14. కూర్చొని వేయు ఆసనాలు (40-60 నిమిషాల కార్యక్రమం)

కూర్చొని వేయు ఆసనాలకు ఎక్కువ స్థలం అక్కరలేదు, కొద్దిపాటి స్థలంలో శుభ్రమైన బట్ట పరిచి దాని మీద శక్త్యానుసారం వీటిని అభ్యసించాలి. కూర్చొని వేయు ఆసనాల సంఖ్య అత్యధికం, కాని యిందు మేము వివరించిన యీ ఆసనాల క్రమాన్ని అనుసరించమని మా సలహా

1. నీస్పందభావాసనం:

ఇందు మనస్సుకు స్పందన ఉండకూడదు, అంటే యోచనలన్నీ తగ్గి వండాలి. కనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
కాళ్లు చాచి కూర్చోవాలి. రెండు కాళ్ల మధ్య 10 లేక 18 అంగుళాల దూరం వుండాలి. కాళ్లను వదులుగా వుంచాలి. రెండు చేతులు శరీరానికి వెనుక వైపున రెండు ప్రక్కల భూమిపై ఆన్చి వుంచాలి. శిరస్సును పైకి ఎత్తి, మెల్లమెల్లగా ল্প গুপ্ত పీల్చాలి, వదలాలి.

మొత్తం శరీరం మీద మనస్సును కేంద్రీకరించి అవయవాలన్నింటిని వదులు చేయాలి. యీ విధంగా అవసరమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. చేతులు అలిసిపోతే వీపును గోడకు ఆనించి యీ క్రియ చేయవచ్చు.

లాభాలు
ఇది శవాసనం వలె శరీర అవయవాలకు విశ్రాంతి కలిగిస్తుంది. తరువాత వివరించబడ్డ ఆసనాలు వేయునప్పుడు, అలసట కలిగితే మధ్య మధ్యన యీ ఆసనం వేస్తూ వుండాలి.

“శరీరానికి, మనస్చుకు విశ్రాంతి నిచ్చేది నేస్చంద భావాసనం”

2. ఉత్కు అవి పవనము కాసనం:

కూర్చొని వేయు యీ ఆసనము నందు వాయువు బయటికి వెళ్లిపోతుంది. కనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
కూర్చొని రెండు కాళు చాచాలి, వుడవులు రెండు కలపాలి. కుడి మోకాలును మడిచి రెండు చేతులతో పటుకొని తొడను పొట్టకు అణచాలి. శ్వాస వదులుతూ తలను దించి చిబుకాన్ని వెూకాలుకు ఆనించాలి. శ్వాస పీలుసూ కుడికాలును తిన్నగా చాచాలి.

కుడికాలు వలె, ఎడమ కాలుతో కూడా అదే విధంగా యీ క్రియ చేయాలి.

ఒక్కొక్క కాలుతో యీ క్రియ చేసిన తరువాత, ఒకే సారి రెండు మోకాళ్లను మడిచి తొడలను పొట్టకు అణచాలి. చిబుకాన్ని రెండు మోకాళ్ల మధ్య తాకించుటకు ప్రయత్నించాలి. యిది ఒక చక్రం, అనగా రౌండు అన్న వూటు, ఈ విధంగా రౌండు 3 ජීජ 4 సార్లు చేయాలి.

ఏ వయస్సులో వున్న వారైనా, ఏ పరిస్థితిలో వున్నవారైనా, పరగడుపున లేక ఆహారం తీసుకున్న4 లేక 5 గంటల తరువాత యీ క్రియ చేయవచ్చు.

లాభాలు
మోకాళ్ల నొప్పి, బొజ్జ, గాస్టిక్ ట్రబుల్, ఏసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం

“అపానవాయు వీసర్జనకు ఉత్కుట పవనముత్తాసనం”

3. పశ్చిమోత్తానాసనం:

పశ్చిమ అనగా వీపు, తానా అనగా లాగుట అన్నమాట. వీపును లాగి వుంచే ఆసనం గనుక దీనికి పశ్చిమోత్తానాసనం అని పేరు పెట్టారు.

విధానం
క్రింది క్రియలు ఒకొక్కటి చేస్తున్నపుడు ముందుకు వంగినప్పడు శ్వాస వదలాలి. లేచినప్పడు శ్వాస పీల్చాలి.

1) రెండు కాళ్లు ముందుకు చాచి ముందుకు వెనుకకు ఊగుతూ ఉండాలి. మోకాళ్లను పిక్కలను, కాలి ప్రేళ్లను చేతులతో తాకుతూ ఉండాలి.

2) కూర్యొని రెండు కాళ్లు చాచి రెండు చేతులు రెండు మోకాళ్ల మీద వుంచాలి.

3) ఆ మాదిరిగా వుంచి చేతులు యింకా కొంచెం ముందుకు చాచి పాదాల ప్రేళ్లు పటుకునేందుకు ప్రయత్నించాలి.

4) కాళ్లు చాచి, కాళ్ల බීර්” ගීවලීර వేళ్లు పటుకొని, “ඊටයිට మోచేతుల్ని 7.රිටඨයට మోకాళ్ల పక్కన భూమికి ఆనించుటకు ప్రయత్నించాలి. నుదురు ప్రక్రిక్త ముక్కు- మోకాళ్లను ప్రాకా కి.

లాభాలు నడవడానికి, ఎక్కువసేపు నిలబడడానికి వీపుకు శక్తి లభించడం అవసరం. ఒక్కొక్క స్మాయిని అభ్యసిస ඩීර්රටි స్మాయిని చేయుటకు ప్రయత్నించాలి. అట్టి శక్తి యీ ఆసనం వల్ల వీపుకు లభిస్తుంది. సూలకాయం తగుతుంది. వెన్నెముక చురుగా వుంటుంది. స్త్రీల ముట్లు సరిగా రాకపోతే యీ ఆసనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కఠినమైన ఆసనం. సూూలకాయులైన స్త్రీలు, పురుషులు, బొజ్జ గలవాళ్లు వెన్నెముక వంగని వాళ్లు యీ ఆసనం జాగ్రత్తగా, తొందరపడకుండా నెమ్మదిగా పేయాలి.

“యొక్క జోక్తిన్ పెంచేది పశ్చిమోత్తానాసనం”

4. వీస్తృతపాదహస్తాసనం లేక భూనమ నాసనం

కాళ్లను చాచి వాటిని దూరం దూరంగా వుంచి చేతులతో పాదాలు పట్టుకునే ఆసనం కనుక దీనికి విస్తృతపాదహస్తాసనం అని పేరు పెట్టారు.

విధానం
కూర్చొని రెండు కాళ్లు చాచి వాటిని సాధ్యమైనంత దూరంగా వుంచాలి, రెండు చేతులు ఎత్తాలి. నడుమును వంచుతూ రెండు చేతులతో పాదాలు తాకుతూ శిరస్సును నేలకు తాకించుటకు ప్రయత్నించాలి. వంగినప్పడు శ్వాస వదలాలి. శ్వాస పీలుస్తూ చేతులు పైకి ఎత్తాలి, యీ విధంగా 5 లేక 6 సార్లు చేయాలి.

లాభాలు
పిక్కలు, తొడలు, నడుము, వీపుకు బలం లభిస్తుంది. బొజ్జ తగుతుంది.

“పిక్కలకు బలం చేకూర్చేది వేస్తృతపాదహస్తాసనం”

5. ఆకర్షపాదహస్తాసనం

ఇందు చేతితో రెండవ పాదాన్ని తాకుతూ చెవిని మోకాలుకు ఆనిస్తారు కనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
కూర్చొని రెండు కాళ్లు చాచి సాధ్యమైనంత దూరంగా వాటిని ఉంచాలి. కుడిచేతో ఎడమ పాదాన్ని తాకుతూ, కుడి చెవిని ఎడమ మోకాలుకు తాకించుటకు ప్రయత్నించాలి.

అదే విధంగా ఎడమ చేతితో కూడా చేయాలి. ఇట్లు వరుసగా అటు ఇటు 10 లేక 12 సార్లు చేయాలి.

లాభాలు
వీపు, వెన్నెముక, మెడ, కాళ్లు బలపడి, చురుకుగా ఉంటాయి. నొప్పలు

“మెడ, వెన్నెముకకు చురుకుదనం ప్రసాదించేది ఆర్థపాదహస్తాసనం”

6. భద్రాసనం

యోగాసనాలలో సింహం, పద్మం, వజం, భద్రం అను 4 ఆసనాలు ప్రధానమైనవి. భద్రతకు ప్రాధాన్యం యిచ్చు ఆసనం కనుక యొూ ఆసనానికి భద్రాసనం అని పేరు వచ్చింది.

విధానం
రెండు కాళ్లు చాచి కూర్చోవాలి. రెండు వెూకాళు వుడిచి, రెండు అరికాళ్లు కలపాలి. కలిపిన రెండు అరికాళ్లు మొల్లమెల్లగా గజ్జల దగ్గరకు తెచ్చి ఆనించాలి. రెండు చేతులతో రెండు మోకాళ్లను నేల వైపు అణచాలి. తరువాత రెండు చేతుల ప్రేళ్లు కలిపి రెండు పాదాల వేళ్లను పటుకోవాలి. శ్వాస సామాన్యంగా వుండాలి. కండు మూయాలి. మల ద్వారం, జననేంద్రియం మధ్య భాగం అనగా మూలాధార చక్రం మీద మనస్సును కేంద్రీకరించాలి. కొద్దిసేపు తరువాత కాళ్లు చాచి చేతులతో మోకాళ్ల మీద పాదాల మీద టప టప కొట్టి విశ్రాంతి యివ్వాలి.

లాభాలు
తొడలు, మోకాళ్లు, పిక్కలు చురుకుగా ఉంటాయి. జననేంద్రియాల జబ్బులు తగుతాయి. మనస్సుకు భద్రత లభిస్తుంది.

“మనస్సుకు భద్రత నిచ్చేది భదాసనం”

7. పక్షి క్రియ

పడిరెక్కల వలె మోకాళ్లు కదులుతూ ఉండటం వల్ల యీ క్రియకు పజీ క్రియ అని పేరు వచ్చింది.

విధానం
కూర్చొని కాళ్లు తిన్నగా ముందుకు చాచాలి. తరువాత రెండు మోకాళ్లు మడిచి, రెండు అరికాళ్లు, రెండు మడమలు కలిపి పాదాల్ని నమస్కార రూపంలో ఉంచాలి. పాదాలు జననేంద్రియానికి కొద్దిగా అంటి ఉండాలి. రెండు చేతుల ప్రేళ్లు కలిపి, రెండు పాదాల ప్రేళ్లను భద్రాసనంలో వలె పట్టుకోవాలి.

‘ ඊටයිථ మోకాళ్లను క్రిందికి, పైకి, పడి రెక్కల ඊරට් පි`ඩු సేపు ఎత్తుతూ, దింపుతూ ఉండాలి. తరువాత కాళ్లు చాచాలి.

శ్వాస సామాన్య పద్ధతిలో ఉండాలి. యీ క్రియను 2 లేక8 సార్లు చేయాలి.

లాభాలు
మోకాళ్ల నొప్పి, తొడల నొప్పి, తొడ జాయింట్ల నొప్పి తగుతుంది. ඊටිර්ට ශිවජ అయినట్లు భావం కలుగుతుంది. అందరూ యీ క్రియ చేయవచ్చు.

“శరీరం తేలిక అయినతల్లె భావం కల్గించేది పక్షి(కీయ”

8. గోరక్షాసనం

గురు గోరఖనాథుడు యీ ఆసనం వేసూ వుండే వాడు కనుక దీనికి గోరజాసనం అని పేరు వచ్చింది.

విధానం
భద్రాసనంలో వలె రెండు అరికాళ్లు కలిపి గజ్జలకు ఆనించాలి. రెండు చేతులు నేల మీద ఉంచి నొక్కుతూ, పిరుదుల్ని ఎత్తి మడమల మీద ఉంచాలి. బాలెన్సు సరిపోగానే, రెండు చేతులు, రెండు మోకాళ్లపై నొక్కి ఉంచాలి. కొద్ది సేపు అలా వుంచి, తరువాత చేతులు రెండిటినీ ఛాతీ దగ్గరకు గాని లేక పైకి ఎత్తిగాని కలిపి నమస్కరించాలి. శ్వాస సామాన్యంగా ఉండాలి.

లాభాలు శుక్ర గ్రంథులకు =ெ కలిగి వీర్య రక్షణ జరుగుతుంది. మూత్ర దోషాలు పోతాయి. స్త్రీల ముట దోషాలు తగుతాయి. లుకోరియా, నడుము నొప్పి తగు ముఖం పడతాయి.

నిషేధం
కొవ్వు అధికంగా వున్నవాళ్లు, గుండె జబ్బు గలవాళ్లు యీ ఆసనం జాగ్రత్తగా వేయాలి.

“శుక్ర (గంధులకు శక్తి నీచ్చేన్ గోరక్షాసనం”

9. మేరు దండాసనం (పలు ఆసనాల సంపుటి)

పేురుదండాసనాన్ని గురించి, పడుకొని వేయు ఆసనాలలో ముఖ్య ఆసన రూపంలో విస్తారంగా వివరించాము. కూర్చొని వేయు ఆసనాలలో కూడా మేరు దండాసనం కడు సులభమైనదే గాక ప్రధానమైనది కూడా,

మేురుదండం అనగా వెన్నెముక. ఇది వెన్నెముకకు, చురుకు తనం తెచ్చే ఆసనం, దీనికి సంబంధించిన వివిధ క్రియలను గురించి క్రింద వివరిస్తున్నాము.

క్రింద తెలిపిన ప్రతి క్రియను, కుడి వైపుకు, ఎడమ వైపుకు 5 నుంచి 10 సార్ల వరకు నెమ్మదిగా చేయాలి. ప్రతిసారి శ్వాస వదులుతూ ప్రక్కకు తిరగాలి. శ్వాస పీలుస్తూ మధ్య స్థితికి రావాలి. ఇందు వెన్నెముక మరియు నడుముపై ధ్యానం కేంద్రీకరించాలి.

క్రియలు
1) రెండు కాళ్లు ముందుకు చాచి, రెండు అరచేతులు కుడి తొడకు ప్రక్కన నేలకు ఆన్చాలి. క్రిందికి వంగుతూ నుదురు, ఛాతీలను నేలకు ఆ – కో ం చాగ – టు కు ప్రయుత్నించాలి. ఈ క్రియను కుడి వైపుకు ఒకసారి, ఎడమ వైపుకు ఒకసారి వరసగా చేసూ వుండాలి.

2) రెండు చేతులు వెనుక వైపుకు నేలకు ఆనించి, రెండు కాళ్లు తిన్నగా చాచి, రెండు మడమలు, కాళ్ల రెండు బొటన ప్రేళ్లు కలపాలి. నడుమును కుడి వైపుకు వంచాలి. ఎడవు ( వైపుకు చూడాలి. తరువాత మధ్య స్థితికి రావాలి. ඡායී విధంగా రెండో వైపు కూడా තීරණ්‍ය – ව.

3) (అ) రెండు చేతులు వెనుక వైపున నేలకు ఆనించి రెండు కాళు తిన్నగా చాచి, కుడి కాలు ఎడవు కాలిపై క్రాస్ చేసి వుంచాలి. నడువును కుడివైపుకు వంచుతూ, ఎడమ వైపుకు చూడాలి. మధ్య స్థితికి వచ్చి నడువును ఎడవు వైపుకు వంచుతూ కుడి వైపుకు చూడాలి.

(ఆ) ఎడమ కాలును క్రాస్ చేసి కుడి కాలిపై వుంచి పై విధంగా రెండువైపుల చేయాలి.

4) అ) కుడి మడమను, ఎడమ పాదం వ్రేళ్లపై ఉంచి, పై క్రియను రెండువైపులకు తిరిగి చేయాలి.

ఆ) ఎడమ మడమను కుడి పాదం (వే 했 ఉంచి, పై (కించును రెండు వైపులకు తిరిగి చేయాలి.

5)అ) కుడి అరికాలును, ఎడమ వెూకాలిపై వుంచి కుడి మెూకాలును రెండు దిక్కుల నేలకు తాకించుటకు ప్రయత్నించాలి.

ఆ) ఎడమ అరికాలును, కుడి వెూకాలిపై వుంచి ఎడవు వెూకాలును రెండు దిక్కుల నేలకు తాకించుటకు ప్రయత్నించాలి.

6) రెండు చేతులు వెనుక వైపుకు నేలకు ఆనించి, రెండు వెూకాళు వుడిచి రెండు వుడవుల్ని పిరుదుల దగ్గరకు తేవాలి. రెండు మోకాళ్లు కుడివైపుకు వంచి ఎడవు వైపుకు చూడాలి. తరువాత అదే విధంగా రెండో వైపుకు కూడా చేయాలి.

7) ‘ိည స్థితిలో ‘රිටඨ మోకాళ్లు కలిపి, కుడి మోకాలు కుడివైపుకు, ఎడమ వెJ” కాలు ఎడ వు వైపుకు వంచుతూ, పైకి ఎతుతనా దింపుతూ వుండాలి.

8) పై స్థితిలో వలె రెండు మోకాళ్లు కలిపి, పిరుదులు లేపుతూ, మోకాళ్లు నేలకు తాకించి ජී”ඩු సేపు అలా వుంచి, తరువాత యధాస్థితికి రావాూ శ్రీ

9) పై స్థితిలో వలె రెండు మోకాళ్లు కలిపి, పిరుదుల్ని కొద్దిగా పైకి లేపి ‘රි ට ඨථ వెూకాళు గుండంగా త్రిప్పాలి. తరువాత రివర్చు కూడా చేయాలి.

10) రెండు చేతులు వెనుకకు నేలకు ఆనించి, రెండు వెూకాళ్ల మధ్య, రెండు వుడవుల మధ్య అడుగు దూరం వుంచి రెండు వుడవుల్ని పిరుదుల దగ్గరకు తేవాలి. రెండు వెనా కాళు కుడి వైపున నేలకు ఆనించుతూ ఎడ వువైపుకు చూడాలి. ఎడమ మోకాలు, కుడి మడమును తాకాలి.

ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి.

11) ‘රි ට ඨරථ కాళు వఎుందుకు తిన్నగా చాచి, కుడి కాలు ఎత్తి, సాధ్యమైనంత వరకు ఎడవువైపున భూమిని తాకాలి. కుడి వైపుకు చూడాలి. అదే విధంగా ఎడమ కాలును కూడా ఎత్తి చేయాలి.

12) రెండు కాళ్లు ముందుకు తిన్నగా చాచి, రెండు కాళ్లు కలిపి ඩීපී ඞ පටි ఎత్తి కుడివైపు భూమిని తాకాలి. ఎడమ వైపుకు చూడాలి. అదే విధంగా రెండో వైపుకూడా చేయాలి.

ప్రతి స్థితికి 4 లేక 5 సెకండ్ల సమయం యివ్వాలి. మధ్యన చేతులు అలిసిపోతే చేతులు ఎత్తి ప్రక్కలకు చాచి, వదులు చేసి కొద్దిసేపు కదిలిసూ ఉండాలి. తరువాత ఒక చేతితో మరో చేతి మీద మూలీసు చేయాలి. యిలా చేస్తే అలసట తొలగిపోతుంది. తరువాత క్రియను ప్రారంభించి చేయాలి.

లాభాలు
ఈ ఆసనం వల్ల శరీరానికంతటికీ గొప్ప ప్రయోజనం కలుగుతుంది. మెడకు, వెన్నెముకకు చురుకుదనం లభిస్తుంది. పొట్ట యందలి లివరు, పేంక్రియాస్, మూత్రపిండాలు, స్పీను, పేగులు వీటి రుగ్మతలు తొలగి శక్తివంతం అవుతాయి. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. చేతులు కాళ్లు బలపడతాయి.

“వెన్నెముక యొక్క చురుకుతనం పెంచేది మేయదండాసనం”

10. వజ్రాసనం

వజ్రనాడి శరీరమందలి మలరంధం మరియు అండకోశానికి మధ్య వుంటుంది. ఈ ఆసనం వజ్రనాడిని ప్రభావితం చేస్తుంది. కనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. మోకాళ్లు క్రిందికి మడిచి రెండు పాదాల మీద పిరుదులు ఆనించి, మోకాళ్ల మీద చేతులు ఉంచాలి. శిరస్సును, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భోజనం చేసిన తరువాత యీ ఆసనంపేసి 15 లేక 20 నిమిషాలు వుంటే లాభం కలుగుతుంది.

ఆరంభంలో ఒక కాలి మీద, తరువాత రెండో కాలి మీద కూర్చొని అభ్యాసం చేయాలి.

లాభాలు
అజీర్తి, వాతం, సైటికా నొప్పి తగుతాయి. పిక్కలు, మోకాళ్లు, తొడలు బలపడతాయి. భోజనం జీర్ణం అయ్యేందుకు యూ ఆసనం ఉపయోగ పడుతుంది. భోజనం చేసిన తరువాత వేసే ఆసనం యిది ఒక్కటే.

నిషేధం
మోకాళ్ల నొప్పి వున్నవాళ్లు ఆరంభంలో యీ ఆసనం వేయకూడదు. మెత్తని గద్దె మీద కూర్చొని ఆరంభంలో యీ ఆసనం వేయవచ్చు.

విశేష సూచన
ఈ ఆసన ప్రయోజనం తెలుసుకొని అన్ని మతాల వాళ్లు దీన్ని పేస్తున్నారు. నమాజు చేసేటప్పుడు ముస్లిములు యీ క్రియను చేస్తారు. కనుక దీన్ని నమాజు ఆసనం అని కూడా అంటారు.

‘జీర్ణ శక్తినీ పెంచేది వజ్రాసనం’

11. శశాంకాసనం లేక వజ్రాసన యోగము(ద

శశాంకం అంటే కుందేలు. కుందేలు వలె కూర్చొని వేయు ఆసనం కనుక దీనికి శశాంకాసనం అని పేరు వచ్చింది.

విధానం
1) వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులు నడుము వెనుకకు పెట్టి ఒక చేతితో రెండవ చేతి మణికటును పట్టుకోవాలి.

శ్వాసవదులుతూ వుందుకు వంగాలి. నుదుటిని నేలకు ఆన్చుటకు ప్రయత్నించాలి. పిరుదుల్ని మడమల మీద నుంచి కదపకూడదు.

శ్వాస పీలుసూ యధాస్థితికి రావాలి. ప్రారంభంలో సాధ్యమైనంత వరకు వంగాలి. సామాన్యంగా 5 లేక 6 సార్లు యీ క్రియ చేయాలి. మెదడు మీద మనస్సును కేంద్రీకరించాలి.

2) రెండు పిడికిళ్లు బిగించి నాభికి ఇరువైపుల ఆన్చి పైక్రియ చేయాలి. పొట్ట మీద ధ్యానం వుంచాలి.

3) రెండు చేతులు గుంజి పైకి ఎత్తి వంగుతూ పై క్రియ చేయాలి, చేతుల మీద ధ్యానం వుంచా චී.

4) రెండు చేతులు రెండు ప్రక్కలకు చాచి యీ క్రియ చేయాలి. ఛాతీ మీద ధ్యానం ඊරටඤ°ච්.

5) రెండు చేతుల ప్రేళ్లను కలిపి ఇంటర్లాక్ చేసి మెడ మీద వుంచి యీ క్రియ చేయాలి. రెండు మోకాళ్లను, రెండు మోచేతులతో తాకాలి. మెడ మీద ధ్యానం వుంచాలి.

6) రెండు చేతులు వెనుకకు తెచ్చి పటుకొని వంగుతూ చేతులు పైకి లేపాలి. నడుం మీద ధ్యానం వుంచాలి.

లాభాలు
పవన ముక్వెసనం వల్ల కలిగే లాభాలన్నీ శంశా కాసనం వల్ల కలుగుతాయి. నడుము, మెడ నొప్పలు తగుతాయి. కోపం తగుతుంది. కోపం వచ్చినా త్వరగా శాంతిస్పంది.

“కోపాన్ని తగ్గించేది శశాంకాసనం”

12. ఉష్ట్రాసనం

ఉష్ట్రం ෂටහී 8.ටයි. ටයර් – ජැටර්රථඒ* ඊෆිර් స్థితి ఒంటె ඝෆිර් ර්ට් කොටළු” ° వుంటుంది కనుక దీనికి ఉప్రాష్ట్రాసనం అని పేరు వచ్చింది.

విధానం
1) వజ్రాసనం వేసి రెండు చేతులు నడుముకు ఆన్చి కూర్చొవాలి. శ్వాస పీలుస్తూ వెూకాళు నేలకు ఆనించి, పిరుదులు, తొడలు లేపాలి. శ్వాసవదులుతూ క్రిందికి రావాలి. మోకాళ్లకు పాదాలకు మధ్య కొద్దిదూరం ఉండాలి. ఈ క్రియ నాలుగైదుసార్లు చేయాలి. ఈ క్రియ ఉప్రార్ధాసనానికి మొదటి మెటు.

2) పై స్థితిలోనే చేతులు పైకి ఎత్తుతూ ఈ క్రియ చేయాలి.

3) వ జాసనంలో కాలి వ్రేళ్లపై కూర్చొవాలి. రెండు చేతులతో రెండు వుడవులను పట్టుకోవాలి, శ్వాస బాగా పీలుసూ పొట్ట, తొడలు, పిరుదులు లేపి, తలను, వెన్నెముకను వేనుకకు వంచాలి. লৈ গুপ্ত వదులుతూ యు” స్థితికి రావాలి. యీ క్రియ నాలుగైదు సార్లు చేయాలి.

సూచన
శరీరం వెనుకకు వంచినప్పడు మోకాళ్ల మీద శరీర భారం మోపి, బాలెన్సు సరిగా వుండేలా చూచుకోవాలి. లేనిచో పడిపోవచ్చును.

లాభాలు
ఛాతీ, ఉపిరితిత్తులు, గుండెలకు సంబంధించిన జబ్బులకు యీ ఆసనం బాగా పనిచేస్తుంది. సూలకాయాన్ని తగ్గిస్తుంది. వెన్నెముకకు చురుకుదనం తెస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మోకాళ్లు, తొడలు, నడుము, వీపు, బుజాలు, మెడ మొదలగు అవయవాలన్నిటికి బలం చేకూరుతుంది.

“మెడ, ఛాతీ యొక్క శక్తినీ పెంచేది ఉ(ష్ణాసనం’

13. సుప్తవజ్రాసనం

వజ్రాసనంలో పడుకోవడాన్ని సుప్త్తవ|జాసనం అని అంటారు.

విధానం
వజ్రాసనం వేసి కూర్చోవాలి. రెండు అరచేతుల్ని శరీరం ప్రక్కన నేలకు ඡබීටඩ්” චී. చేతివేళ్లు ముందు వైపుకు ఉండాలి. తరువాత ఒక దాని తరువాత మరొక మోచేతిని నేలకు అనించుతూ శిరస్సు వెనుక భాగాన్ని నేలకు తాకించుటకు ప్రయత్నించాలి. రెండు చేతులు ఎత్తి తొడలపై ఉంచాలి. లేక రెండు చేతులు జోడించి ఛాతీ దగ్గర ఉంచాలి. శ్వాస సామాన్యంగా ఉండాలి. 5 సెకండ్ల నుంచి రెండు నిమిషాల వరకు అలా ఉండి, తరువాత మోచేతుల్ని నేలకు నొక్కి ఆన్చుతూ పైకి లేచి వజ్రాసన స్థితికి రావాలి,

రెండు మూడు సార్లు యీ క్రియ చేయాలి. ప్రారంభంలో శరీరాన్నివెనుకకు వెల్లవెల్లగా వంచుటకు ప్రయత్నించాలి. కొద్ది రోజుల తరువాత అభ్యాసం అవుతుంది. ఆ తరువాత క్రింద తెలిపిన యీ క్రియు రెండవ స్మాయి చేయాలి.

వజ్రాసనంలో కూర్చొని, మోకాళ్లు గట్టిగా పట్టుకోమని మరొకరికి చెప్పాలి. రెండు చేతులు ఛాతీ దగ్గర కటుకొని ఉండాలి. యీ స్థితిలో సుప్త్త వజ్రాసనం క్రియ 4 లేక 5 సార్లు వెంట వెంటనే చేయాలి.

శ్వాస పీలుస్తూ వెనుకకు వంగాలి. క్రిందికి వంగిన తరువాత శ్వాస వదలాలి. శ్వాని పీలుసూ పెకి లేవాలి.

సూచన
ప్రారంభంలో వెనుకకు వంగ లేకపోతేకి లేక4 దిండ్లు పెట్టి, రోజూ ఒక్కొక్క దిండు తొలిగిసూ యీ ఆసనాన్ని అభ్యాసం చేయాలి.

లాభాలు
పొట్ట యందలి అవయవాలకు, మెడ యందలి కండరాలకు స్ఫూర్తి లభిస్తుంది. ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. బ్రాంకెటిస్, ఆస్తమా తగుతాయి. నడుము, చీలమండలు బాగుపడతాయి. తొడలు పిక్కలు సరి అవుతాయి. గట్టి పడతాయి. రెండు గ్లాసుల నీళ్ల త్రాగి యీ ఆసనం వేస్తే మలబద్ధకం తగుతుంది.

సూచన ఈ ఆసనం కఠినమైనది కనుక త్వరపడకుండా నెమ్మదిగా “ඕරෑරය – ව. మోకాళ్ల నొప్పి, నడుంవొప్పి వున్నవాళ్లు నొప్పి తగ్గిన తరువాత యీ ఆసనం వేయాలి.

“పిక్కలకు, తొడలకు, నడుముకు శక్తినిచ్చేది సుప్త్తవ్యజాసనం”

14. మార్గారాసనం

మారారం లేక మారాలం అంటే မိိဒ္ဓိ అని అర్థం. పిల్లి వలె కూర్చునే ఆసనం కనుక దీనికి మారారాసనం అని పేరు వచ్చింది.

విధానం
1) వజ్రాసనం వేసి కూర్చోవాలి. శరీరం ముందుకు వంచుతూ రెండు మోకాళ్లు, రెండు అరచేతులు నేలకు ఆన్చాలి. నడుమును పైకి ఎత్తి, తలను కొద్దిగా క్రిందికి దింపాలి. శ్వాసవదలాలి.

2) రెండో స్థితిలో నడుం క్రిందకు వంచి శిరస్సు పైకి ఎత్తి శ్వాస పీలుసూ యీ క్రియ చేయాలి.

5 లేక 6 సార్లు యీ రెండు క్రియలు వరుసగా చేయాలి.

లాభాలు
నడుం నొప్పి తగ్గి పోతుంది. వెన్నెముకకు చురుకుదనం వస్తుంది. పొట్ట యందలి వ్యర్థపు (కొవ్వు తగుతుంది.

‘నడుము నొప్పిన్ తగ్గించేది మార్ధారాసనం”

15. వ(కాసనం

ఇందు శరీరం వంకరగా వుంటుంది. కావున దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. కుడి అరికాలు ఎత్తి ఎడమ మోకాలు దగ్గర వుంచాలి. కుడి అరచేతిని కుడివైపున నేలపై వుంచాలి. కుడి చేతి ప్రేళ్లు వెనుక వైపుకు వుంచాలి. ఎడమ చేతిని కుడి మోకాలుపైగా తీసి కుడిపాదం ప్రేళ్లు పట్టుకోవాలి. అది సాధ్యం కాని ఎడల, కుడి మోకాలును పట్టుకోవాలి.

శ్వాస వదులుతూ, కుడి వైపుకు నడుము, బుజం మళ్లిస కుడి ప్రక్కకు తిరిగివెనుకకు చూడాలి. వీపు అంతా ప్రక్కకు తిరగాలి. శ్వాస పీలుస్తూ యధాస్థితికి రావాలి. 5 లేక 6 సార్లు యీ విధంగా చేసిన తరువాత కాళ్లు చేతులు మార్చి ఎడమ వైపుకు కూడా అదే విధంగా చేయాలి.

లాభాలు
మత్చేంద్రాసనానికి యిది ముందు మెట. వెన్నుముక, వీపు మరియు మెడల నొప్పలు తగుతాయి. పొట్ట యందలి అవయవాలకు శక్తి లభిస్తుంది. యిది మధుమేహం జబ్బుకు బాగా పని చేస్తుంది.

“మధ్య శరీర అవయవాలకు శక్తినీచ్చే సరళ ఆసనం వ్యకాసనం”

16. మత్స్యేం(దాసనం

మత్చేంద్ర నాథుడను మహాయోగి యీ ఆసనం వేసూ ఉండినందున దీనికి మల్యేంద్రాసనమని పేరు వచ్చింది. అర్ధమత్యేంద్రాసనం వేయడం సులభం,

విధానం
వ (జాసనంలో కూల్చోవాలి. కుడికాలు తీసి ఎడమ మోకాలు ప్రక్కన నిలిపి ఉంచాలి. కుడి చేయి తిన్నగా శరీరం ప్రక్కన కుడి వైపు నేలకు ఆనించాలి. కుడి చేతి ప్రేళ్లు వెనుకకు ఉంచాలి. ఎడమచేతిని పైకి ఎత్తి, కుడి మోకాలును క్రాస్ చేసూ తిన్నగా కుడి పాదం వ్రేళ్లను పటుకునేందుకు ప్రయత్నించాలి. అది సాధ్యం కాని యెడల కుడి వెూకాలును పట్టుకోవాలి. శ్వాస వదులుతూ కుడి వైపుకు నడుము, బుజం మళ్లిసూ ప్రక్కకు తిరిగి వెనుకకు చూడాలి. వక్రాసనంలో వలె వీపు అంతా వెనుకకు తిరగాలి. శ్వాస పీలుసూ యధాస్థితికి రావాలి. 5 లేక 8 సార్లు చేసిన తరువాత కాళ్లు చేతులు మార్చి కూడా యీ క్రియ చేయాలి.

వక్రాసనం వేయడం అభ్యాసం చేస్తే, మత్యేంద్రాసనం వేయడం సులభం.

లాభాలు
వెన్నెముక, వీపు, కండరాలు బలపడతాయి. వెన్నెముక, నాడీ మండలం సామర్థ్యం పొందుతాయి. నడుము దగ్గర కొవ్వు తగుతుంది. పేంక్రియాస్ గ్రంధి బాగా పని చేస్తుంది కనుక మధుమేహం కంట్రోలు అవుతుంది. మలబద్ధకం తగ్గి ఆకలి పెరుగుతుంది. యీ ఆసనాన్ని సకల రోగ నివారిణి అని అనవచ్చు.

“మధుమేహ నీవారణకు మత్చేం(దాసనం”

17. గోముఖాసనం

గోవు ముఖం రూపంలో ఉండటం వల్ల యీ ఆసనానికి గోముఖాసనం అని పేరు వచ్చింది.

విధానం
వజ్రాసనంలో కూర్చోవాలి. కుడి కాలు బయటికి తీసి, ఎడమ మోకాలు మీద కుడి మోకాలు వుంచి కుడి మోచేతిని, పైకి ఎత్తి ఎడమ చేతో కుడి చేతిని వీపు వెనుక నుంచి పటుకోవాలి.

శ్వాస వదులుతూ పొట్టను లోపలికి అణచాలి. నుదురును ముందుకు వంచి కుడిమోకాలుకు ఆనించాలి. ఈ విధంగా 4 లేక 5 তস্য చేయాలి.

అదే విధంగా కాళ్లు చేతులు మార్చి యీ క్రియ చేయాలి.

సూచన
ప్రారంభంలో చేతులు పటుకోవడం సాధ్యం కాకపోతే రుమాలును సాధనంగా ఉపయోగించాలి.

చేతులు వెనుకకు ఎత్తలేకపోతే పాదాల బొటన వ్రేళ్లను పట్టుకొని యీ క్రియ చేయాలి.

లాభాలు
పొట్టలోని అవయవాలకు, పొట్ట కండరాలకు, వెన్నెముకకు లాభకారి. గ్రంధుల్లో చురుకుతనం తెస్తుంది. మెడ నొప్పలు తగుతాయి. మధుమేహం, అతిమూత్రం, ఇంద్రియ బలహీనత, రక్తపు పోటు, హెర్నియాలకు యీ ఆసనం పని చేస్తుంది. శరీర అవయవాల సంధుల (జాయింట్లు) నొప్పలు, కీళ్ల నొప్పలు

“కీళ్ల నొప్పలు తగ్గించేది గోముఖాసనం”

18. పాదచాలనక్రియ

కాళ్లు కదిలించే ఆసనం గనుక దీనికి యీ పేరు వచ్చింది.

కాళ్లు చాచి కూర్చోవాలి. రెండు చేతులు వెనుక భూమిపై ఆనించాలి.

విధానం
1. తిన్నగా చాచి యున్న కుడి కౌలును ఎత్తి పూర్తి కాలును గుండ్రంగా 6 లేక 8 సార్లు త్రిప్పాలి. తిరిగి రివర్చు చేయూలి.

2. అదే విధంగా ఎడమకాలును _ ఎత్తి లుసా (కింను రెండు ప్రక్కలకు చేయాలి.

3. రెండు కాళ్లు ఒకే సారి ఎత్తి పై విధంగా 6 లేక 8 సార్లు త్రిప్పాలి.

లాభాలు
తొడల జాయింట్లు బలపడుతాయి. కాళ్ల నరాలు, కండరాలు శక్తివంతం అవుతాయి.

“తొడల జాయింట్లకు 232C చేకూర్చునది పాదచాలన (కీయ

19. చక్కీచాలనక్రియ

చక్కీ అనగా తిరగలి. తిరగలి వలె చేతులు తిరుగుతాయి కనుక దీనికి చక్కీ చాలన క్రియు అని పేరు వచ్చింది.

విధానం
1) రెండు కాళు చాచి కూర్చోవాలి. రెండు చేతులు చాచి, రెండు అరచేతులు కలిపి, రెండు చేతుల ప్రేళ్లను మెలిక వేసి కలిపి, రెండు చేతుల్ని తిరగలి చక్రంలా గుండంగా త్రిప్పాలి. 8 నుంచి 10 సార్లు యిలా చేయాలి. ముందుకు వంగుతూ శ్వాసవదలాలి. వెనకకు వసూ శ్వాస పీల్చాలి. చేతులతో కాలి ప్రేళ్లను తాకుటకు ప్రయత్నించాలి. మోకాళ్లు వంగకూడదు. అదే విధంగా రివర్సు కూడా చేయాలి.

2) చేతులు రెండూ కలిపి పైకి ఎత్తి నడుము, ఛాతీలను కూడా పై క్రియవలె పూర్తిగా త్రిప్పతూ కాలివ్రేళ్లను తాకుటకు ప్రయత్నించాలి. రెండు వైపుల8 లేక 10 సార్లు యీ క్రియ చేయాలి. శ్వాస వదులుతూ చేతులు ముందుకు చాచి, శ్వాస పీలుస్తూ చేతులు పైకి ఎత్తాలి. లాభాలు బొజ్జ తగుతుంది, పిక్కలు, తొడలు, ఛాతీ బలపడతాయి. జీర్ణశక్తి “పెరుగుతుంది.

‘జీర్ణశక్తినీ పెంచేది చక్కీచాలన్వకియ’

20. పాదోత్తానాసనం లేక ఉత్తానపాదాసనం

కాళ్లు ఎత్తి చేయు క్రియ కనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
1) రెండుకాళ్లు తిన్నగా చాచాలి. కుడి పిక్క పటుకొని కాలును ఎత్తాలి. మోకాలు వంగకుండా శ్వాస వదులుతూ పైకి వుంచి దానిని తలతో త్రాకుటకు ప్రయత్నించాలి.

శ్వాస పీలుస్తూ నెమ్మదిగా కాలును క్రిందికి దించాలి.

2) అదే విధంగా ఎడమ కాలుతో చేయాలి.

3) అ. రెండు కాళ్ల పిక్కలు పటుకొని ఎత్తి మోకాళ్లను తలతో తాకుటకు ప్రయత్నించాలి. ముందుకు వెనుకకు శరీరాన్ని ఊపాలి.

ఆ, రెండు కాళ్ల దూరంగా ఉంచి కూడా పై క్రియ చేయూలి.

లాభాలు
కాలి యొక్క నరాలు గట్టి పడతాయి. నడుము బలపడుతుంది.

“నడుము నుంచి కాలి (వేళ్ల వరకు శక్తినిచ్చేది పాటోత్తానాసనం’

21. పూర్వోతానాసనం

ఇలాంతా పశ్చిమోత్తానాసనానికి రివర్సు పూర్వోత్తానాసనం.

విధానం
రెండు కాళ్లు కలిపి ముందుకు చాచి రెండు చేతులు వెనుకవైపు నేల మీద ఆన్చాలి. రెండు చేతులు, రెండు కాళ్లు నేల మీద నొక్కుతూ శ్వాస పీలుసూ పిరుదులు పొట్ట, ఛాతీ, తొడలు అన్నింటినీ పైకి ఎత్తాలి. శిరస్సును వదులు చేసూ వెనుకకు వంచాలి. శ్వాస వదులుతూ యధాస్థితికి రావాలి. 5 లేక 6 సార్లు యీ క్రియ చేసిన తరువాత పై స్థితిలోనే నడుమును కుడి ఎడమ రెండువైపులకు ఇటునటు త్రిప్పాలి.

లాభాలు
చేతులు, ఛాతీ, నడుము బలపడతాయి, నొప్పలు తగుతాయి.

‘నడుము నొప్పిన్ తగ్గించేది పూర్వోత్తానాసనం”

22. నా భీదర్శనాసనం

ఇందు నాభిని చూడటం జరుగుతుంది గనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
పైన తెలిపిన పూర్వోత్తానాసనంలో వలె రెండు చేతులు రెండు కాళ్లు నేల మీద నొక్కుతూ శ్వాస పీలుస్తూ పిరుదులు, పొట్ట, ఛాతీ, తొడలను పైకి ఎత్తాలి. శిరస్సును ఎత్తి నాభిని చూడాలి. శ్వాసవదులుతూ యధాస్థితికి లావాలి.

లాభాలు
చేతులు, కాళ్లు, నడుము, మెడ బలపడతాయి. నాభి శక్తి పెరుగుతుంది.

“నాభికి శక్తి కలిగించేది నాభిదర్శనాసనం”

23. సుఖాసనం

೩ರ್ సుఖంగా కూర్చొని వేసే ఆసనం సుఖాసనం. యిది సులభమైన ఆసనం.

విధానం
1) బాచీపట్ల పేసుకొని కూర్చోవాలి. వంగ కూడదు. మెడ, వెన్నెముక, నడుం నిటారుగా వుండాలి.

2) రెండు వెూకాళు వంచి, వాటిని రెండు చేతులతో పట్టి హాయిగా కూర్చోవాలి. ముందుకు వెనకకు కొద్దిగా ఊగవచ్చు కూడా.

3) రెండు మోకాళ్లు దగ్గరకు తెచ్చి పైపంచతో వాటిని కట్టి హాయిగా కూర్చోవాలి. పై క్రియలో శ్వాస సామాన్యాంగా ఉండాలి. కుర్చీల మీద కూర్చోవడం బాగా అలబాటు పడినవాళ్ళు, మోకాళ్లు ముడిచి కూర్చోవడం అంటే కొంచెం శ్రమ పడతారు. కాని అభ్యాసం అయితే తేలిక అవుతుంది.

లాభాలు
ఈ ఆసనంలో ఎక్కువ సేపు విశ్రాంతిగా కూర్చోవచ్చు. కనుక, పూజ, తపము, ధ్యానము మరియు భోజనము చేయుటకు ఉపయోగపడును.

‘ కూర్చొనే హాయి పొందుటకు సుఖాసనం”

24. సిద్ధాసనం

సిదులు, యోగులు యీ ఆసనం వేసి సిద్ధి పొందుతూ వుండేవారని ప్రతీతి. అందువల్లనే ඩී.බී.පී సిదాసనం అని పేరు వచ్చింది. నాలుగు ప్రధాన ఆసనాలలో యిది ఒకటి.

విధానం
రెండు కాళు మడిచి కూర్చొని ఒక మడమ అండకోశానికి క్రింద, మరో మడమ అండకోశానికి పైన ఉంచాలి. పై కాలి ప్రేళ్లు రెండవ కాలి తొడకు, పిక్కకు మధ్య ఉంచాలి. రెండు అరచేతులు ఒక దానిపై మరొకటి వుంచి వెన్నెముక, శిరస్సు నిటారుగా ఉంచాలి. కండు మూసుకోవాలి. మొదట తీ లేక 4 నిమిషాలు, తరువాత 15 నిమిషాల వరకు కూర్చో వచ్చు.

పూర్వం యోగులు ధ్యానం, తపస్సు చేసూ కొద్ది గంటల సేపు యీ ఆసనం వేసి కూర్చునే వారు. బ్రహ్మచారులు, విద్యారులు, యోగులు, సన్యాసులు యీ ఆసనాన్ని ఎక్కువగా అభ్యాసం බීරත්‍ය “ව.

లాభాలు
గుండె జబ్బులు, శ్వాస జబ్బులు, అజీర్ణం, శుక్ర సంబంధమైన జబ్బులు నయమవుతాయి. కామవాంఛ తగుతుంది. జాపక శక్తి పెరుగుతుంది. ధ్యానానికి మనస్సు సిద్ధపడుతుంది.

“సంయమమునకు సహకరించేది సిద్ధాసనం”

25. పద్మాసనం

ప్రధానమైన 4 యూగాసనాలలో పద్మాసనం కూడా ఒకటి. నీటిలో వుంటూ పద్మం పైన తేలుతూ వున్నట్లు పద్మాసనం అభ్యాసం చేసిన సాధకులు సంసారబంధనాల్లో చిక్కుకొని వున్నప్పటికీ మానసికంగా వాటికి అతీతంగా వుంటారని యోగ నిపుణుల అభిప్రాయం.

విధానం
కుడిపాదం ఎడమ కాలి తొడపై వుంచి, కుడి వెనా కాలు పటుకొని పైకి క్రిందికి కదిలించాలి. తరువాత మోకాలును లేపి గుండ్రంగా తిప్పాలి. అదే విధంగా ఎడమ కాలితో కూడా చేయాలి.

“ෆ්ටර්ජිය కాళ్లు చాచాలి, తరువాత ఎడమకాలి పాదం కుడి తొడమీద, కుడి కాలిపాదం ఎడమ తొడమీద ఉంచాలి. యిదే పద్మాసనం.

రెండు చేతులు రెండు మోకాళ్లపై వుంచి చూపుడు ప్రేలును, బొటన ప్రేలి కణుపుకు ఆనించాలి. మిగతా మూడు ప్రేళ్లను ముందుకు చాపి చిన్ముద్ర రూపంలో ఉంచాలి.

భృకుటి మీద గాని, నాసికాగ్రం మీద గాని ပိန္ထမ္ဘိဇ်) నిలపాలి. మనస్సును హృదయ కమలంతో ఏకాగ్రం చేయాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి.

పద్మాసనం పూర్తి అంున పిమ్మట కాళు వెల్లగా చాచి వెనా కాళ్లను ඩ්යිව්ටඩ්” වී.

ఇప్పడు క్రింద కూర్చునే విధానం తగుతున్నది. ఇందు వల్ల కాళ్లు, మోకాళ్లు కరుకు ఎక్కుతున్నాయి. వాటిని మడచడం కష్టమవుతున్నది. ఇందువల్ల Sc38 పద్మాసనం పూర్తిగా పేయలేక పోతున్నారు. ఇట్టి స్థితిలో ఒక కాలిపాదం రెండవ కాలి తొడమీద ఉంచి, రెండవ కాలు మొదటి కాలి వెూకాలి క్రింద పెట్టి అర్థ పద్మాసనం అభ్యసించాలి. కొద్ది రోజులు యీ విధంగా అభ్యాసం చేస్తే పద్మాసనం వేయడం తేలిక అవుతుంది.

లాభాలు
ఎక్కువ సేపు కదల కుండా యీ ఆసనంలో కూర్చున్నందున సుఖం కలుగుతుంది. మానసిక అలసట ఉండదు. ఏకాగ్రత కుదురుతుంది. తొడల యందలి అనవసరపు కొవ్వు తగుతుంది. గుండె, ఊపిరితిత్తులు, శిరస్సులకు రక్త ప్రసారం పెరిగి, వాటికి బలం చేకూరుతుంది. బుద్ధిసూక్మత పెరుగుతుంది. ధ్యాన సాధనకు యిది ఉత్తమమైన ఆసనం.

‘మానసిక ఏకాగ్రతను పెంచేది పద్మాసనం”

26. యోగముద్రాసనం

ఎన్నో ఆసనాల వల్ల కలిగే ప్రయోజనం యీ ఆసనం వల్ల కలుగుతుంది గనుక దీనికి యోగ ముద్రాసనం అని పేరు వచ్చింది.

విధానం
పద్మాసనం వేసి రెండు చేతుల్ని నడుము వెనక నెమ్మదిగా కట్టి, శ్వాసను వదులుతూ పొట్టను లోనికి ముడుసుత్తా ముందుకు వంగాలి. శ్వాసను పీలుసూ యధాస్థితికి రావాలి.

మనస్సును నాభి మీద కేంద్రీకరించాలి. రెండు చేతులు నాభి ప్రక్కల ఉంచి లేక చేతులు రెండు పైకి ఎత్తి లేక రెండు చేతులు రెండు ప్రక్కలకు చాచి, లేక రెండు అరచేతులు కలిపి మెడ మీద ఆనించి కూడా యీ క్రియను చేయవచ్చు.

లాభాలు
పద్మాసనం మరియు శశాంకాసనం వల్ల కలిగే లాభాలన్నీ కలుగుతాయి. వుధుమేహం, ఉదర వ్యాధులు నయువువుతాంు. తొడ నరాలకు బలం చేకూరుతుంది. మనస్సు ప్రశాంతమై, కోపం తగుతుంది.

‘ఉదర వ్యాధుల్ని పోగొట్టేది యోగము(డాసనం’

27. పర్వతాసనం

ඊෆිර් ර්ථ දෙකට పర్వతంలా ఉంటుంది గనుక దీనికి పర్వతాసనం అని పేరు వచ్చింది.

విధానం
1) పద్మాసనం వేసే కూర్చోవాలి, మోకాళ్ల పై శరీరాన్ని ఎత్తాలి. చేతులు పైకి ఎత్తి నమస్కారం చేయాలి.

2) వెూకాళ్ల మీద శరీరాన్ని లేపి వుంచి వెూకాళ్ల సాయంతో వుందుకు నడుచుటకు ప్రయత్నించాలి.

శ్వాస సావూన్య స్థితిలో ఉండాలి. మనస్సును మోకాళ్ల మీద ఏకాగ్రం చేయాలి.

లాభాలు
ఈ ఆసనం వల్ల మోకాళ్ల నొప్పలు

“మోకాళ్లకు శక్తినిచ్చేది పర్వతాసనం”

28. తులాసనం లేక డోలాసనం లేక లోలాసనం లేక రూలాసనం

తుల అనగా త్రాసు. రెండు బుజాల రూపం యీ ఆసనంలో త్రాసు వలె వుంటుంది గనుక యీ ఆసనానికి తులాసనం అని పేరు వచ్చింది.

విధానం
పద్యాసనం వేసి రెండు అరచేతుల్ని రెండువైపుల నేలకు ఆనించి, వాటి మీద శరీరాన్ని

రెండు మూడు సారు అలా చేసి, తరువాత చేతులు క్రిందకు ఆన్చి శరీరాన్ని పైకి ఎత్తి వుందుకు వెనకకు ఊయంలో ఊగుతున్నట్లు ఊగాలి. శరీరాన్ని క్రిందికి దించిన తరువాత ఒక చేతితో వులో చేతిని_- (రెండు చేతుల్ని) పూర్తిగా వత్తుతూ మాలీసు చేయూలి.

దీన్ని రూలాసనం, లోలాసనం, డోలాసనం అని కూడా అంటారు.

లాభాలు
వేళ్లు, మణికట్లు, ముంజేతులు, బుజాలు బలపడతాయి. కూర్చొని వ్రాసే వాళ్లకు, టైపు చేసే వాళ్లకు, యీ ఆసనం ఎంతో ప్రయోజనకారి.

‘పూర్తి చేతులకు శక్తినిచ్చేది తులాసనం”

29. కుక్కువాసనం

కుక్కుటం అనగా కోడి పుంజు. యీ ఆసనంలో శరీరం కోడి పుంజు రూపంలో వుంటుంది గనుక దీనికి కుక్కుటాసనం అని పేరు వచ్చింది.

విధానం పద్మాసనం వేసి రెండు చేతుల్ని రెండు మోకాళ్ల మధ్య నుంచి క్రిందికి పోనిచ్చి నేలకు ఆన్చి వాటి మీద శరీరాన్ని ఎత్తి నిలపి ఉంచాలి.

సాధకుడు సాధ్యమైనంత సేపు యీ ఆసనం వేసి వుండవచ్చు. ই “গুপ্ত సామాన్య స్థితిలో ఉండాలి. రెండు చేతులు తీసి పద్మాసనం నెమ్మదిగా తొలగించాలి.

ఈ ఆసనం వేయుటకు వుందు చేతులకి, తొడలకి, పిక్కలకి పలుచగా నూనె” రాసే వూలీసు చేయడం వుంచిది. ఇది కఠినమైన ఆసనం కనుక దీన్ని జాగ్రత్తగా “බීටරය – ව.

లాభాలు
పద్మాసనం వల్ల కలిగే లాభాలన్నీ కుక్కుటాసనం వల్ల కలుగుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. నరాలకు, నాడులకు చురుకుదనం వస్తుంది. మోచేతులు, గుండె, బుజాలు, మణికట్ల శక్తివంతం అవుతాయి. వీర్యరక్షణకు యు” ఆసనం సహకరిస్తుంది.

“అంతః శక్తిని పెంచేది కుక్క టాసనం”

30. గర్భాసనం

గర్భంలో వుండే శిశువు రూపంలో శరీర స్థితి వున్నందువల్ల ంూ ఆసనాన్ని గర్భాసనం ඡබ් බ්‍රපටහීට්” ර්ථ.

విధానం
పద్మాసనం పేసి, కుక్కుటాసనం కూడా వేసి మోచేతుల్ని కొంచెం ముందుకు జరిపి, శరీర భారమంతా పిరుదుల మీద మోపి, కుడి అరచేతిని కుడి బుగ్గకు, ఎడమ అరచేతిని ఎడమ బుగ్గకు గట్టిగా ఆనించాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి. ఇది కఠినమైన ఆసనం.

లాభాలు
పద్మాసనం, కుక్కుబాసనం వల్ల కలిగే లాభాలతో బాటు పిక్కలు, తొడలు, పిరుదులు శక్తి పొందుతాయి. హెర్నియా వ్యాధికి యిది ప్రయోజనకారి. మూత్రేంద్రియానికి సంబంధించిన జబ్బులు, స్త్రీల ఋతుసావానికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. శరీరం అందంగా రూపొందుతుంది.

నిషేధం
స్మూల కాయులు బలవంతంగా యీ ఆసనం వేయకూడదు.

“శరీరాన్స్ అందంగా రూపొందించేది గర్భాసనం’

31. బద్దపద్మాసనం

రం ఆసనంలో రెండు చేతులు బంధించబడతాయి కనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
పద్మాసనం స్థితిలో నిటారుగా కూర్చోవాలి. తరువాత రెండు చేతులు వీపు వెనుకకు పోనిచ్చి కుడి చేతి ప్రేళ్లతో కుడి పాదం వేళ్లను, ఎడమ చేతి వ్రేళ్లతో ఎడమ పాదం వేళ్లను పటుకొనేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంత సేపు యీ స్థితిలో සීටයි” චී. తరువాత పద్మాసనం හි” බීව ෆිෆඩ් కాళ్లకు, చేతులకు మాలీసు చేసి విశ్రాంతి తీసుకోవాలి.

లాభాలు
పద్మాసనం వల్ల కలిగే లాభాలన్నీ యీ ఆసనం వల్ల కలుగుతాయి. రక్తపు పోటు తగ్గి గుండెకు బలం చేకూరుతుంది వీపు నొప్పి, సైటికా నొప్పి తగుతుంది. రక్త సంచారం బాగా జరుగుతుంది. نان – دمای تاریخ బలపడతాయి, తల్లలకు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

“రక్తపుపోటును తగ్గించేది బద్ధపద్మాసనం”

32. మత్యాసనం

శరీర రూపం చేప వలె ఉండటం వల్ల దీనికి మత్యాసనం అని పేరు వచ్చింది.

విధానం
పద్మాసనం వేసి ఒక్కొక్క మోచేతిని ప్రక్కలకు నేలకు ఆనిస వెల్లకిల పడుకోవాలి. తల వెనుకవైపు భాగాన్ని నేలకు ఆనించి వీపును పైకి ఎత్తాలి. రెండు చేతులతో రెండు కాలి బొటన వ్రేళ్లను పటుకోవాలి. రెండు మోచేతుల్ని నేలకు ఆనించాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి.

సూచన
పద్మాసనం సరిగా వేయ లేనివారు కాళ్లు తిన్నగా చాచి యీ ఆసనం వేయవచ్చు.

లాభాలు
ఈ ఆసనం వల్ల స్పాండిలైటిస్, మెడ నొప్పులు, శ్వాసకు సంబంధించిన జబ్బులు తగుతాయి. ఊపిరి తిత్తులకు, ఉదర మందలి అవయవాలకు ప్రయోజనం కలుగుతుంది. అపాన వాయువు పోయి ఉదరం శుభ్రపడుతుంది.

“మెడకు, ఛాతీకి శక్తి నిచ్చేది మత్యాసనం’

33. బకాసనం

బకం అంటే కొంగ, యీ ఆసనంలో కొంగ రూపంలో శరీరం ఉంటుంది గనుక దీనికి బకాసనం అని పేరు వచ్చింది. ఇది కఠినమైన ఆసనం.

విధానం
వజ్రాసనంలో కూర్చొని, రెండు చేతులు, మోకాళ్లు, పాదాలు నేలకు ఆన్చాలి. రెండు అరచేతులు నేలపై ఆనించి, వెూకాళు లేపి, మోచేతులపైన ఆనించాలి. తరువాత బాలెన్సు సరి చేసుకొని పాదాలు కూడా పైకి ఎత్తాలి.

శరీరమంతా రెండు అరచేతుల మీదనే నిలిచి యుండాలి.

కొద్దిసేపు తరువాత పాదాలు నేలకు ఆనించి వజ్రాసన స్థితికి రావాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి.

లాభాలు
ఈ ఆసనం వల్ల చేతి నరాలు, కండరాలు, మణికట్లు, బుజాలు శక్తి వంతమవుతాయి.

నిషేధం
చేతులు బలహీనంగా వున్నవాళు యీ ఆసనం వేయకూడదు. సూలకాయులు యీ ఆసనం జాగ్రత్తగా పేయాలి.

“చేతి కండరాలకు శక్తి నిచ్చేది బకాసనం”

34. పాదాంగుష్ణాసనం

పాదాల ప్రేళ్ల మీద శరీరం ఆని వుంటుంది, కనుక దీనికి పాదాంగుష్పాసనం అని పేరు వచ్చింది.

విధానం
రెండు ముని పాదాలు నేలకు ఆనించి, వాటి మీద కూర్చోవాలి. రెండు చేతులు ప్రక్కన నేల మీద ఆన్చాలి. తరువాత కుడి పాదం ఎత్తి ఎడమ తొడ మీద పెటాలి.

బాలెన్సు సరి చేసుకొంటూ రెండు చేతులు ఎత్తి, ఛాతీ దగ్గర వుంచి గాని లేక రెండు చేతులు ఎత్తి గాని నమస్కరించాలి. సాధ్యమైనంత సేపు యీ ఆసనం వేయాలి.

ఇదే విధంగా కాలు మార్చి చేయాలి. శరీరం బాలెన్సు పై, మనస్సును కేంద్రీకరించాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి.

లాభాలు
పాదం ప్రేళ్లు, పిక్కలు, తొడలు, మణికట్లు బలపడతాయి. శరీరం యొక్క బాలెన్సు సరిగా ఉంటుంది.

“శరీరం, మనసుల బాలెన్సుకు పాదాంగుష్ణాసనం’

35. జాను శరాసనం

మోకాలిపై శిరస్సును ఆనించి వేయు ఆసనం గనుక దీనికి జాను శిరాసనం అని పేరు వచ్చింది. యీ ఆసనం వల్ల వెన్నెముక ఎలా వున్నదీ బోధపడుతుంది.

విధానం
1) రెండు కాళ్లు ముందుకు చాచాలి. ఎడమ మోకాలు ముడిచి, ఎడమ అరికాలు తొడ (పక్కకు తాకించాలి. ఎడవు కాలి వుడవును మూత్రేంద్రియం క్రింద ఉంచాలి. రెండు చేతులు పైకి ఎత్తి రెండు చేతి బొటన ప్రేళ్లు కలపాలి. శ్వాస వదులుతూ ముందుకు వంగుతూ, నుదురును కుడి దూకాలికి తాకించాలి.

శ్వాస పీలుస్తూ చేతులు పైకి ఎత్తాలి. త్ లేక 6 సార్లు యీ క్రియ చేసి, తరువాత కాలు మార్చి కూడా చేయాలి.

2) | ඊටර්රථ కాళ్లు తిన్నగా చాచాలి. ఎడమ కాలి మడమును కుడి తొడ మీద ఉంచాలి. కుడి చేతితో కుడి పాదం ప్రేళ్లు పటుకోవాలి. ఎడమ చేతిని వెనుకకు పోనిచ్చి ఎడమ పాదం ప్రేళ్లు పటుకోవాలి. శ్వాస వదులుతూ నుదురును కుడి వెూ కాలికి తాకించాలి. দ্য “গুপ্ত పీలుసూ శిరస్సును యధాస్థితికి తేవాలి. 5 లేక 6 సార్లు యీ విధంగా చేసిన తరువాత కాళ్లు చేతులు మార్చి కూడా చేయాలి.

లాభాలు
లివరు, పేంక్రియాజ్ స్త్రీన్ వంటి ఉదరమందలి అవయవాలకు ఉత్తేజం కలుగుతుంది. పేగులు సరిగా పనిచేస్తాయి. వెన్నెముకను అంటి యుండే నరాలకు, కండరాలకు సత్తువ చేకూరుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.

నిషేధం
రజస్వల అయిన స్త్రీలు, ముట్టు అయిన స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, యీ ఆసనం పేయకూడదు. నడుము నొప్పి వున్న వాళ్లు, నొప్పి తగ్గిన తరువాత యీ ఆసనం వేయవచ్చు.

“వెన్నెముక చురుకు తనాన్స్ పరీక్షించేది జానుజొరాసనం”

36. ఆకర్ధధనురాసనం

ఈ ఆసనంలో శరీర స్థితి ఎక్కుబెట్టిన ధనస్సు వలె వుంటుంది కనుక దీనికి ఆకర్ణధనురాసం అని పేరు వచ్చింది.

విధానం
రెండు కాళ్న తిన్నగా చాచాలి. కుడికాలు ఎడమకాలిపై ఉండాలి. అనగా (కాసే చేసి ఉండాలన్న వనాట. ఎడవు చేతితో కుడి పాదం బొటన (వేలు పటుకోవాలి. అదే విధంగా కుడి చేతితో ఎడమ పాదం బొటన వేలు పట్టుకోవాలి. శ్వాస వదులుతూ కుడి వెూకాలు వుడు సూ కుడి పాదం బొటన ప్రేలితో చెవిని ఎడమ చేతిని తాకాలి. శ్వాస పీలుసూ యధాస్థితికి రావాలి. 5 లేక 6 సార్లు యీ క్రియ చేసిన తరువాత కాళ్లు మార్చి చేయాలి.

సూచన
ఒక చేతో కాలును ఎత్తుట కష్టమనిపించితే రెండో చేతి సాయం కూడా పొందవచ్చు.

లాభాలు
ఆఫీసుల్లో ఎప్పడూ కూర్చొని పని చేయు వారికి ంూ ఆసనం ప్రయోజనకారి, కాళ్లు చేతులు, నడుము, బుజాలకు సంబంధించిన నరాలు కండరాలు గట్టి పడి బాగా పని చేస్తాయి. మోకాళ్ల బాధలు తొలుగుతాయి. కామక్రోధ మదవెూస్తూ మాత్పర్యాలనే అంతర్శతృవులపై విజయం సాధించుటకు యీ ఆసనం ఉపయోగపడుతుంది.

“అంతరుతువులపై వీజయం సాధించేది ఆర్థ ధనురాసనం”

37. కూర్మాసనం

కూర్మం అంటే తాబేలు. యీ ఆసనంలో శరీరస్థితి తాబేలు రూపంలో వుంటుంది కనుక దీనికి కూర్మాసనం అని పేరు వచ్చింది.

విధానం
రెండు కాళ్లు ముందుకు చాచాలి. రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర పైకి ఎత్తి ప్రక్కలకు వంచాలి. రెండు అరికాళ్లను కలపాలి. రెండు చేతులు మోకాళ్ల క్రింది నుంచి పోనిచ్చి నేల మీద ఉంచాలి.

తరువాత మోకాళ్ల క్రిందకు చేతులు పోనిచ్చి నడుము వెనుకకు పోనిసూ శ్వాస వదులుతూ కాళ్ల మధ్య నుదురుతో నేలను తాకుటకు ప్రయత్నించాలి. కొద్ది సేపు ఆగి శ్వాస పీలుసూ విశ్రాంతి తీసుకోవాలి.

లాభాలు
ఉదర జబ్బులు తగుతాయి. బొజ్జ తగుతుంది. తాబేలు వలె మనిషి వయస్సు పెరుగుతుంది.

“బొజ్ఞను తగ్గించేది కూర్మాసనం”

38. సింహాసనం

ప్రధానమైన 4 ఆసనాల్లో సింహాసనం కూడా ఒకటి. సింహం వలె శరీరాన్నివంచి వేసే ఆసనం కనుక దీనికి సింహాసనం అని పేరు వచ్చింది.

విధానం
వజ్రాసనంపేయాలి. రెండు అరచేతుల్ని మోకాళ్ల మధ్యన లోపలివైపుకు వుంచి నేలకు ఆన్చాలి. ఛాతీ, మెడ, ముందుకు వుంచాలి. వాటిని చేతుల మీద నిలబెట్టి, శిరస్సు ఎత్తి, నాలుక చాచి శ్వాసనులోనికి నింపు కొని ఫోర్సుగా వదులుతూ సింహం వలె గర్ణించాలి.

మూడు నాలుగు సార్లు గర్జించి యధాస్థితికి రావాలి. యీ క్రియను అతిగా చేయకూడదు.

సింహాసనం కొంచెం కఠినమైన ఆసనం. యి ఆసనం వేయుటకు 5 స్థితులు వున్నాయి. ఆ స్థితులకు సంబంధించిన క్రియ ఒక్కొక్కటే చేసూ చివరిస్థితికి చేరాలి. అదియే సింహాసనం.

1) మొదటి స్థితి
వజ్రాసనం వేసి ముఖం విప్పారించి నోరు పూర్తిగా తెరవాలి. కండు ముక్కు పూర్తిగా తెరవాలి. కండ్లను నాసికాగ్రం మీద కేంద్రీకరించాలి. సాధ్యమైనంతగా శ్వాసను ఆపి, నాలుకను లోపలికి లాగాలి, ముఖము నాలుకలను వదులు చే సూ శ్వాసను సామాన్య స్థితికి తేవాలి.

2) రెండవ స్థితి
మొదటి స్థితిలో కూర్చొని నాలుక కొసను పైకి మడిచి దానితో కొండ నాలికను తాకుటకు ప్రయత్నించాలి. సాధ్యమైనంత సేపు శ్వాసను ఆపుతూ యీ స్థితిలో ఉండాలి.

3) మూడవ స్థితి
మొదటి స్థితిలో వలె కూర్చొని నాలికను నోరు బయటికి చాసూ దానితో చిబుకం చివరి భాగాన్ని తాకుటకు ప్రయత్నించాలి. శ్వాసను సాధ్యమైనంత సేపు ఆపి యీ స్థితిలో ఉండాలి.

4) నాల్గవ స్థితి
మొదటి స్థితిలో వలె కూర్చొని మూడవ స్థితిలో వలె నాలుకను బయటికి చాచి, ముక్కు ద్వారా గట్టిగా శ్వాసను పీలుస్తూ, గొంతులో నుంచి ధ్వని చేసూ, గొంతు ద్వారానే ఆగాలిని బయటికి వదలాలి. సాధ్యమైనంత దీర్ఘంగా ఫోర్సుతో గాలి వదలాలి.

5) అయిదవ స్థితి
నాల్గవ స్థితిలో వలె వుండి, ముక్కుతో శ్వాసపీలుసూ, సింహం వలె ఆగి ఆగి బిగ్గరగా అరుసూ మొత్తం గాలిని ఫోర్సుతో నోటి నుంచి ధ్వని చేసూ వదలాలి. యీ స్థితియే సింహాసనం. చివరి ధ్వని దీర్ఘంగా సాగాలి.

పై అయిదు క్రియలు మూడు నాలుగు సార్లు చేయాలి.

తరువాత రెండు మణికట్లను, రెండు చేతులను మాలీసు చేయాలి. గొంతులో ఎండు తనం వస్తుంది కనుక యీ ఆసనం వేసిన వెంటనే శీతలి మరియు శీతకారి ప్రాణాయామాలు తప్పక చేయాలి. (ప్రాణాయామ ప్రకరణంలో వివరాలు లభిస్తాయి).

లాభాలు
ఈ క్రియలో కంఠం, ఛాతీ, కడుపు ప్రభావితం అవుతాయి. గొంతు యందలి గరగర తగుతుంది. కంఠ మందలి నాడులు శుభ్రపడతాయి. గవదబిళ్లలు (టాన్సిల్స్) తగుతాయి. చెవులు, కండు, ముక్కు, నాలుకకు సంబంధించిన రుగ్మతలు తోలుగుతాంు. జాపక శక్తి పెరుగుతుంది. కంఠం పైభాగానికి సంబంధించిన రుగ్మతలు పోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.

“కంఠం నుంచి మాడు వరకు గల నాడుల్ని ప(భం చేసేది సింహాసనం

39. మయూరాసనం

ఈ ఆసనంలో శరీర స్థితి మయూరం అనగా నెమలి రూపంలో వుంటుంది కనుక దీనికి మయూరాసనం అని పేరు వచ్చింది. ఇది కఠినమైన ఆసనం.

విధానం
వజ్రాసనంలో కూర్చొని, అరచేతుల్ని నేలకు అనించాలి. చేతి ప్రేళ్లు మోకాళ్లవైపుకు, మోకాళ్లముందు ఉండాలి. నడుమును ఎత్తి, నుదురును ముందుకు వంచి, నేలకు తాకించాలి. నెమ్మదిగా రెండు కాళ్లను తిన్నగా చాసూ పైకి లేపాలి. తరువాత పూర్తి శరీరాన్ని బాలెన్సుతో చేతులపై వుంచుతూ శిరస్సును కొంచెం పైకి లేపాలి. పూర్తి శరీరం నిటారుగా వుండాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి. ధ్యానం నాభి మీద వుండాలి. తరువాత మోకాళ్లు నెమ్మదిగా భూమి మీద వుంచి విశ్రాంతి తీసుకోవాలి. చేతులకు మాలీసు చేసి వాటి అలసటను పోగొట్టాలి.

లాభాలు
పేగులు, జీర్ణకోశం బలపడతాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది. స్కూల కాయం తగుతుంది. మణికట్లు, బుజాలు బలపడతాయి. పొట్టలో క్రిమి దోషాలు హరిస్తాయి. మధుమేహం తగ్గుతుంది. మయూరాసనం నియమబద్ధంగా వేసూ వుండే సాధకులు విషాన్ని సైతం మింగి జీర్ణం చేసుకోగల స్థితిలో వుంటారని శాస్త్ర కథనం.

నిషేధం
చేతులు బలహీనంగా వున్నవాళ్లు , అల్సరు, హెర్నియూ కలవాళ్ళు, గుండెజబ్బుల వాళ్లు, బలహీనంగా వున్నవాళ్లు, యీ ఆసనం వేయకూడదు. نن رئ యూ ఆసనం వేయకూడదని కొందరి అభిప్రాయం.

“చేతులకు, జీర్ణ కోశానికి శక్తినిచ్చేది మయూరాసనం”

40. మయూరీ ఆసనం

మయూరాసనం వంటిదే మయూరీ ఆసనం. విధానం పద్మాసనంలో కూర్చొని, మయూరాసనంలో వలె చేతుల మీద మొత్తం శరీరాన్ని నిలపాలి. మయూరాసనంలో కాళ్లు నిటారుగా చాచి వుంటాయి, కాని యిందు కాళ్లు పద్మాసనం స్థితిలో ఉంటాయి.

లాభాలు
మయూరాసనం మరియు పద్మాసనం వల్ల కలిగే లాభాలన్నీ దీని వల్ల కలుగుతాయి.

నిషేధం
మయూరాసనంలో గల నిషేధాలు యిందు కూడా వర్తిస్తాయి.

“చేతులకు కాళ్లకు శక్తినిచ్చేది మయారీ ఆసనం”


కూర్చోని వేయు పై ఆసనాలలో కొన్ని సులభం, కొన్ని కఠినం. సులభమైన ఆసనాలు సాధకులు స్వయంగా వేయవచ్చు, కాని కఠినమైన ఆసనాలు నిపుణుల నిరీక్షణలో వేయడం మంచిది.

కూర్చొని వేయు ఆసనాల అభ్యాసం పూర్తి అయిన పిమ్మట బాలాసనం (వెల్లకిల పడుకొని వేయు ఆసనం) తప్పక పేయాలి. చివరికి శవాసనం పేసి పూర్తి విశ్రాంతి తీసుకోవాలి.