత్త ప్రవృత్తుల నిరోధమే యోగమన్నమాట.

2. యోగ శాస్త్ర, ప్రాముఖ్యం

ఆది మానవుని జననంతోనే యోగ విద్య ప్రారంభమైంది. యోగం మనిషి జీవన విధానమని చెప్పవచ్చు. యోగాభ్యాసం మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనం ప్రసాదించడమే గాక మనిషి జీవితంలో సుఖ సంతోష, ఆనందాల్ని నింపుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే సిరిసంపదలు ఎన్ని వున్నా ఏం లాభం ?

పరమేశ్వరుడు యోగ విద్యకు ఆద్యుడు అని అంటారు. అనేక మంది యోగులు, మునులు, ఋషులు, మహరులు, బ్రహ్మరులు యోగవిద్యను ప్రపంచానికి అందించారు. ఆనాడు ప్రచారంలో వున్న యోగ ప్రక్రియుల్ని పరిశోధించి, స్వానుభవంతో పతంజలి మహర్షి రచించిన యోగదర్శనం మహత్తరమైన యోగశాస్త్ర గ్రంధమని చెప్పవచ్చు.

రాజయోగం. భక్తియోగం, జపయోగం, జానయోగం, కర్మయోగం, హఠయోగం మొదలుగా గలవన్నీ యోగశాస్తానికి సంబంధించిన నిధులే.

ఫలితాన్ని పరమేశ్వరునికి వదిలి నిష్కామభావంతో కర్మ చేయడమే మనిషి కర్తవ్యమని గీతాకారుడు బోధించాడు. ఇడ, పింగళ, సుషుమ్ననాడుల సహకారంతో కుండలినీ శక్తిని ఉత్తేజితం చేసి, మనిషిలో నిద్రాణమైయున్న దేవతాశక్తిని జాగృతం చేస్తే జన్మధన్యమవుతుందని బోధించి, అందుకు హఠయోగాన్నిమత్చేంద్రనాధుడు, గోరఖ్నాధుడు ప్రతిపాదించారు. కాలక్రమేుణతాంత్రికులు, కాపాలికులు ఈ రంగంలో ప్రవేశించి శ్రీపురుషుల సంభోగానికి ప్రాధాన్యం యిచ్చి, అదే యోగసమాధి అందించే పరమానందమని చెప్పి యోగవిద్యను దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. కాని సవనాజం దాన్ని హర్షించలేదు. యోగ శాస్త్రం వున భారతదేశంలో ఆధ్యాత్మికతత్వాన్ని సంతరించుకొని మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.

ఈనాటి యుగంలో యోగవిద్యకు సైన్చుసాయం లభించింది. పలువురు మేధావులు, డాక్టర్లు, నిపుణులు ఈ రంగంలో ప్రవేశించి శారీరిక, మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా యోగశాస్తాన్ని మలిచి యోగచికిత్సా విధానం ప్రారంభించి మానవాళికి మహలోపకారం చేశారు. చేస్తున్నారు.

3. యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు

1. మనం జీవిస్తున్నయీనాటి ఆధునిక యుగంలో, అత్యాధునిక నగర జీవితంలో కణ కణం మనిషికి కలుగుతున్న టెన్షను, వత్తిడి, నీరసం, నిస్పృహ, భయం, వ్యతిరేక ఆలోచనలు, అవధానశక్తి తరుగుదల మొదలుగా గల రుగ్మతులు

2. శారీరకంగాను, మానసికంగాను సుఖశాంతులు, ఆరోగ్యం పొంది ఆత్మవికాస మార్గాన పయనించి మనిషి తన జన్మను సార్ధకం చేసుకుంటాడు.

3. ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఆవేశం, మొదలుగా గల దుప్పవృత్తులు తగ్గి ప్రశాంతత, స్థిరత్వం మనిషి పొందుతాడు.

4. మధుమేహం, ఆస్తమా, రక్తపువోటు, గుండెనొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి, అజీర్తి మొదలుగా గల దీర్ఘరోగాలు నయమై, మనిషి శరీరం బంగారంలా నిగనిగలాడుతుంది.

5. స్త్రీలు యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం పొందడమే గాక, తమ సౌందర్యా పెంచుకుంటారు. తమ కుటుంబాన్ని సరిదిదుకొని క్రమశిక్షణతో పిల్ల పెంచి, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిదుతారు.

6. యోగాభ్యాసం అలవాటు కాగానే మనిషి దినచర్య, అలవాట్ల, ఆలోచనా విధానం, ఆహార విహారాదులు వెుదలగు విషయవాలన్నిటి యుందు సాత్వికమార్పు సాధిస్తాడు. తామస, రాజస ప్రవృత్తులు తగుతాయి. అట్టి సాధకులు ఉత్తమ పౌరులుగా దేశానికి, ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తారు.

7. యోగాభ్యాసం చేయు సాధకులు తమ నిత్య కార్యక్రమాల్లోను, విధుల్లోను దకత, ఏకాగ్రత, చురుకుదనం సాధించి అధికారుల మన్నన పొందుతారు. యోగకర్మకు కౌశలం అను ఆర్యోక్తిని అమల్లోకి తెస్తారు.

4. యోగాభ్యాస నియమాలు

1. ప్రతి రోజూ రాత్రి త్వరగా పడుకొని హాయిగా నిద్రించి, తెల్లవారు జామున లేచి, పళ్ళు తోముకొని, మలమూత్ర విసర్జన కావించి, స్నానం చేసి, పరగడుపున యోగాభ్యాసం ఆరంభించాలి.

2. స్నానం చేయకుండా కూడా యోగాభ్యాసం చేయవచ్చు. అయితే యోగాభ్యాసం పూర్తి అయిన కొద్దిసేపు తరువాత స్నానం చేయవచ్చు.

3. గాలి, వెలుగు వచ్చే ప్రదేశాల్లోను, కిటికీలు, తలుపులు తెరిచియున్నగదుల్లోను సమతలంగా వున్న చోట యోగాభ్యాసం చేయాలి.

4. ఉదయం ప్రసరించే సూర్యరశ్మిలో యోగాభ్యాసం చేయడం ఎన్నో విధాల మంచిది.

5. నేల మీద గాని, గచ్చుమీద గాని, బండలమీద గాని యోగాభ్యాసం చేయకూడదు. తివాచీగాని, కంబళిగాని, పరిశుభ్రమైన బట్టగాని పరిచి దాని మీద కూర్చొని యోగాభ్యాసం చేయాలి.

6. ఇంట్లో – పురుషులు డ్రాయరు ధరించి యోగాభ్యాసం చేయాలి. స్త్రీలు తక్కువ బట్టలు, ముఖ్యంగా పంజాబీ డ్రస్సు ధరించడం మంచిది. సాధకులు యోగాభ్యాసం బహిరంగ ప్రదేశాల్లో చేస్తున్నప్పడు వదులుగా వున్నదుస్తులు ధరించాలి.

7. యోగాభ్యాసం చేస్తున్నప్పుడు, మలమూత్ర విసర్జన చేయవలసి వస్తే, లేచి వెళ్లి తప్పక చేయాలి. బలవంతాన ఆపుకోకూడదు. (తేపలు, తుమ్ములు, దగులు మొదలుగా గల వాటిని ఆపుకోకూడదు. దాహంవేస్తే కొద్దిగా నీళ్లు త్రాగవచ్చు.

8. తొందరపడకుండా, అలసట లేకుండా తాపీగా యోగాభ్యాసం చేయాలి. అలసట వస్తే కొద్దిసేపు శాంత్యాసనం లేక శవాసనంపేసి విశ్రాంతి తీసుకోవాలి.

9. సాధ్యమైనంతవరకు యోగాభ్యాసం ప్రతి రోజూ చేసూ వుండాలి.

10. యోగాభ్యాసం చేస్తున్నప్పడు మనస్సును, మస్తిష్కాన్ని దాని మీదనే కేంద్రీకరించాలి. యితర ఆలోచనల్ని సాధ్యమైనంత వరకు దరికి రానీయ కూడదు.

11. యోగాభ్యాసం పూర్తికాగానే తప్పక మూత్ర విసర్జన చేయాలి. ఆ మూత్రం ద్వారా లోపలి కాలుష్యం బయటికి వెళ్లిపోతుంది.

12.పెనుగాలి వీస్తున్నప్పడు దాని మధ్య యోగాభ్యాసం చేయకూడదు.

13. యోగాభ్యాసం చేస్తున్నప్పడు చెమటపోస్తే బట్టతో గాని, అరిచేతులతోగాని మెల్లగా ఆ చెమటను తుడవాలి. గాలిలో చెమట ఆరిపోయీ మంచిదే.

5. యోగనిషేధాలు

1. రజస్వల, వుంటు లేక గర్భవతి అయినప్పడు స్త్రీలు యోగాభ్యాసం చేయకూడదు. సూక్మయోగ క్రియలు మరియు ధ్యానం చేయవచ్చు.

2. బాగా జబ్బుపడినప్పడు, ఆపరేషను చేయించుకున్నప్పడు, ఎముకలు విరిగి కటు కట్టించుకున్నప్పడు యోగాభ్యాసం చేయకూడదు. తరువాత నిపుణుల సలహా తీసుకొని తిరిగి ప్రారంభించవచ్చు.

3. 8 సంవత్సరాల వయస్సు దాటే దాకా బాలబాలికలచే బలవంతాన యోగాభ్యాసం చేయించకూడదు.

4. మురికిగా వున్నచోట, పొగ మరియు దుర్వాసన వచ్చే చోట యోగాభ్యాసం చేయకూడదు.

5. యోగాభ్యాసం చేయదలచిన వాళు యోగశాస్త్ర నిపుణుల సలహాలు తీసుకోవడం అన్ని విధాల మంచిది.

6. యోగాభ్యాసానీకి అంతరాయాలు (లేక) యోగాభ్యాసమలాలు

పతంజలి మహర్షి తన యోగ దర్శనంలో యోగాభ్యాసానికి కలిగే అంతరాయాల్ని గురించి వివరిసూ “వ్యాధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యా విరతి బ్రాంతి దర్శనాలబ్ది భూమికత్వా నవస్థితత్వాని చిత్తవిక్షేపా: తే స్తరాయా:” అనగా ವ°gಧಿ, ನ್ಯಾನಿಂ, సంశయం, ప్రమాదం, ఆలస్యం, అవిరతి, భాంతి దర్శనం, అలబ్ద భూమికత్వం, అనవస్థితత్వం అనుకి అవాంతరాల్ని త్యజించాలని బోధించారు. యీ 9 అవాంతరాల్ని యోగమలాలు అని కూడా అంటారు.
1. వ్యాధి – శరీరంలో ఏర్పడే వ్యాధులు, రుగ్మతలు.

2. స్త్యానం – యోగసాధనకు అవసరమైన సామర్థ్యం లేకపోవుట.

3. సంశయం – యోగసాధనను గురించిన శంకలు, సందేహాలు.

4. ప్రమాదం – యమనియమాది యోగాంగాలను అనుష్టించ లేకపోవుట.

5. ఆలస్యం – అలసట, నిర్లక్యం వల్ల యోగసాధన చేయకపోవుట.

6. అవిరతి – ఇతర విషయాలలో లీనమై, యోగసాధన యెడ అనురాగం తగ్గుట.

7. భాంతి దర్శనం – యోగాభ్యాసం వివరాల విషయమై (భాంతి కలుగుట.

8. అలబ్ధభూమికత్వం – యోగాభ్యాసం చేస్తున్నప్పటికీ మనస్సు ఆ స్థాయిని లేక ఆ దశను పొందకపోవుట.

9. అనవస్థితత్వం – మనస్సు ఆయాస్మాయిలకు, అనగా దశలకు చేరుకున్నప్పటికి అక్కడ స్థిరత్వం అనగా నిలకడగా ఉండక పోవుట.




పైన తెలిపిన అవాంతరాలను ఆధిగమిస్తే సాధకులు యోగాభ్యాసం ద్వారా సులభంగా పూర్తి ప్రయోజనం పొందవచ్చు.