24. బంధ్


బంధ్ అనగా బంధించుట లేక నియంత్రించుట అని భావం. బంధీలనే యీ యోగ క్రియల వల్ల శారీరిక, మానసిక ప్రవృత్తులను బంధించి అనగా నియంత్రించి వుంచవచ్చు.
బంధ్ లు నాలుగు రకాలు.

1. జాలంధర్ బంధ్
2. ఉడ్యాన బంధ్
3. మూల బంధ్
4. మహా బంధ్

1. జాలంధర్ బంధ్:

విధానం:
సుఖాసనం గాని లేక పద్మాసనంగాని వేసి రెండు అరచేతులతో మోకాళ్లను నేలపై అణచి, శ్వాసను వదలాలి, తిరిగి పిల్చాలి. మెడను ముందుకు బాగా క్రిందికి వంచి చిబుకాన్ని గట్టిగా కంఠానికి ఆనించాలి. ఆపగలిగినంత సేపు ఆపి, తలను ఎత్తి, శ్వాసను నెమ్మదిగా వదలాలి. కండు మూసి ఉంచాలి. శ్వాస పీల్చాలి. ఇది ఒక రౌండు, మూడు నాలుగు సార్లు యిలా చేయాలి.

లాభాలు:
మెడ బాధలు, శ్వాస బాధలు, గొంతుకు ! సంబంధించిన బాధలు తగుతాయి. మనస్సుకు రిలాక్సు లభిస్తుంది, కోపము, మానసిక వత్తిడి తగుతాయి.

సూచన:
శ్వాసను లోపల నింపి చేసినట్లే శ్వాసను బయటికి వదిలి కూడా చేయవచ్చు.

2. ఉడ్యాన బంధ్:

విధానం:
సుఖాసనం లేక పద్మాసనం లేక వజ్రాసనంలో కూర్చొని గాలిని లోనికి పూరించాలి. ఆ గాలిని లోపల వుంచి కుంభకం చేయాలి. తరువాత ఆ గాలిని బయటికి రేచకం చేసూ పొట్టను లోనికి అణిచి ముడచాలి. యీ స్థితి యందు సాధ్యమైనంత సేపు ఆగి, తిరిగి గాలినిలోనికిపీల్చి ఉదరాన్ని ఉబ్చించాలి. ఈ బంధ్ నిలబడి కూడా సాధకుడు చేయవచ్చు.

లాభాలు:
దీనివల్ల పేగులు, ఉదరం, వునా (త పిండాలకు సంబంధించిన వ్యాధులు, మలబద్దకం నయువువుతాయి. పొట్ట యందు గల వ్యర్థపు (కొవ్వు, మధుమేహం తగుతాయి. సోమరితనం పోతుంది.

నౌలిక్రియ చేయు వారికి యిది ఆరంభ క్రియ.

నిషేధం:
అల్ల్సరు, హెర్నియా, గుండె జబ్బు, పెల్లా బి. పి. కలవాళ్లు, గర్భిణీ స్త్రీలు యీ బంధ్ క్రియ చేయకూడదు.

3. మూల బంధ్:

విధానం:
సుఖాసనం లేక పద్మాసనంపేసి, మలరంధాన్ని ముడిచి, అక్కడి కండరాల్ని కొద్దిగా బిగించి, పైకి లోపలికి లాగి వుంచాలి. కొద్దిసేపటి తరువాత బిగించిన ఆ కండరాల్ని వదులు చేయాలి.

లాభాలు:
ఈ బంఫ్ వల్ల పేగులు శుభ్రపడతాయి. ముఖ్యంగా ఆంతరిక శక్తి “ධර්ථර්ථෂීරියටයි. ෆ්රථථමව (పైల్చు: పిశ్చుల, ఫిషర్) వ్యాధులు, మలమూత్ర ద్వారాలకు సంబంధించిన జబ్బులు నయమవుతాయి.

4. మహా బంధ్:

విధానం:
జాలంధర్, ఉడ్యాన, మూలబంధ్ క్రియలు ఒకే సారి కలపి చేయడాన్ని మహాబంధ్ అని అంటారు. యీ క్రియు చేస్తున్నప్పడు కండు మూసి వుంచాలి.

లాభాలు:
జాలంధర్, ఉడ్యాన, మూలబంధ్ యీ మూడు క్రియల వల్ల కలిగే ప్రయోజనాలన్నీ యొూ మహాబంధ్ క్రియ వల్ల కలుగుతాయి.

సూచన:
పై నాలుగు బంధ్ లు మలశుద్ధి అయిన తరువాత చేయూలి. ఆరంభంలో నిపుణుల నిరీకణలో చేయడం మంచిది.


పై బంధ్ ల అభ్యాసం ద్వారా సాధకులు వుృత్యు భయూన్నుంచి విముక్తులవుతారు. అందువల్ల వీటిని సద్వినియోగం చేసుకోవాలి.