20. బెటర్ హెల్త్ మెడిటేషన్(బి.హెచ్.ఎమ్) లేక మంచి ఆరోగ్యం కోసం ధ్యానయోగసాధన


1955 డిసెంబరు 6వ తేదీ నాటికి నా వయస్సు 8 సంవత్సరాలు. యోగ సాధనా నిపుణులు, వూ తండ్రి శ్రీ కువర్జీ లాల్జీ నాకు జన్మదిన కానుకగా ధ్యానయోగం ఉపదేశించారు. అప్పటి నుంచి ధ్యానయోగం చేసూ నేను ఎంతో ప్రగతి సాధించాను. 18 సంవత్సరాల వయస్సులో 11వ తరగతి, 17 సంవత్సరాల వయస్సులో బి. ఎస్. సి పరీక్ష ప్యాసై ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. 14 భాషలు చదవడం, వ్రాయడం నేర్చుకున్నాను. వేలాది గ్రంథాలు అధ్యయనం చేశాను. 1966 ఏప్రిల్ 27వ తేదీన ఒక రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని9 రోజులు ఉస్మానియా ఆసుప్తత్రి యందు కోమాలో వుండిపోయాను. తరువాత ఒళ్లు తెలిసింది కాని జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. కొంత కాలానికి జాపక శక్తి తిరిగి వచ్చింది. 1986 డిసెంబరు 6వ తేదీ నుంచి ధ్యాన యోగ పరిశోధన మళ్లీ ప్రారంభించాను. ప్రత్యేక పాఠ్య క్రమం నిర్ణయించి 1988 ఆగస్టు 8వ తేదీన హైదరాబాదు కోరీ యందు గల జైన్ మందిరంలో ప్రధమ ధ్యాన యోగ శిబిరం ప్రారంభించాను. యీ శిబిరంలో పెద్ద సంఖ్యలో సాధకులు పాల్గొని ప్రయోజనం పొందారు. అప్పటి నుంచి గాంధీ జాన మందిర్లో 1999 ఆగస్టు నెలాఖరు వరకు 160 బి. హెచ్ ఎం. శిబిరాలు విజయవంతంగా నడిచాయి. 12 వేల మంది సాధకులు యీ ధ్యాన యోగ సాధనా విధానం నేర్చుకున్నారు. తెలుగు ప్రజల ఉపయోగార్థం ధ్యాన యోగ సాధనా పార్యక్రమాన్ని యిక్కడ ప్రచురిస్తున్నాము. ది. 6-12-1988 నాడు ఈ ధ్యాన సాధనకు బెటర్ హెల్త్ మెడిటేషన్ అని నామకరణం జరిగింది.

ప్రపంచంలో అనేక ధ్యాన యోగ పద్ధతులు ప్రచారంలో వున్నాయి. వీటన్నిటి లక్ష్యం ఆత్మపరమాత్మల కలయికయే, ధ్యాన యోగ పద్ధతుల ప్రారంభానికి నాంది మనస్సును శ్వాస మీద ఏకాగ్రం చేయుటయే. మా బి.హెచ్.ఎం. లక్యం కూడా అదే.

వివిధ రకాల ధ్యాన పద్ధతులకు నాంది శ్వాసపై వునస్సును ఏకాగ్రం చేయుటయే. మా యీ పద్ధతి ప్రారంభ స్థితి కూడా అదే. యిది మొదటి చరణం.

ధ్యానానికి మనస్సు యొక్క ఏకాగ్రత అవసరం. మనస్సు ఏకాగ్రం కావాలంటే దాని చంచలత్వాన్ని తగ్గించి శూన్య స్మాయికి దించాలన్నమాట. అందుకు గట్టి సాధన అవసరం. పంచజనేంద్రియాల (ခိခံခဲဥ့်éညွှဗီ మనస్సు యొక్క చంచలత్వానికి ముఖ్య కారణం. పంచజానేంద్రియాలపై నియంత్రణ పెరిగిన కొద్దీ దాని చంచలత్వం తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ధ్యానయోగసాధన యొక్క రెండో చరణం.

మూడో చరణంలో సాధకులు అంతరంగ యోగాంగాలైన ప్రత్యాహారం, ధారణల అభ్యాసం చేసూ మొల్ల వెల్లగా ధ్యానయోగ సాధన చరము సాంు నందుకొనుటకు ప్రయత్నం చేస్తారు. అదే దివ్యానం దానుభూతి స్థితి.

I. ప్రధమచరణం – శ్వాసపై మనస్సును ఏకాగ్రం చేయు వీధానాలు:

శ్వాసపై ఏకాగ్రతకు సంబంధించిన ముఖ్య క్రియలు చేయుటకు సాధకులు క్రింద తెలిపిన రెండు ప్రారంభిక క్రియలు చేయాలి.

అ) శ్వాస మహతును తెలుసుకొనుట :

శ్వాస లేకుండా మనం ఎక్కువ సేపు వుండలేము. బ్రతక లేము. శ్వాస సహజంగా సాగే ప్రక్రియ. దాని మహత్తు బోధపడదు. కాని ఈ ప్రక్రియ వల్ల శ్వాసను పీల్చుట, శ్వాసను వదులుట యొక్క మహత్తు బోధపడును. శ్వాసను లోనికి ఎక్కువగా పీల్చాలి, ముక్కును, నోటిని మూసి పీల్చిన గాలిని సాధ్యమైనంత సేపు లోప ఆపి వుంచాలి. అప్పడు శ్వాసను బయటికి వదులుట ఎంత అవసరమో సాధకునికి బోధపడుతుంది. అప్పడు శ్వాసను బయటికి వదిలి వేయాలి. దానిని బయటనే శక్తిని బట్టి ఆపాలి. అప్పుడు సాధకుడు శ్వాసను పీల్చుటకు గిలగిలలాడును. అప్పడు లోనికి పీల్చవలసిన శ్వాస యొక్క మహత్తు సాధకునికి బోధపడుతుంది. ఈ ప్రక్రియను రెండు మూడు నిమిషాల పాటు చేయాలి.

శ్వాస యొక్క స్పర్ళానుభూతినీ పొందుట:

అరచేతిపైభాగాన్ని ముక్కు దగ్గర వుంచాలి. ముక్కు ద్వారా శ్వాసను లోనికి పీల్చి, తరువాత ముక్కు ద్వారా ఫోర్సుగా శ్వాసను బయటికి వదలాలి. శ్వాస అరచేతిపై భాగపు చర్మానికి గట్టిగా తగులుతుంది. అందువల్ల శ్వాస యొక్క స్పరానుభూతి సాధకుని చేతి చర్మానికి కలుగుతుంది. ఆ చోట మనస్సును కేంద్రీకరించి ఆస్పర్ళానుభూతిని పొందవలెను. రెండు మూడు నిమిషాల పాటు ఈ క్రియ చేయాలి.

పైన తెలిపిన రెండు క్రియలు చేసిన తరువాత సాధకులు కింది క్రియలు చేయుటకు సిద్ధపడును.

1. సుఖంగా కూర్చొని లేక పడుకొని సాధకుడు శ్వాస పీలుస్తూ వదులుతూ వుండాలి. అతడు తన రెండు ముక్కు రంధాల గోడలకు తగులుతున్న గాలి స్పర్శను గ్రహిస్సు వుండాలి.

2. ముక్కునందు గాలి ప్రవేశించునప్పుడు, ముక్కునందు కలిగే చల్లదనాన్ని గాలి బయటికి వెళ్లినప్పుడు కలిగే ఉషాన్ని గ్రహించాలి.

3. గాలి పీలుస్తున్నప్పడు ఆక్సిజన్ రూపంలో ప్రాణవాయువు ప్రవేశించినప్పుడు శరీరంలో శక్తి నిండుతున్న విషయం సాధకుడు గ్రహించాలి. గాలిని బయటికి వదులుతున్నప్పడు కార్బన్డయాక్సైడ్ రూపంలో శరీర మనస్సుల యందలి మాలిన్యం బయటికి వెళుతున్నదని, శరీరం, మనస్సు రెండు పవిత్రమవుతూ వున్నాయని సాధకుడు గ్రహించాలి.

4. శ్వాస పీలుసూ మనస్సు దివ్యానందానుభూతి పొందాలి. గాలిని బయటికి వదులుతూ వున్నప్పడు శరీరం, మనస్సుల యందలి దుకిఖలాలు, బాధలు, వ్యాధులు, నొప్పలు, టెన్షను తగ్గిపోతున్న అనుభూతి పొందాలి.

5. శ్వాస పీలుసూ ఉన్నప్పడు సదుణాలు, అనగా పేమ, మైత్రి, దయ, కరుణ మొదలగునవి పెరుగుతూ వున్నట్లు, శ్వాసవదులుతూ ఉన్నప్పడు దురుణాలు అనగా కామ, క్రోధ, మదమోహ, ఈర్ష్య, అహంకారము మొదలగునవి తగ్గిపోతున్నట్లు అనుభూతి పొందాలి.

6. శ్వాస పీలుస్తున్నప్పడు, ఆ శ్వాసతో బాటు ముక్కు, గొంతుల్లో నుంచి ఊపిరితిత్తుల్లోకి, మనస్సును గొంపోవాలి. అదే విధంగా గాలిని వదులుతూ వున్నప్పడు మనస్సును ఊపిరి తితుల నుంచి గొంతు, ముక్కు ద్వారా బయటికి తీసుకురావాలి. శ్వాసతో బాటు మనస్సును కూడా నడిపించాలన్న మలాట.

ఈ ఆరు ప్రక్రియల్ని అభ్యసిస్ను మెల్లమెల్లగా కొద్ది రోజుల్లో అందు దక్షత పొందుటకు ప్రయత్నించాలి. కి లేక 4 రోజులు అందుకు పట్టవచ్చు. ప్రారంభంలో ప్రతిక్రియ 2 నుంచి 5 నిమిషాల పాటు చేసూ వుండాలి. కొంత సాఫల్యం పొందిన తరువాత రెండవ క్రియను, ఆ తరువాత మూడవ, నాల్గవ, అయిదవ, ఆరవ క్రియను అభ్యసించాలి. ఎప్పడు, ఎక్కడ వీలు చిక్కినా యీ క్రియల అభ్యాసం చేసూ ଐଶ୍ଵାଞ୦ పొందవచ్చు.

పైన తెలిపిన ప్రతి విధి సంపూర్ణ క్రియయే అని గ్రహించాలి. ఒకటి గాని, రెండుగాని లేక అన్నింటిని గాని చేయవచ్చు.

సమయాన్ని సద్వినియోగం చేసుకొనుట, ఏకాగ్రతను పెంచుకొనుట, ధ్యాన యోగ సాధన యందు ప్రవేశాన్ని సులభం చేసుకొనుట, చెడు యోచనల్ని నిరాశను తగ్గించుకొనుట, మంచి యోచనల్ని దృఢం చేసుకొనుట, యీ క్రియల ప్రధాన లక్యం,

II. ద్వితీయ చరణం – పంచజ్ఞానేందియాల నీగ్రహ క్రియలు:

పంచజనేంద్రియాల్ని నియంత్రించుట యీ చరణంలో చేయవలసిన పని. కనుకనే దీన్ని క్లుప్తంగా ఇంద్రియ నిగ్రహం అని అంటారు. చెవి, నాలుక, ముక్కు, కన్ను చర్మం యీ పంచేదియాల్ని నియంత్రణలో వుంచడం అవసరం. అయితే యిందుకు విధానాన్ని ఇప్పటి వరకూ ఎవ్వరూ నిర్మారించ లేదు. ఎన్నోసంవత్సరాల స్వానుభవంతో వేువు ఒక విధానం నిర్ణయించి అభ్యాసం చేస్తున్నావు. చేయిస్తున్నాము.

ఒక్కొక్క జసేంద్రియాన్ని నియంత్రణలో వుంచుటకు ప్రయత్నం ప్రారంభిస్తే క్రమంగా సాఫల్యం లభిస్తుంది. దానితో బాటు ఆజనేంద్రియం తాను చేయు పని యందు పరిపక్వతను సాధిస్తుంది. దాని వల్ల మనస్సు నందు చెలరేగే కల్లోలం తగుతుంది.

1. చెవులపై నీయంత్రణ:

వినడం చెవుల పని. ఏదైనా ధ్వని మాటి మాటికీ చెవులకు వినబడుతూ వుంటే మనస్సు యొక్క ఏకాగ్రతకు చెవులు భంగం కలిగిస్తాయి. కాని చెవుల మీద 196 మనస్సు యొక్క నియంత్రణ ఏర్పడితే మనస్సు యిష్టపడే దాన్నే చెవులు వింటాయి. ఉదాహరణకు మనం ఇష్టమైన పాట లేక సంగీతం వింటున్నప్పడు లేక ఇష్టమైన వారితో మాట్లాడుతున్నప్పడు మన చెవులు యితర ధ్వను లేమీ వినవు. దీని వల్ల చెవుల్ని మనం వశంలో వుంచవచ్చునని తేలుతున్నది. ఇందుకు క్రింద తెలిపిన ఆరు విధానాలు అవలంబించాలి.

1) మొదటి వీధానం:
ఈ క్రియను నిటారుగా కూర్చొని చేయాలి. ముక్కు ద్వారా త్వరత్వరగా గాలి పీలుస్తూ వదులుతూ భస్తిక వలె ముక్కులో పెద్దగా ధ్వనిచేయాలి. ఆ ధ్వనిని మాత్రమే వినాలి, మలో ధ్వనిని వినకూడదు. ప్రారంభంలో ఒక్క నిమిషం యీ క్రియ చేయాలి.

రెండవ వీధానం:
కూర్చొని నెమ్మదిగా, లోతుగా పెద్దగా దీర్ఘ శ్వాస ముక్కు ద్వారా పీలుసూ వదులుతూ ముక్కులో పెద్ద ధ్వని చేయాలి. ఆ ధ్వనిని మాత్రమే రెండు మూడు నిమిషాలు వింటూ వుండాలి.

మూడవ వీధానం:
තුධි బహుసూత్మ క్రియ. ਦੇਹਾ పద్ధతిన శ్వాస పీలుసూ వదులుతూ ” వుండాలి. దానికి సంబంధించిన မိဳ§ဇ်) ఏదీ చెవులకు వినబడదు. నిశ్శబ్దంగా సాగే యీ శ్వాస ప్రశ్వాసలపై మనస్సును ఏకాగ్రం చేయాలి. శ్వాస ప్రశ్వాసల బహు సూక్మధ్వనిని మనస్సు ద్వారా వింటున్న అనుభూతిని పొందాలి. మలో ధ్వని ఏదీ వినకూడదు.

నాల్గవ వేధానం:
మన దరిదాపుల్లో అనేక ధ్వనులు ఎప్పడూ వినబడుతూ వుంటాయి. ఆ చిన్న పెద్ద ధ్వనుల్ని వింటూ వుండాలి. అయితే వాటిలో ఒక్క ధ్వనిని పూర్తి ఏకాగ్రతతో 5 సెకండ్ల సేపు వినాలి. ఒక దాని తరువాత మరొక ధ్వనిని యిదే విధంగా వింటూ వుండాలి. వింటున్న ధ్వనిని మాత్రమే వింటూ మరో ధ్వనిని వినకుండా వదిలి వేయాలి.

అయిదవ వీధానం:
దరిదాపుల్లో బయల్వెడులు ధ్వనులు వినడం మాని కేవలం దూరాన్నుంచి వస్తున్న లేక పోతున్న ఒక్క ధ్వనిని మాత్రమే అనగా మోటారు, విమానం లేక రైలు కూతల వంటి ధ్వనుల్లో ఒక్కదాన్ని మాత్రమే 10 సెకండ్ల సేపు వినాలి. ఒక్కొక్క ధ్వనినే ఒక్కొక్కటి చొప్పన వినాలి. యిది కష్టమైన క్రియ. మెల్లమెల్లగా కృషి చేసూ సాఫల్యం పాండాలి.

ఆరవ వీధానం:
రెండు చెవుల్లో రెండు బొటన వేళు పెటుకొని హృదయంలో నుంచి బయల్వెడలే దివ్య ధ్వనిని వినుటకు ప్రయత్నించాలి. ప్రారంభంలో గుయ్మంటూ ధ్వని వినబడుతుంది. అందు లీనమై అందలి దివ్య ధ్వనిని వినాలి. కృషి చేసూ యిందు సాఫల్యం పొందవచ్చు. ప్రారంభంలో 2 నుంచి 5 నిమిషాల సేపు చేయాలి.

పైన తెలిపిన ఆరు విధానాల ద్వారా చెవులపై నియంత్రణ పొందవచ్చు. శ్రవణ శక్తి కూడా పెరుగుతుంది. దీర్ఘ కృషి చేసూ వుంటే బ్రహ్మనాదం వినబడుతుంది.

2. నాలుకపై నీయంత్రణ:

မဲခ်ိဳလ္လမ္ပိလ° మనం မဃမဲချွံချွံညဇံမ် పదార్థం తింటాం. తరువాత ఆపదార్థం జాూపకం వచ్చిందనుకోండి. అప్పడు ఆ రుచి అనుభూతి నాలుకకు కలుగుతుంది. యిట్టి క్రియ ద్వారా తిన్న తాగిన భాద్య, పేయ పదారాల రుచిని గురించిన అనుభూతి పాండాలి.

రెండు మూడు సెకండ్ల సేపు పగలు తిన్నపదారాలలో ఒక్కొక్క దాన్ని జాపకం చేసుకోవాలి. తరువాత రెండు మూడు సెకండ్ల సేపు ఆపదారాన్ని ఎప్పడు ఎక్కడ తిన్నామో, త్రాగామో జాపకం చేసుకోవాలి. ఆ తరువాత5 సెకండ్ల సేపు ఆ పదార్థం యెుక్క- రుచిని నాలుక చవిచూచిన అనుభూతిని పొందాలి. ఆ పదార్ధం ఆ సయమంలో సాధకుని నోట్లో వున్నట్లు అతడు దాని రుచిని పొందుతున్నట్లు అనిపించాలి. యీ విధంగా ఒక్కొక్క పదారానికి 10 సెకండ్ల చొప్పన సమయం కేటాయించాలి. యిందువల్ల నాలుకపై రెండు విధాల నియంత్రణ లభిస్తుంది.

1) తినడం మీద, త్రాగడం మీద నియంత్రణ లభిస్తుంది. అందువల్ల హాని కలిగించే పదారాలకు దూరంగా వుండవచ్చు.

2) నాలుక మీద నియంత్రణ లభించడం వల్ల మాట మధురంగా వుంటుంది.తత్ఫలితంగా యితరులతో సంబంధాలు మంచిగా వుంటాయి.

3. ముక్కుపై నీయంత్రణ:

నాలుక వలె ముక్కు క్రియ కూడా వుంటుంది. ఆ రోజున వాసన చూచిన వస్తువుల్ని జాపకం పెట్టుకొని ఆ ఒక్కొక్క వాసన యందు మనస్సును ఏకాగ్రం చేయాలి. వాసన చూస్తున్నట్లు అనుభూతి పొందాలి. 2 లేక తీ సెకండ్ల వరకు ఆ వాసన ఎప్పడు ఎక్కడ చూచిందీ జ్యపకం చేసుకోవాలి.

ఒక్కొక్క వాసనను త తర్ర 6 సెకండ్ల పాటు ముక్కు ద్వారా వాసన చూస్తున్నట్లు అనుభూతి పొందుటకు ప్రయత్నించాలి. ఆ పదార్ధం ముక్కు దగ్గర వున్నట్లు భావించాలి. యిందు వల్ల ముక్కు యొక్క శక్తి పెరుగుతుంది. ముక్కు మీద మనస్సు యొక్క నియంత్రణ పెరుగుతుంది.

4. కంటిపై నీయంత్రణ:

పంచజనేంద్రియాల్లో కడు చంచలమైనవి కండు, వాటి మీద నియంత్రణ పొందటం అవసరం. మూసిన కండ్ల మీద మనస్సును ఏకాగ్రం చేయాలి. మూసిన కండ్ల ఎదుట ఒక తెరవున్నట్లు అనుభూతి పొందాలి. వాస్తవానికి యీ తెర కండ్ల రెప్పలే, యీ రెప్పల తెర మీద క్రింద వివరించిన విధానాలలో తెర మీద చలచ చిత్రం బొమ్మల్ని ప్రసారం చేసినట్లు, జాపకాల చిత్రాల్ని ప్రసారణ కావించుటకు ప్రయత్నించాలి.

1) ఆనాడు చూచిన వారందరి ముఖాలు, ఒక్కొక్కటిగా కనురెప్పల తెర మీద ప్రసారంచేయాలి. 2-8 సెకండ్లపాటు దాన్ని గురించి జాపకం చేసుకోవాలి. సెకండు ఆ ముఖం ఎప్పడు ఎక్కడ చూచిందీ గుర్తు చేసుకోవాలి. తరువాత ఆ ముఖాన్ని 5 సెకండ్ల సేపు, మూసిన కండ్లతో కనురెప్పల తెరమీద చూస్తున్నట్లు అనుభూతి పొందాలి.

2) ఆనాడు చూచిన ఘటాల్ని వస్తువుల్ని పనుల్ని తిరిగి ఒక్కొక్కటిగా కను రెప్పల తెరమీద ప్రసారం చేయాలి. 2-తీ సెకండ్ల పాటు దాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. రెండు మూడు సెకండ్ల పాటు దాన్ని ఎక్కడ, ఎప్పుడు చూచిందీ జాపకం చేసుకోవాలి. 5 సెకండ్ల సేపు మూసిన కండ్లతో ఆ వస్తువును, ఆ ఘటార్ధాన్ని కనురెప్పల తెర మీద చూస్తున్నట్లు అనుభూతి పాండాలి.

3) పుస్తకం లేక పత్రిక ఏది చదివినా, ఆ చదివిన దాని యందలి ఒక్కొక్క పేజీని 2 లేక తీ సెకండ్ల సేపు జాపకం చేసుకోవాలి. తరువాత ఎప్పడు, ఎక్కడ చదివిందీ 2 లేక 8 సెకండ్ల సేపు జాపకం చేసుకోవాలి. 5 సెకండ్ల సేపు, దాని యదార్ధ అనుభూతిని కండ్ల రెప్పల తెర మీద చూస్తున్నట్ల పాండాలి.

యీ విధంగా చేసినందున కంటి శక్తి పెరుగుతుంది. కంటి మీద మనస్సుకు నియంత్రణ లభించడం ప్రారంభమవుతుంది.

5. చర్మంపై నీయంత్రణ:

పంచజ్బనేంద్రియాల్లో అన్నిటికంటే పెద్దది చర్మం. అది శరీరాన్నంతటిని కప్పి వుంచుతుంది. 84 లకల జీవరాసులన్నింటికి చర్మేంద్రియం లభించింది. చర్మం లేని జీవి ఒక్కటి కూడా వుండదు. పుట్టినప్పటి నుంచి చర్మం పనిచేయడం ప్రారంభిస్తుంది. స్పర్శ తగిలితే చర్మం ద్వారా ఆ విషయం ప్రాణికి తెలిసిపోతుంది. చలి, ఉష్ణం, మెత్తని తనం, గరుకు తనం, కాఠిన్యం మొదలుగా గల వాటి జానం చర్మం చురుకుగా పని చేసూ వుండటం వల్ల వెంటనే కలుగుతుంది. చర్మం మీద నియంత్రణ పొందుటకు క్రింద వివరించిన క్రియలు సహకరిస్తాయి. తద్వారా మనస్సు యొక్క చంచలత్వాన్ని తగ్గించవచ్చు.

1) పంఖా తిరుగుతున్నప్పడు వెలవడే గాలి వునకు తగులుతుంది. యిది మామూలుగా జరిగే విషయం కనుక దీన్ని ఎవ్వరూ గమనించరు. ప్రధమ క్రియలో సాధకుడు పంఖా గాలి స్పర్శను గ్రహించాలి. పంఖా క్రిందనో, పంఖాకు దగ్గరగానో కూర్చొని చర్మాన్ని స్పృశిస్తున్న గాలి స్పర్శను గమనించాలి.

జుటు ద్వారా తలకు తగిలే గాలిని, బట్టల ద్వారా శరీరానికి తగిలే గాలిని సాధకులు గమనించాలి. మనస్సును మొదట శిరస్సు పైభాగానికి తీసుకు వెళ్లాలి. జట్టు ద్వారా వెళ్లి గాలి శిరస్సు చర్మాన్ని తాకుతుంది. మనస్సు ఆ భాగానికి వెళ్లి గాలి స్పర్ళానుభూతిని పొందాలి. తరువాత ముఖం యందలి నుదురు, కండల్ల, చెవులు, ముక్కు, పెదవులు, బుగ్గలు మొదలగు అవయవాలకు తగిలే గాలి యొక్క స్పర్భానుభూతిని పొందాలి. తరువాత వీపు, వెన్నెముక, నడుము, ఛాతీ, పొట్ట, బుజాలు మొదలుగా గల వాటికి తగిలే గాలి యొక్క స్పరానుభూతిని పొందాలి. యీ విధంగా ఒక్కొక్క అవయవానికి తగిలే గాలి స్పర్ళానుభూతిని ఒక్కొక్కటిగా పొందాలి.

పంఖా గాలియే గాక వీస్తున్న గాలిలో రైల్లోను, బస్సులోను, కారులోను, తదితర వాహనాల్లోను వెళ్లుతూ వున్నప్పడు శరీరావయవాలకు తగిలే గాలి స్పర్భానుభూతిని పొందాలి. వాహనాలు తామే నడుపుతున్నప్పడు మాత్రం ంునా క్రియు చేయకూడదు. వాహనం నడపడం మీదనే ధ్యానం కేంద్రీకరించాలి. అలా చేయని ఎడల ప్రమాదం సంభవించవచ్చు.

2) వెన్నెముకను నిటారుగా వుంచి కూర్చొని, శరీరానికి తగిలే భూమి యొక్క గురుత్వాకర్షణా శక్తి యొక్క అనుభూతి పొందాలి. యీ శక్తివల్లే ప్రతి వస్తువూ భూమి వైపు ఆకర్షించబడుతుంది. అదే విధంగా ఆశక్తి, శరీరాన్ని సైతం లాగుతున్నట్లు అనుభూతి పొందాలి. కొద్ది క్షణాల్లో శరీరం బరువుగానో లేక తేలికగానో వున్నట్లు అనుభూతి కలగడం ఆరంభమవుతుంది. కొద్ది సమయం యూ అనుభూతిని పొందుతూ వుండాలి.

3) బట్టలు ధరిసూ వుంటాం. ఆ ಐಚ್ಛಿಲ స్పర్భానుభూతిని మనం గమనించం. మొత్తని వస్త్రమో లేక గరుకు వస్త్రమో తగిలితే ఆ అనుభూతిని గ్రహిస్తాం.

ఈ క్రియలో ధరించిన బట్టల వల్ల ఆ కణంలో కలిగే స్పర్భానుభూతిని పొందాలి. అందు కోసం చర్మానికి, శరీర అవయవాలకు చలనం కలిగిస్తే అనుభూతి వెంటనే కలుగుతుంది. దాన్ని రెండు మూడు సెకండ్ల పొందుతూ వుండాలి.

మొదట రెండు బుజాలను పైకి క్రిందికి కదుపుతూ వీపుపై బట్ట యొక్క స్పర్ళానుభూతిని పొందాలి. 2 లేక తీ సెకండ్ల తరువాత, బుజాల్ని కదపడం ఆపి, అటులనే అనుభూతి పొందాలి. తరువాత రెండు బుజాలు ముందుకు వెనుకకు కదుపుతూ ఛాతీ మీద, పొట్ట మీద బట్ట యొక్క స్పర్భానుభూతిని పొందాలి. ఆ కదలికను ఆపి కూడా అటులనే అనుభూతిని పొందాలి. కుడి బుజాన్ని కదపాలి. దాని మీద బట్ట యొక్క స్పర్భానుభూతిని పౌండాలి. యిదే క్రియను ఎడమచేతిపై కూడా చేయాలి. కాళ్లు చాపి, కుడి మోకాలును పైకి క్రిందికి కదుపుతూ కుడికాలిపై, బట్ట యొక్క స్పర్భానుభూతిని పొందాలి. కదలికను ఆపి కూడా ఆ అనుభూతిని పొందాలి. యిదే విధంగా ఎడమ కాలిపై కూడా అట్టి అనుభూతి పొందాలి.

బట్టలు వూర్చుకున్నప్పడు, స్నానం చేసి తువాలుతో &ళన్ల తుడుచుకున్నప్పడు బట్ట యొక్క స్పర్భానుభూతిని బాండాలి. అభ్యాసం అయిన తరువాత అట్టి అనుభూతి సహజంగానే కలుగుతుంది.

4) శరీర వుందలి పలుచోట్ల రెండు రెండు అవయవాలు ఒక దాని నొకటి తాకుతూ ఉంటాయి. ఆ స్పర్భానుభూతిని యీ క్రియ యందు పొందాలి. ఉదాహరణకు కన్నుకు రెప్ప, పైపెదవికి క్రింది పెదవి నాలుక (నోటి లోపల) స్పర్శ పొందుతూ ఉంటాయి. ఇదే విధంగా కూర్చున్నప్పడు కాళ్లు చేతులు అనేక చోట్ల ఒక దానినొకటి తాకుతూ ఉంటాయి. చేతివ్రేళ్లు, కాలిప్రేళ్ళు ఒకదాని నొకటి తాకుతూ ఉంటాయి.

తాకే రెండు అవయవాల మధ్య2 సెకండ్ల సేపు వత్తిడి తేవాలి. అప్పడు రెండు అవయవాల స్పరానుభూతిని తేలికగా గ్రహించవచ్చు, 2 సెకండ్ల తరువాత ఆ వత్తిడిని వదులు చేసూ అదే స్పర్ళానుభూతిని రెండు మూడు సెకండ్ల సేపు పొందుతూ ఉండాలి. కుడి కంటి నుంచి ప్రారంభించి ఒక్కొక్క చోట స్పర్ళానుభూతిని పొందుతూ ఎడమకాలి చివరి రెండు ప్రేళ్ల మధ్య వరకు ఇట్టి స్పర్భానుభూతిని పొందాలి,

5) మన శరీరం ప్రతి కణం పడుతూ గిడుతూ వుండే పేలాదిపడ్గలాలతో నిర్మాణమై వున్నది. పద్ధలాలు పడుతూ గిడుతూ వుండే చోట మన శరీర మందలి చర్మమందు సూక్మంగా కంపనం జరిగిన అనుభూతి కలుగుతుంది. అనేక పనుల్లో లీనమై యున్నందున మనం ఆ అనుభూతిని గమనించం. యీ క్రియ యందు ఆ అనుభూతిని పొందాలి.

చీకట్లో ఏదైనా వస్తువు కోసం వెళ్లినప్పుడు టార్సిలైటు వేసి ఆ వస్తువును వెతుకుతాం. ఎక్కడైనా వస్తువు వున్నదనుకుంటే అక్కడ టార్సిలైటు వేసి వుంచుతాం. తరువాత ముందుకు సాగుతాం. యిది బహుసూక్క క్రియ. యిందు సాధకుని మనస్సు యొక్క స్థితి ఆ టార్సిలైటు వలె వుంటుంది.

పడుకొని లేక కూర్చొని మనస్సును పూర్తి ఏకాగ్రతతో మెల్ల మెల్లగా చర్మం మీదకు సారించాలి. అప్పడు ఆయా చోట్ల కలిగే అనుభూతులు బోధ పడతాయి. 2 లేక తీ సెకండ్ల సేపు అక్కడ మనస్సును ఆపి, తరువాత దాన్ని ముందుకు సాగించాలి. సాక్షిగా వుండి ఆ అనుభూతుల్ని గమనించాలి. వెుదట మనస్సును శిరస్సుప్తై గుండంగా తిప్పాలి. అనుభూతులు పొందాలి. తరువాత ముఖం మీద, గొంతు మీద, వీపు మరియు నడుము మీద, ఛాతీ మరియు పొట్ట మీద ఆ అనుభూతులు పొందాలి. యిట్టి క్రియనే కుడి చేయి, కుడి కాలు, ఎడమ చేయి, ఎడమ కాలు మీద కూడా చేయాలి. ప్రతిచోట మనస్సును చక్రాకారంలో త్రిప్పతూ, అనుభూతి కలిగిన చోట 2 లేక తీ సెకండ్ల సేపు మనస్సును ఆపి వుంచాలి. తరువాత ముందుకు సాగాలి. యీ విధంగా శరీరమందలి చర్మమందంతట తిరిగి మనస్సు సూక్ష్మమైన చలనానుభూతిని పొందాలి. మిగతా క్రియల కంటే యిది కొంచెం కఠినమైన క్రియ.

పైన తెలిపిన క్రియల వల్ల చర్మం మీద నియంత్రణ సాధ్యమవుతుంది. ధ్యాన సాధన చేస్తున్నప్పడు కలిగే అవరోధాల వల్ల, ఆటుపోటుల వల్ల, కల్లోలం వల్ల, అంటే దోమలు కుట్టడం, ఈగలు ముసరడం లాంటి వాటివల్ల సాధనానికి విఘ్నం కలుగదు. సూది గుచ్చుకోవడం, ప్రేళ్లు కాలడం వంటి వాటి వల్ల కలిగే బాధలు భరించే శక్తి లభిస్తుంది.

పైన తెలిపిన పంచజనేంద్రియాలకు సంబంధించిన క్రియల్లో ప్రతి ఒక్కటి సంపూర్ణమైనదే. ఒకదాన్ని ముందు మరోదాన్ని తరువాత చేయవచ్చు. యీ క్రియలు యిష్టమైనప్పడు ఎక్కడైనా చేయవచ్చు. రోజూ నిశ్చిత సమయంలో, నిశ్చితమైన చోట నిరంతరం చేసూ వుంటే ప్రతి క్రియ యందు పూర్ణత్వం కలుగుతుంది. ఇంద్రియా”లపై నియంత్రణ లభిస్తుంది. తరువాతి సాధన సులభం, సరళం అవుతుంది.

III. తృతీయ చరణం – ఆంతరంగ యోగ సాధన :

బెటర్హెల్త్ మెడిటేషన్ యొక్క తృతీయ చరణంలో అంతరంగ యోగసాధనను గురించి తెలుసుకుందాం. ప్రత్యాహారంలో వునస్సును ధ్వనిరహితంగాను, యోచనారహితం గాను, నిశ్శబ్దంగాను వుంచాలి. తరువాత ధారణ కోసం సాధన ఆరంభమవుతుంది. యీ స్థితి యందు శరీరం యొక్క వివిధ శక్తి కేంద్రాలపై మనస్సును ఏకాగ్రం చేయు క్రియలు వుంటాయి. యీ సాధన చేసూ సాధకుడు ధ్యానం యొక్క చరమస్యాయిలో ప్రవేశిస్తాడు.

1. ప్రత్యాహారం:

వివిధ యోగ పద్ధతుల్లో ప్రత్యాహారం యొక్క వివిధ విధానాలు పేర్కొన బడ్డాయి. ముఖ్యంగా మనస్సును పూర్తిగా యోచనారహితంగా వుంచాలి. రకరకాల భావాలకు యోచనలకు మనస్సును దూరంగా వుంచాలి. శరీరం నిశ్చలంగాను మనస్సు యోచనారహితంగాను ప్రశాంతంగాను వుండటాన్నే ప్రత్యాహారం అని ෂටර්ඩ් “ර්ථ.

మనస్సును యోచనారహితంగా వుంచాలని అంటే ఎలా అను ప్రశ్నకు సరియైన సమాధానం యిప్పటి వరకు లభించలేదు. సంవత్సరాల తరబడి చేసిన కృషి Šථටිරර්ථය పరిశోధన ద్వారా మేము క్రింద తెలిపిన విధానాల్ని నిర్ణయించాము.

అకస్మాత్తుగా కరెంటు పోతే చీకటి వ్యాప్తమవుతుంది. తిరిగి కరెంటు వస్తే చీకటి తొలిగిపోతుంది. అంటే చీకటికి ముందు వెలుగు వుందన్నమాట, చీకటి తరువాత కూడా వెలుగు వుందన్నమాట. యిదే విధంగా ఒక యోచన సమాప్తమైతే మనస్సు యోచనారహితం అవుతుంది. క్రొత్త యోచన ప్రారంభం కానంత వరకు యీ స్థితి వుంటుంది. అంటే ఒక యోచనకు మరొక యోచనకు మధ్య ఒక్కకణమే అయీ యోచనా రహిత స్థితి వుంటుందన్నమాట. సాధకుడు ఒక యోచన తరువాత, వులో యోచన ప్రారంభం కావడానికి మధ్య సమయాన్ని ఎక్కువ సేపు ఆపి వుంచుటకు ప్రయత్నించాలి. ఎంత కాలంపాటు క్రొత్త యోచనను ఆపి వుంచగలిగితే, అంత సమయాన్ని ప్రత్యాహారం అని తెలుసుకోవాలి. యిది కష్టం మీద లభించే స్థితి.

కూర్చొని లేక పడుకొని శరీరాన్ని సౌఖ్యం కలిగే స్థితిలో వుంచాలి. శ్వాసపై మనస్సును ఏకాగ్రం చేయాలి. శ్వాసపై మనస్సు ఏకాగ్రం అయినప్పడు మిగతా యోచనలన్నీ మెల్ల మెల్లగా సమాప్తం అయిపోతూ వుంటాయి. కొద్దిసేపు శ్వాస మీద మనస్సును ఏకాగ్రంచేసిన తరువాత, శ్వాసకు సంబంధించిన యోచనను కూడా సమాప్తం చేయాలి. యిది సంపూర్తిగా యోచనారహిత స్థితి, దీన్ని అభ్యాసం చేస్తున్నప్పడు మధ్యమధ్యన ఏదో యోచన బయలుదేరుతూనే వుంటుంది. సాధకుడు యిక్కడే దృఢంగా వ్యవహరించాలి. సమాప్తం కాగానే యోచనా రహితంగాగల శూన్య స్థితిని పొడిగించుకోవాలి. యీ స్థితి యందు మనస్సు పూర్తిగా జాగృతమై వుండాలి. అప్పడు యోచనారహిత స్థితి ఏర్పడుతుంది. అంటే ఏ యోచన వుండదన్నమాట. యిది మైమరపు స్థితి కాని లేక నిద్రాస్థితిగాని కాదు. మస్తిష్కపు నిప్ర్కియత్వపు స్థితి కూడా కాదు.

రోజూ కొద్ది సేపు దీన్ని అభ్యాసం చేయాలి. సంపూర్ణ యోగ శాస్త్రంలో యిది అన్నిటి కంటే కఠినమైన సాధన. బ్లాకుబోరు మీద వ్రాయపూనుటకు ముందు దాన్ని తుడిచి శుభ్రంచేసినట్లు, మనస్సును ఏకాగ్రంచేయుటకు పూర్వం దాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ప్రత్యాహారం యొక్క సాధన యిదియే. అనగా మనస్సును శుభ్రం చేయాలన్నమాట. 2) బెట్టర్ హెల్త్ కాన్సన్డేషన్ –

2. ధారణ:

పేరు ప్రవృత్తులు మానవ శరీరంలో గల అనేక స్మానాలతోను, కేంద్రాలతోను సంబంధం కలిగి వుంటాయి. అటు వంటి కేంద్రాల పరిశోధన చేసి క్రింది నాలుగు శక్తి స్మానాల్ని నిర్మారించాము.

(1) శారీరిక శక్తి కేంద్రం నాభి, యిక్కడ ఉత్పత్తి అయ్యే ప్రాణ శక్తి, యిక్కడి నుంచి ఆరంభమై 7 2000 నాడుల ద్వారా శరీరమందంతటికి చేర్చబడుతుంది.

(2) గొంతు క్రింద గల గుంట నుంచి యోచనలు ఉత్పన్నమై, యిక్కడి నుంచి బయల్వెడలు మనోవహానాడి ద్వారా మస్కిష్కం వరకు చేరుతాయి. గొంతు క్రింద గల గుంట మన మానసిక శక్తుల వికాస కేంద్రం,

(3) రెండు కండ్ల మధ్య గల భృకుటియే బుద్ధి మరియు మేథా శక్తి యొక్క వికాస కేంద్రం. దీన్నిఆజ్న చక్రమని కూడా అంటారు. యిది మన ప్రవృత్తులన్నింటిని నిర్దేశిస్తుంది.

(4) ఆత్మయొక్క ముఖ్య నివాసస్థలి ఛాతీ మధ్యన గల గుంట. దీన్ని హృదయ కమలం అని అంటారు. ఇదే ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శక్తి కేంద్రం.

పైన తెలిపిన నాలుగు స్మానాల మీద, కేంద్రాల మీద మనస్సును ఏకాగ్రంచేసూ వున్నందు వల్ల సాధకుని శారీరిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక విశిష్ట ప్రగతి ఆరంభమవుతుంది.

మంచి ఆరోగ్యం కోసం ధారణాభ్యాసం మూడు స్మాయిల్లో జరుగుతుంది.

ప్రధమ స్థాయి:

ఇందు భృకుటి, గొంతు క్రింది గుంట, ఛాతీ మధ్యన గలగుంట, నాభి వీటి మీద మనస్సును ఏకాగ్రం చేయాలి. యీ కేంద్రాల ఉనికిని మనస్సు గ్రహిసూ వుండాలి.

పద్ధతి :
1) పడుకొని గాని లేక కూర్చొని గాని కుడి చేతి చూపుడు ప్రేలి కొసతో భృకుటిని కొద్ది సెకండ్లసేపు తాకాలి. అప్పడు స్పర్మానుభూతి కలుగుతుంది. ప్రేలును అక్కడి నుంచి తొలగించి కూడా అట్టి అనుభూతిని పొందుతూ వుండుటకు ప్రయత్నిసూ వుండాలి. యీ అనుభూతిని బౌద్ధిక శక్తి కేంద్రంపై మనస్సును కేంద్రీకరించుట అని అంటారు.

2) కుడిచేతి చూపుడు ప్రేలి కొసతో మెడ క్రింద గలగుంటను కొంచెం సేపు మొల్లగా తాకి స్పర్ళానుభూతి పొందాలి. కొద్ది సెకండ్ల తరువాత ప్రేలును తొలగించి కూడా అదే స్పర్ళానుభూతిని పొందాలి. దీన్ని మానసిక శక్తి వికాస కేంద్రంపై మనస్సును ఏకాగ్రం చేయుట అని అంటారు.

3) కుడి చేతి అయిదు వ్రేళ్ల కొసల్ని కలపి దాని సంపుటితో ఛాతీ యందలి గుంటను తాకి సర్భానుభూతి పొందాలి. అయిదు ప్రేళ్ల కొసల సంపుటిని తొలగించి కూడా అట్టి స్పర్ళానుభూతిని పొందాలి. యిది ఆధ్యాత్మిక శక్తి వికాస కేంద్రంపై మనస్సును ఏకాగ్రం చేయుట అని అంటారు.

4) అయిదు ప్రేళ్ల కొసల సంపుటితో నాభినిమెల్లగా తాకుతూ, సర్ళానుభూతి పొందాలి. ప్రేళ్ల సంపుటిని తొలగించి కూడా అట్టి స్పర్శానుభూతిని పొందుటకు ప్రయత్నించాలి. దీన్ని శారీరిక శక్తి వికాస కేంద్రం మీద మనస్సును ఏకాగ్రం చేయుట అని అంటారు.

కొద్ది రోజుల అభ్యాసం తరువాత ప్రేళ్ల కొసలతో ఆయా శక్తి కేందాల్ని తాకవలసిన అవసరం వుండదు. తిన్నగా వునస్సు ద్వారా ఆయూ కేంద్రాల అనుభూతిని పొందవచ్చు. ప్రారంభంలో ప్రతి కేంద్రంలోను 2-8 నిమిషాల పాటు అభ్యాసం చేయాలి. యీ క్రమాన్ని 3-4 సార్లు చేయాలి. ఏ శక్తి ఎక్కువ ప్రయోజనకారియో తెలుసుకొని, ఆ శక్తి కేంద్రం మీద మనస్సును ఎక్కువ సేపు ఏకాగ్రం చేయవచ్చు.

ద్వితీయ స్థాయి:

మనస్సును ఏకాగ్రం చేసే పై క్రియల్ని చేసి విజయం సాధిసూ ద్వితీయ స్థాయిలోకి అడుగుపెట్టాలి. పై నాలుగు కేంద్రాల్లో విశిష్ట అనుభూతుల్ని మనస్సు ద్వారా పొందుటకు ప్రయత్నించాలి.

1) భృకుటికి బుద్ధితో సంబంధం వున్నది. బుద్ధికి జనంతో సంబంధ వున్నది. జానాన్ని ప్రకాశం అని కూడా అంటారు. ప్రకాశం సూర్యుని వల్ల లభిస్తుంది. భృకుటిపై మనస్సును కేంద్రీకరిసూ ఆ చోట సూర్యోదయానుభూతిని పొందాలి. కొద్ది రోజులు అభ్యాసం చేసిన తరువాత తేజస్సుగల బంగారు ఎరుపు రంగుతో కూడిన సూర్యోదయానుభూతి కలుగుతుంది. సూర్యుని బంగారు కిరణాల ప్రసారం భృకుటిపై నుదుటిపై జరుగుతున్నట్లు అనుభూతి పొందాలి.

2) వెండ క్రింద గుంటలో వనానసిక శక్తులు కేంద్రీకరించి వుంటాయి. వునస్సుకు ఆనందంతో సంబంధం ఉన్నది. ఆకుపచ్చని ధాన్యంపైరు రంగు ఆనందానికి ప్రతీకం. మనస్సును కంఠమందలి గుంటపై ఏకాగ్రంచేసూ కంఠమంతా ఆనందాన్ని సూచించే ఆకుపచ్చని రంగుగల రిబ్బను యొక్క అనుభూతిపొందాలి.

3) ఆధ్యాత్మిక శక్తి ఆకాశం వలె అనంతం. అసేమితం. మనస్సును హృదయ కమలం మీద ఏకాగ్రం చేసూ ఛాతీ యందంతట ఆకాశం రంగు వ్యాప్తమవుతున్నట్లు అనుభూతి పొందాలి.

4) అగ్ని శారీరిక శక్తికి ప్రతీకం, మనస్సును నాభిమండలంపై ఏకాగ్రంచేసూ దాని చుటూరెండు అంగుళాల అగ్నివంటి ఎర్రని తేజస్సుగల గుండ్రని చక్రానుభూతి పాండాలి.

ఇట్టి అనుభూతులు కొద్ది రోజులు అభ్యాసం చేసిన తరువాత కలుగుతాయి. ప్రారంభంలో ఎట్టి అనుభూతి కలుగకపోయీ నిరాశపడకూడదు. అనుభూతులు పొందుటకు అభ్యాసం చేసూ వుండాలి.

తృతీయ స్థాయి:

ఇది పైన వివరించిన బౌద్ధిక, మానసిక, ఆధ్యాత్మిక, శారీరిక శక్తుల్ని పరమశక్తితో కలుపునట్టి విధానం. యీ కేంద్రాల్లో పరమాత్ముని సర్వవాప్త ప్రతీకం 3% చిహ్నానుహూతిని పొందాలి.

1) భృకుటి యందు సూర్యోదయం అనుభూతి కలిగినప్పడు దాని మధ్య అర అంగుళం ఎత్తైన తేజస్సుతో నిండిన ఎరుపు రంగు తెస్ చిహ్నానుభూతి పొందాలి. ఇది భౌద్ధికశక్తి, పరమశక్తిని కలియుట అన్నమాట.

2) కంఠ మందంతట ఆనందంతో నిండిన ఆకుపచ్చని రంగు రిబ్బను అనుభూతి పొందుతూ కంఠం మధ్య ఒక అంగుళం ఎత్తైన ముదురు ఆకుపచ్చని రంగుగల 3% చిహ్నానుభూతి పొందాలి. ఇది మానసిక శక్తి, పరమశక్తిని కలియుట అన్నమాట.

3) ఛాతీ యందు ఆకాశపు రంగు అనుభూతి పొందుతూ హృదయ కమలంలో రెండు అంగుళాల ఎత్తైన ముదురు నీలి రంగుగల 36 చిహ్నానుభూతి పొందాలి. ఇది ఆధ్యాత్మిక శక్తి, పరమశక్తిని కలియుట అన్నమాట.

4) నాభి చుటూ తేజస్సుతో నిండిన ఎర్రని గుండ్రని చక్రం మధ్య అరంగుళం ఎత్తైన ముదురు బ్రౌను రంగుగల ఓం చిహ్నానుభూతి పొందాలి. ఇది శారీరిక శక్తి, పరమ శక్తిని కలియుట అన్నమాట.

పైన తెలిపిన క్రియల్లో 36 చిహ్నానికి బదులు, మరేదైనా చిహ్నం అనగా స్వస్తిక్ అర్థచంద్రాకారం, త్రాసు మొదలగు ఏ చిహ్నం మీద అభిరుచి వుంటే, దాన్ని ఉపయోగించవచ్చు.

సోదరీమణులు తమ నొసట తిలకందిదుకుంటున్నట్లుగా యీ అనుభూతులు పొందాలి.

3% చిహ్నం శరీరం లోపలి నుంచి బయటికి చూస్తున్నట్లు లేక బయటి నుంచి లోపలికి చూస్తున్నట్లు అనుభూతి పొందవచ్చు.

బి.హెచ్ యం. ధ్యానయోగ ఏకాగ్రతకు సంబంధించినపై క్రియలు క్రమంగా చేసూ సాధకుడు తన శారీరిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక శక్తుల్ని వికసింపచేసూ, ధ్యానం యొక్క ఉన్నత స్థితి చేరుకోగల శక్తి గడించాలి.

3. బెటర్ హెల్త్ మెడిటేషన్ చరమస్థితి – ధ్యానం:

ధ్యానం యొక్క అనేక విధులున్నాయని మొదట సూచించాము. వాటి యందు బెటర్హెల్త్ ధ్యాన యోగ విధానానికి ఒక ప్రత్యేకత వుంది. యీ విధానంలో రెండు స్థితులు వుంటాయి.

(1) మనస్సు ఆత్మల కలయిక అనగా మనస్సుతో ఆత్మను స్పృశించుట.

(2) ఆత్మపరమాత్మల కలయిక. అనగా ఆత్మపరమాత్మ యందు విలీనమగుట.

మొదటి స్థితికి అభ్యాసం అవసరం.

రెండవ స్థితి సంపూర్ణ సాధనా ఫలం, అందుకు చాలా సమయం పడుతుంది.

బెటర్ హెల్త్ మెడిటేషన్ పాఠ్యక్రమంలో మొదటి స్థితి యొక్క అభ్యాసమే చివరి మొటు.

సామాన్యంగా శరీరమందంతటా ఆత్మయొక్క చైతన్యానుభూతి కలుగుతూ వుంటుంది. కాని ఆత్మయొక్క ముఖ్య నివాస స్మానం ఛాతీ మధ్యనగల గుంట యందలి హృదయకమలానికి సరిగా వెనుక, ఛాతీకి వీపుకి సరిగా మధ్య వున్నది. మనస్సు ద్వారా సూక్ష్మాతిసూత్క ఆత్మానుభూతి పొందడమే యీ పాఠ్యక్రమము యొక్క ముఖ్య లక్యం,

చీకట్లో టార్సిలైటు పటుకొని పోగొటుకున్న వస్తువును మనం వెదికినట్లు మనస్సును హృదయకమలం గుండా లోనికి గొంపోయి, ఆత్మాన్వేషణ ఆరంభించాలి. హృదయంలోపల, పైన, క్రింద, కుడివైపు, ఎడమవైపు, నాలుగు వైపుల మనస్సును త్రిప్పాలి. ఆ అన్వేషణా క్రమంలో అతి సూక్క ఆత్మ స్పర్ళానుభూతి మనస్సుకు కలుగుతుంది. యీ అనుభూతి దీపం కాంతి వలె వుంటుంది. పేరు పేరు సాధకులకు నీలం, పసుప్తుపచ్చ, ఎరుపు, బంగారు, తెలుపు మొదలగు పేరుపేరు రంగుల అనుభూతి కలుగవచ్చు. ప్రారంభంలో అభ్యాసం చేసూ వున్నప్పడు యీ అనుభూతి 1-2 సెకండ్ల సేపు మాత్రమే కలుగుతుంది. నిరంతరం అభ్యసిసూ వుంటే యీ అనుభూతి ఎక్కువసేపు స్థిరంగా వుండిపోతుంది. మనస్సుకు ఆత్మస్పర్శ కలిగినప్పడు సాధకుని ఉనికి దివ్యత్వానుభూతి పొంద సాగుతుంది. చెవుల్లో దివ్య సంగీత ధ్వని, నాలుక మీద దివ్యరుచి, ముక్కు నందు దివ్యసుగంధం, కండ్ల ముందు దివ్య ప్రకాశం, చర్మమందంతట దివ్యస్చర్ళ యొక్క సుఖానుభూతి కలుగుతుంది. ఆ దివ్యానుభూతిని సాధకుడు పొందగలడే గాని వివరించి చెప్పలేడు.
కబీరుదాసు చెప్పిన

ఆతమ అనుభవజ్బన్కీ జోకొయి పూచైబాత్
సోగూంగా గుడ్భాయికై కపెట్టాకౌన్ ముఖ్ స్వాద్?

అనగా ఆత్మానుభూతికి సంబంధించిన జానాన్ని గురించి ఎవరైనా అడిగితే ఎలా చెప్పడం? మూగవాడు బెల్లం පිඹි ධී”&) ර්ථඩිබ් ධෆ් • చెప్పగలడు ?

పద్ధతి
సాధకుడు పడుకోవాలి లేక వెన్నెముకను నిటారుగా నిలిపి కూర్చోవాలి. శ్వాస మీద మనస్సును సహజంగా ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రత బలపడుతూ వున్నప్పడు మనస్సును హృదయ కవులంపై కేంద్రీకరించాలి. ప్రయత్నిసూ మనస్సును ఛాతీలోనికి దింపాలి. గుండు సూది గాని లేక ఇంజక్షను సూది గాని శరీర మందు దిగినట్లు యిది మనస్సును హృదయ మందు దింపవలసిన క్రియ. మనస్సును పూర్తిగా ప్రశాంతంగా వుంచుతూ పైన తెలిపిన ప్రకారం ఆత్మాన్వేషణ ప్రారంభించాలి. కొద్ది సెంకడ్ల సేపు మాత్రమే యిట్టి అనుభూతి కలిగినా, యీ అన్వేషణను మాత్రం సాగిసూనే వుండాలి.

ఆరంభంలో 5 లేక 10 నిమిషాల సేపు యీ సాధన చేయాలి. తరువాత మొల్ల మెల్లగా సాధనా సమయాన్ని ఒక గంట వరకు పెంచవచ్చు.

సాధనా సమయంలో శరీరాన్ని కదలకుండా స్థిరంగా వుంచాలి. శరీరం ఎంత కదిలితే మనస్సు కూడా అంత కదులుతుంది. సాధన పక్కా అవుతుంది. ఈ సాధన చేసూ వున్నప్పడు సాధకునికి మనస్సును పేరు పేరు విభాగాలుగా విభజించి పలు క్రియల్ని ఒకే సారి చేయగల శక్తి లభిస్తుంది. సమయం చిక్కినప్పడల్లా పై క్రియలు చేసు సాధకుడు 24 గంటలు ఆ క్రియల యందు లీనమై సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


శ్వాస పై ధ్యానాన్ని కేంద్రీకరించుట, ఇం(దియూల్ని నియంత్రణలోనికి తెచ్చుట, ప్రత్యాహారం, ధారణల అభ్యాసం చేసూ, ధ్యాన సాధన యందు విజయం పొందుట సాధకుని శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల, నియమబద్ధ అభ్యాసం మీద ఆధారపడి వుంటుంది.

బెటర్హెల్త్ విధానాల సాధన ద్వారా వేలాది మంది సాధకులు ఏ విధంగా శారీరిక, మానసిక రుగ్మతలు పోగొట్టుకొని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారో, అదే విధంగా కొత్త సాధకులు యీ సాధనచేసూ తమ జీవితకాలంలోనే పరమాత్మ కలయికకు సహకరించే యోగసాధన ဎွိ;ü- చరమ స్మాయిని చేరుకోవాలని మా అభ్యర్థన.