25. స్త్రీలు – యోగాభ్యాసం

భారతావని పురుష ప్రధాన దేశం. సంఖ్యలో సగం దాకా వున్నా మన సమాజంలో స్త్రీలకంటే పురుషులకే ప్రాధాన్యం ఎక్కువ. హక్కులు, అధికారాలు పురుషుల కంటే స్త్రీలకు తక్కువేనని చెప్పక తప్పదు. విద్యారంగంలో కూడా స్త్రీలను వెనుకనే వుంచడం జరిగింది. మనదేశం కంటే పాశ్చాత్యదేశాల్లో స్త్రీలు అన్ని రంగాల్లోను ముందంజలో వున్నారు. స్త్రీలు అభివృద్ధి పధానముందుకు ੦੦ వాళ్లకు ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. ఆర్థికంగా స్త్రీలు తమకాళ్ల మీద నిలబడగలిగి వుంటే మిగతా అధికారాలన్నీ వాటంతట అవే లభిస్తాయి. ప్రస్తుతం మన దేశంలో గల స్త్రీలు అధికశాతం ఆర్థికంగా వెనకబడి వున్నారు. ఆరోగ్యం విషయం కూడా అంతే. ఇంటిపనుల వరకే స్త్రీలు సీమితం చేయబడ్డారు. అందువల్ల స్త్రీలు వస్తాదులు కావలసిన అవసరం లేదనే భావం సామాన్య ప్రజల్లో వ్యాప్తమై వుంది. కనుక వ్యాయామం, కసరత్తు, యోగాభ్యాసం, ఆటలు, పాటలు మొదలుగా గల రంగాల్లో స్త్రీలను ఎవ్వరూ పట్టించుకో లేదు. ఇంటి పనులతో సతమతం అవుతుంటే యిక యూ వ్యాయూవూలు, యోగాసనాలు వూకెందుకనే భావం స్త్రీలలో కూడా ఎక్కువగానే వ్యాప్తమై వుంది. స్త్రీలకు ముఖ్యం సౌందర్యం. పెండ్లి కాక పూర్వం కన్య ఎంతో బలంగా, అందంగా కోమలంగా వుంటుంది. కాని పెండ్డి అయి ఇద్దరు పిల్లలు పుట్టేసరికి ఆ కన్య రూపం మారిపోతుంది. చిన్న వయస్సులోనే వయస్సు మళ్లినట్లు కనబడుతుంది. కనబడటమే కాదు, నిజంగానే అధికంగా స్త్రీలు శారీరికంగా బలహీన పడుతున్నారు. యీ విధానంలో మార్పు రావాలంటే تكن نعرث యోగాభ్యాసం నేర్పడం అవసరం. స్కూళ్లలో నేర్పబడే (డిల్లు సరిపోవు.

యోగ కేంద్రాల్లో స్త్రీలు చేరి ఇప్పడు బాగా యోగాభ్యాసం చేస్తున్నారు. దీని వల్ల వారి ఆరోగ్యం కుదుట పడటమేగాక వారి జీవిత విధానంలో కూడా మార్పువస్తున్నది. ఒక స్త్రీ యోగవిద్య నేర్చుకుంటే ఆమె కుటుంబమంతా యోగ వేశేషాలు విద్య నేర్చుకుంటుంది. ఆ విధంగా ప్రతి కుటుంబంలోను ఇల్లాలు విద్యావంతురాలై యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యవంతురాలైతే లూ నాటి సవూజ స్వరూపమేు మారిపోతుంది.

యోగాభ్యాసం స్త్రీల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అనుకోవడం సరికాదు. పశ్చిమోత్తానాసనం, భుజంగాసనం, ధనురాసనం స్త్రీల గర్భాశయానికి సంబంధించిన జబ్బులకు పని చేస్తాయి. సర్వాంగాసనం, హలాసనం, శవాసనం వల్ల హిస్టీరియా తగ్గిపోతుంది.

యోగాభ్యాసం ప్రారంభించిన మహిళలు ప్రారంభంలో తేలిక ఆసనాలు వేయాలి. తరువాత పెద్ద ఆసనాలు వేయాలి. అలా వేయడం వల్ల స్త్రీల ఆరోగ్యం బాగుపడటమే గాక నైపుణ్యం సంపాదించి ఇతర మహిళలకు కూడా నేర్చి మంచి మార్గం చూపించ గలుగుతారు.

యోగాభ్యాసం చేసే స్త్రీలు క్రింది విషయాలు గ్రహించాలి.

1. ముటు అయ్యే సమయంలో యోగాభ్యాసం చేయకూడదు. ఆ మూడు నాలుగు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.

2. సామాన్య పద్ధతిలో ప్రసవించిన స్త్రీ, ప్రసవించిన 45 రోజుల తరువాత నుంచి తేలిక ఆసనాలు ప్రారంభించవచ్చు.

3. ఆపరేషను జరిగి ప్రసవించిన మహిళలు మూడు నాలుగు మాసాల వరకు యోగాభ్యాసం చేయకూడదు. అయితే ఇంట్లో అటు ఇటు బాగా తిరుగుతూ వుండాలి. ఆ తరువాత యోగాభ్యాసం చేయవచ్చు.

4. సూర్య నమస్కారాలు మహిళలకు బానిక్కుగా పని చేస్తాయి. శరీర అవయవాలు శక్తిని పుంజుకుంటాయి. వుటు అయినప్పడు, గర్భం ధరించినప్పడు స్త్రీలు సూర్య నమస్కారాలు చేయకూడదు.

5. గర్భిణీ స్త్రీలు తేలిక ఆసనాలు మాత్రమే వేయాలి. ఆరో మాసం నుంచి సూక్ష్మ యోగ క్రియలు మాత్రమే చేయవచ్చు.

ఇప్పడు పురుషులతో బాటు స్త్రీలు కూడా ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ స్త్రీలు ఉత్సాహంతో యోగాభ్యాసంలో ముందడుగు వేయడమే గాక దేశమందంతట జరుగుతున్న యోగ పోటీల్లో విజయం పొంది బంగారు పతకాలు సాధిస్తున్నారు. ఉదాహరణకు 1997 జనవరి 8వ తేదీనాడు ఈనాడు దినపత్రికలో ప్రచురించబడిన సారాంశం యిచ్చట ప్రచురిస్తున్నాం.

“సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక వికాసానికి దోహదం చేసే అంశాలలో యోగాను ప్రముఖంగా పేర్కొనవచ్చు. చక్కటి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిసూ, జాపకశక్తిని పెంపొందించే యోగసాధనకు వయస్సుతో నిమిత్తం లేదు అని నిరూపిస్తున్నారు ఎనిమిదేళ్ల చిన్నారుల నుండి అయిదు వసంతాలు పూర్తి చేసుకున్న పెద్దల వరకు ఉన్న ఈ యోగసాధకులు.

ఇదివరలో యోగసాధన పురుషులకు మాత్రమే పరిమితమైన అంశంగా భావించే వారు. అయితే నేడు మహిళలు కూడా పలువురు – యోగసాధనలో తమ ప్రతిభా సంపత్తులను ప్రదర్శిస్తున్నారు. సరిగా ఈ కోవకే చెందుతారు – రాష్ట్ర స్మాయి యోగా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన ఈ ఆంధ్ర ఆడపడుచులు.

ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలం నార్పింగి గ్రామంలో పదవ రాష్ట్రస్తాయి యోగా పోటీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల బాలికల నుండి 50 సంవత్సరాల వయస్సు గల మహిళల వరకు ఈ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు.

కఠినమైన సాధనతో కూడుకొని ఉన్నాయోగాలో తామూ రాణించగలమని నిరూపిస్తున్న ఈ మహిళా ప్రతినిధులు అభినందనీయులు.”