2. మంచి అలవాట్లు

సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి, అందలి పనికిరాని మొక్కల్నితొలగించి, దున్ని నీరుబట్టి, ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది.

మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాన్ని అదుపులో వుంచి చెడును తొలగించి వుంచిని పెంచితే పురుషారాన్ని సాధిస్తుంది. శరీరాన్ని సత్వపధాన పయనింప చేయుటకు వుంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనస్సును మలుస్తాయి.

మన అలవాట్ల మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమ శిక్షణ, సచ్చీలత, సత్సంప్రదాయాల్ని నేర్చుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే యిప్పడు రకరకాల ప్రలోభాలకు, ఆకర్షణలకు లొంగి యువకులు, పెద్దవాళ్లేగాక బాలబాలికలు సైతం చెడు అలవాట్లకు లోనవుతున్నారు. యీ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల ඊරටටඩ් అలవాటు సాధకులకు అలవడుతాయి.

దినచర్య, ఆహారం, ఉపవాసం, నీళ్లు, మలవిసర్జన, మూత్రవిసర్జన, స్నానం, నిద్రలను గురించిన వివరాలు తెలుసుకొని, వాటిని సక్రమంగా అమలుబరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది.

1. దినచర్య

ఆరోగ్యంగా వుండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగాను, సక్రమంగాను వుండాలి. అంటే దినచర్య మంచిగా వుండాలన్నమాట.

ప్రతి రోజు రాత్రిళ్లు త్వరగా పడుకొని ప్రొదున్నే త్వరగా లేచి దాహంవేసినా వేయకపోయీ చెంబెడు లేక గ్లాసెడు మంచినీళ్లు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి, ముఖం కడుక్కొని ఉదయం అవకాశం దొరికితే వాహ్యాళికి వెళ్లాలి. తరువాత స్నానం చేయాలి. ముఖం కడుక్కునేప్పడు నాలిక మీదగల పాచిని బద్దతో తప్పక గీకివేయాలి. చాలా మంది పుక్కిలించి ఉమ్మి వూరుకుంటారు. అది సరికాదు. అంతే గాక నోటిలోపలి కొండనాలుకను చేతిబొటన వేలితో (గోరు తగలకుండా చూచుకొని) రెండు మూడు సార్లు కొద్దిగా నొక్కి శుభ్రం చేయాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసిన తరువాత పళ్లు తోముకోవాలి. అందువల్ల పళ్లకు, చిగుళ్లకు, నాలికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. సూదులతోను, గుండు సూదులతోను పళ్లుకుటుకోకూడదు. ఏమి తిన్నానోటిలో నీళ్లు పోసుకొని రెండు మూడుసార్లు తప్పక పుక్కిలించి ఉమ్మివేయాలి.

సాధ్యమైనంత వరకు చన్నీళ్లతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోను, బాగా జబ్బు పడినప్పడు గోరువెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుదుతూ స్నానం చేయవచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్యం కావాలి.

మనం ధరించే బట్టలు బిగుతుగా వుండక, వదులుగా వుండాలి. ప్రతిరోజు ఉతికిన బట్టలు ధరించాలి. కొన్ని గ్రామాల్లో యిప్పటికీ ఉతికిన బట్టలు జనం ధరిసూ వుంటారు. కాని అన్నిచోట్ల యిది సాధ్యం కావడం లేదు. అయినప్పటికి ఉతికిన బట్టలు ధరించడం అన్ని విధాల మంచిది.

నిద్ర ప్రతి జీవికీ అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా వున్నట్లు భావించాలి. నిద్రపట్టక పోవడం అనారోగ్యానికి గురు, పడుకునే ప్రదేశం శుభ్రంగాను, గాలి వెలుగు వచ్చే విధంగాను వుండాలి. మంచం లేక చాప, పరుపు, పక్కగుడ్డలు శుభంగా వుండాలి.

ఇతరులతో మంచిగాను, తీయగాను మాట్లాడాలి. సత్యం పలుకుతూ వుండాలి. అయితే సత్యం ప్రకటించే విధానం కటువుగా వుండక, మంచిగా మధురంగా వండాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా ! స్వార్థచింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు ముఖ్యంగా ်မဲလုံ့၅83*းသိဿဗဒဲ’ခး దీనులకు, రోగులకు సేవ, సాయం, మంచి చేయడం అలవాటు చేసుకోవాలి.

ప్రతిరోజూ పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యను ప్రతివ్యక్తి సమీక్షించుకొని, రేపటి దినచర్యను నిర్మారించు కోవాలి. ఏనాటికానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలను డైరీలో తేదీల వారీగా వ్రాసుకోవాలి. యీ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే, క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా దేశానికి మేలు జరుగుతుంది.

2. ఆహారం

మనిషి జీవించి వుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహారం నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్యాలు ప్రసాదించింది. ఆపదార్యాల్ని వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా, ఆరోగ్యంగా బ్రతకవచ్చు.

ఆకు కూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పలు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి ( ဓမ်မွေ့ညွှ§) • ဇ်မဲမဲမဲမန္တ కొబ్బరి మొదలుగా గల ఆహారపదారాలు మితంగా వాడాలి.

ఋతువుల ప్రకారం లభించే పండు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ ఖర్బూజా, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయి, నారింజ, కమలా, పనస, రేగి, ద్రాక, సీతాఫలం మొదలుగా గల పండు తినవచ్చు. ఆయా పండ్ల రసాలు తాగవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు, కీస్మిస్, ఎండు దాక, అఖరోట్, పేరుసెనగ, పిషా, అంజీర మొదలుగా గల తిండి పదారాలు కూడా లభిస్తున్నాయి.

గోధుమ, వరి, జొన్న సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలచందలు, శనగలు, మొదలుగాగల తిండి గింజలు అధికపరిమాణంలో లభిస్తున్నాయి. పాలు, వెన్న మీగడ, నెయ్యి, లస్సీ, మట్టిగ, పెరుగు, పాలతో తయారయ్యే పలు రుచికరమైన పదారాలు, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుంచి వెలువడు నూనెలు, తేనె, బెల్లం, పంచదార, తాటిబెల్లం, చెరకు మొదలుగా గల తీపి పదారాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే, వేళకు తీసుకుంటూ వుంటే రోగాలు దరిదాపుకు రావు. గుడ్డు, చేపలు, మాంసం తామస పదార్యాలు. వీటిని తిన్నందువల్ల తామసరాజస గుణాలు అధికం అవుతాయి. అందువల్ల వాటిని తినక పోవడం మంచిది.

మద్యం, గంజాయి, బంగు, నల్లమందు, పొగాకు మొదలగునవి మత్తు গুণ্ড నిషా ఎక్కించే పదారాలు. వీటిని వాడకూడదు.

భాద్య పదార్యాలు, స్వీట్ల, ఎప్పడు బడితే అప్పడు లభించాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలు పట్టుకుంటాయి.

భోజనం రెండు పూటలు మాత్రమే చేయడం మంచిది. టిఫినుకు భోజనానికి మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి అవసరం. ఉదయంపూటకి గంటల నుంచి 11 గంటల లోపున భోజనం చేసే వాళ్లు ఉదయం టిఫిన్ తీసుకోకూడదు. మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య పండు తిన వచ్చు. పండ్ల రసంగాని, అలవాటు అయిన వాళ్లు ఒక కప్ప కాఫీగాని, టీ గాని తాగవచ్చు. కాయ కష్టం చేసే వాళ్లు తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్లు తక్కువ ఆహారం తీసుకోవాలి.

ఆహారపదారాల్ని తాగాలి, నీళ్లను తినాలి, ఈట్ లిక్విడ్స్, డింక్ సాలిడ్స్ అనునది అందరికీ తెలిసిన నానుడియే. మనం తినే ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణ కోశంలోకి వెళ్లి జీర్ణం అవుతుంది అంటే ఆహారాన్ని నీరువలె వూర్చి తినాలన్నమాట. నీళ్లు మరియు పేయ పదారాలు నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ వున్నట్లు తాగాలి. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్లు గట్టి పడతాయి.

సూచనలు :
1. ప్రాదున మేల్కొనగానే చెంబెడు లేక గ్లాసెడు మంచి నీళ్లు తప్పని సరిగా త్రాగాలి.

2. మలమూత్ర విసర్జన చేయకుండా ఏమీ తినకూడదు. ప్రొదున్నే మలవిసర్జనం అలవాటు లేని వాళ్లు అట్టి అలవాటు చేసుకోవాలి. అందుకు రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగాలి.

3. రాత్రి భోజనం చేయునప్పుడు సాధ్యమైనంత వరకు మధ్యన నీళ్లు తాగకూడదు.

4. యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్దిసేపటి దాకా ఏమీ తినకూడదు. వాహ్యాళికి వెళ్లి వచ్చిన తరువాత కూడా కొద్దిసేపు ఏమీ తినకూడదు.

5. నిద్రపోయే ముందు ఏమీ తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవధి వుండటం అవసరం.

6. ఉపవాస సమయంలో టిఫిన్ల పేరట అమితంగా తినకూడదు. జబ్బు పడినప్పడు పత్యంగా ఆహారం తీసుకోవాలి.

7. పాసిపోయిన, మురిగిపోయిన ఆహార పదారాలు తినకూడదు.

8. సగం పాడైన పండ్లు, పాడైనంత వరకు తొలగించి, బాగా వున్నది కదా అని మిగతా భాగం తినకూడదు.

9. భోజనం చేయుటకు ముందు నీళ్లతో పాదాలు, ముఖం, చేతులు తప్పక కడుక్కోవాలి. అందువల్ల టెన్షను తగుతుంది. భోజనం తేలికగా జీర్ణం అవుతుంది.

10. భోజనం చేయు సమయంలో ప్రశాంతంగా వుండాలి, మధ్య మధ్య మంతనాలు చేయడం, అదేపనిగా మాట్లాడుతూ వుండటం, మధ్య మధ్యన ఫోన్లు చేస వుండటం, ఫోన్లు వచ్చినప్పడు భోజనం చేసూ మాట్లాడుతూ వుండటం సరికాదు.

11. భోజనానికి ముందు దైవ ప్రార్ధన తప్పక చేయాలి.

12. భోజనం చేశాక 10 నిమిషాలపాటు పచార్లు చేసి, కనీసం 5 నుంచి 10 నిమిషాల సేపు వజ్రాసనం వేయాలి.

3. ఉపవాసం

శరీరంలోపలి అవయవాల శుద్ధికి ఉపవాసాలు అవసరం. ఉపవాసాలు ఆధ్యాత్మిక వికాసానికి ఎంతో సహకరిస్తాయి. కొందరు వారానికి సగం రోజు, పూర్తి రోజు ఉపవాసాలు చేస్తుంటారు. కొందరు 21 రోజులు ఉపవాసం చేస్తుంటారు. కొందరు యింకా ఎక్కువ రోజులు కూడా ఉపవాసం చేసూ వుంటారు.

ప్రతి వ్యక్తి వారానికి ఒక్క రోజు ఉపవాసం చేయడం అవసరం. జీర్ణకోశానికి ఆనాడు విశ్రాంతి లభిస్తుందన్నమాట. మిస్ ఎ మీల్ వన్స్ ఏ వీక్ అను ఇంగ్లీషు నానుడి బాగా ప్రచారంలో వుంది. ఉపవాసం తపస్సు వంటిది. ఉపవాస ప్రారంభంలో నిమ్మరసంగాని, పండ్ల రసంగాని, పచ్చితూరలు ఉడుకబెట్టి వార్చిన నీరుగాని, గోరు వెచ్చని నీరుగాని కొద్దిగా తాగాలి. టిఫిన్లు తీసుకోకూడదు. ఉపవాసం చేస్తున్నప్పడు శారీరకంగాను, మానసికంగాను విశ్రాంతి తీసుకుంటూ సాధకుడు ప్రశాంతంగా వుండాలి.

ప్రాచీన కాలాన్నుంచి ఉపవాసాలు అమలులో వున్నాయి. అన్ని మతాల్లోను ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యం లభించింది. ఉపవాసం సరిగా చేసూ, మితంగా ఆహారం తీసుకుంటూ వుంటే మనిషి ఆరోగ్యం సరిగా వుంటుంది. జీవితం హాయిగా సుఖంగా గడుస్తుంది.

4. (తాగే నీరు

భూగోళంలో మూడువంతులు నీరు ఒక వంతు భూమి వున్నట్లు, మన శరీరం కూడా మూడు వంతులు నీటి మయమే. ఈ నీటి పాలు శరీరంలో తగ్గితే హాని కలుగుతుంది.

దాహంవేసినప్పడు నీళ్లు తాగాలి. అయితే రోజూ ఉదయంపూట, దాహం వేసినా వేయకపోయీ పరగడుపున గ్లాసెడు నీళ్లు తప్పక తాగాలి. దీన్ని ఉషాపానం అని అంటారు. ఉషాపానం అలవాటు చేసుకుంటే మలమూత్ర విసర్జన సులభంగా జరుగుతుంది. భోజనానికి కొద్దిసేపు ముందు కొద్దిగా మంచి నీళ్లు తాగితే ఆకలి బాగా పేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మాత్రం తగ్గుతుంది. ఆహారం తీసుకున్న గంటసేపు తరువాత నీళ్లు తాగాలి. అందువల్ల తిన్నఆహారం బాగా జీర్ణం అవుతుంది. భోజనం చేసూ మధ్యలో నీళ్లు తాగకూడదు. తాగిన నీరు జీర్ణం కావాలంటే లాలాజలం అవసరం. రెండు గుటకలు నీళ్లు నోట్లో పోసుకొని రెండు మూడు సెకండ్ల సేపు ఆ నీటిని నోట్లో వుంచి మెల్లమెల్లగా తాగాలి. ఫిల్టరు చేసిన లేక బట్టతో వడపోసిన నీరు తాగితే ఆలోగ్యానికి వుంచిది. కాచి వడపోసిన నీరు కూడా తాగవచ్చు. హోటళ్లలోను, బయట దొరికే నీళ్లు తాగకూడదు. అట్టి నీరు బ్యాక్టీరియాను వ్యాప్తం చేస్తుంది. అందువల్ల తాగే నీటి విషయంలో జాగ్రత్తగా వుండాలి.

5. మల వీసర్ధన

ఒక్క రోజు మల విసర్జన సరిగా జరగక పోతే రుగ్మత ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఉదయం మలవిసర్జన చేయడం అవసరం. అట్టి అలవాటు లేని వాళ్లు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. మల విసర్జన బలవంతాన జరుగకూడదు. సాఫీగా, తేలికగా జరగాలి. అప్పడు మనిషి ఆరోగ్యం సరిగా, మంచిగా వుంటుంది.

ఉదయం మేల్కొనగానే ఉషాపానం చేసి మలవిసర్జనచేయాలి. మలవిసర్జనకు సంబంధించిన యోగాసనాలు పేయవచ్చు. రోజూ రెండు సార్లు భోజనం చేయడం, రెండు సార్లు మలవిసర్జన చేయడం అలవాటు చేసుకోవాలి. మల విసర్జనకు వమన భౌతి క్రియ, వస్తే అనగా ఎనిమా క్రియ చేయవచ్చు. కాని ఆ క్రియల్ని అలవాటు చేసుకోకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ కదా ! అందువల్ల ప్రతి రోజూ సహజంగా, సులభంగా మల విసర్జన జరుపుటకు ప్రతి వ్యక్తి కృషి చేయాలి. మల విసర్జన చేసిన తరువాత మలరంధాన్ని నీటితో శుభ్రం చేసి, చేతుల్ని మట్టితో గాని లేక సబ్బుతో గాని కడుక్కోవాలి. కాళ్లు కడుక్కోవాలి. సాధ్యమైతే స్నానం కూడా చేయాలి.

6. మూత్ర విసర్జన

మల విసర్జన ఎంత అవసరమో, మూత్ర విసర్జన కూడా అంత అవసరమే. మూత్ర విసర్జన అవసరమైనప్పడు తప్పక చేయాలి. ఎక్కడ బడితే అక్కడ మూత్ర విసర్జన చేయకూడదు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు, ప్రొదున్నే లేచినప్పడు, యోగాసనాలు, వ్యాయామం చేసిన తరువాత భోజనం చేశాక మూత్ర విసర్జన చేయాలి. మూత్ర విసర్జన చేసిన తరువాత లింగాన్ని లేక యోనిని చేతుల్ని నీటితో
కడుక్కోవడం అవసరం.

ఎవరి మూత్రం వారు తాగితే రోగాలు రావని, మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారంలో వున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అట్టి మూత్రానికి శివాంబు అని పేరుపెట్టారు.

అతి మూత్రం మంచిది కాదు. మూత్రం ఆగిపోవడం కూడా మంచిది కాదు. కనుక మూత్ర విసర్జన విషయమై ప్రతి వ్యక్తి జాగ్రత్త వహించడం అవసరం. మూత్ర విసర్జన చేస్తున్నప్పడు పైపళ్లను, క్రింది పళ్లను నొక్కి వుంచాలి. అందువల్ల పళ్ల బలిష్టంగా ఉంటాయి. అప్పడు నోటిలో పదార్ధమేమీ ఉండకూడదు.

7. స్నానం

ఆరోగ్యంగా వుండాలంటే ప్రతి వ్యక్తి స్నానం చేయడం అవసరం. శరీరానికి అంటిన మురికిని పోగొట్టడం మరియు మనస్సు యొక్క టెన్షనును తగ్గించడం స్నానం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రతిరోజూ ఉదయాన లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. కొందరు రోజుకి ఒక సారి, కొందరు రెండు సార్లు, పేసవి కాలంలో మూడుసార్లు స్నానం చేసూ వుంటారు. మొత్తం మీద రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు స్నానం చేయడం ఆరోగ్యరీత్యా మంచిది. ఉదయంపూట చేసే స్నానం వల్ల సోమరితనం పోతుంది. సాయంత్రం పూట చేసే స్నానం వల్ల రోజంతా శరీరానికి అంటిన మురికి తొలిగిపోయి, రాతి హాయిగా నిద్రపడుతుంది. నదీ ప్రవాహంలో గాని లేక కాలువ నీటిలో గాని స్నానం చేయాలి. చెరువు నీటి స్నానం, నూతి ನಿಜಿ స్నానం, చేతిపంపుల నీటి స్నానం కూడా మంచిదే. పట్టణాల్లో పంపనీళ్లు స్నానానికి వాడుతూ వుంటారు. చల్లని බීසී స్నానం ఉత్తమం. జబ్బు పడి నప్పడు, చలికాలంలోను గోరువెచ్చని నీరు స్నానానికి వాడవచ్చు.

స్నానం చేస్తున్నప్పడు ఒళ్లంతా బాగా తోముకోవాలి. సున్నిపిండితో ఒళ్లు తోముకోవడం మంచిది. ఇప్పడు రకరకాల సబ్బులు ప్రచారంలోకి వచ్చాయి. చర్మానికి హాని కలిగించని సబ్బులు వాడవచ్చు. మంచి బంకమట్టి దొరికితే తలకు, వంటికి పట్టించి తోముకొని స్నానం చేయడంవల్ల శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వారానికి ఒక సారి తలకు, వంటికి నూనె బాగా రాసుకొని తలంటి ప్రోసుక్రోూ బ్రి.

మొదట పాదాలు ఆ తరువాత శరీరమంతా నీటితో తడిపి స్నానం చేయాలి. అవసరమైనన్ని నీళ్లు స్నానానికి వాడాలి. స్నానం విషయమై కొన్ని విషయాలు గవనించాలి. భోజనం చేసిన తరువాత, ఎండలో నడిచివచ్చినప్పుడు, పరుగెత్తినప్పుడు, యోగాసనాలు వేసినప్పడు వెంటనే స్నానం చేయకూడదు. కొంత సేపు ఆగి ఆ తరువాత స్నానం చేయాలి. స్నానం చేసి పొడిబట్టతో ఒళ్లు తుడుచుకోవాలి. స్నానం నీళ్లు శరీరం మీద నిల్వవుండకూడదు. ముఖ్యంగా గజ్జల్లో నీరువుండకుండా తుడుచుకొని, బట్టలు ధరించాలి. నీళ్లు నిల్వ ఉంటే చర్మరోగాలు పటుకుంటాయి.

స్నానం చేసేటప్పడు, స్నానం చేసిన తరువాత శరీరానికి చలువకమ్మకుండా జాగ్రత్తపడాలి. స్నానం చేసే సమయంలో సామాన్యంగా చలివేయదు. నిండా మునిగిన వానికి చలి ఏమిటి అను సామెత బహుళ ప్రచారంలో వున్నది.

స్నానం చేయగానే రోమరంధాలు విచ్చుకుంటాయి. నరాల్లో, నాడుల్లో రక్త ప్రసారం బాగా జరుగుతుంది. శరీరానికి నూతన శక్తి లభిస్తుంది. ఓజస్సు పెరుగుతుంది, అలసట, బద్ధకం తొలగిపోతాయి.

8. నిద్ర

శరీరంలో ఏర్పడే అస్వస్థతను, అలసటను తొలగించుటకు నిద్ర అమితంగా సహకరిస్తుంది. నిద్ర హాయిగా పట్టిందీ అంటే ఆరోగ్యం సరిగా వున్నట్లే లెక్క. నిద్ర అంటే ఏమిటో యిప్పటి వరకు ఎవ్వరూ నిర్వచించలేదు. అయితే నిద్రపేరు, మగత లేక మైకం పేరు. రెండిటికీ ఎంతో వ్యత్యాసం వుంది. నిద్ర రాకపోతే కొందరు నిద్ర మాత్రలు మింగుతూ వుంటారు. ఇది మంచిది కాదు. నిద్రమాత్రల వల్ల కలిగేది మగత మాత్రమే, నిద్ర మాత్రం కాదు. నిద్ర కోసం మాత్రలు మింగడం ఎవ్వరూ ప్రారంభించకూడదు. అయితే నిద్రమాత్రలకు అలవాటు పడినవారు ఒక్క సారిగా గాక, నెమ్మది నెమ్మదిగా ఆ అలవాటును తగ్గించుకోవాలి. నిద్ర రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకొని, దాన్ని పరిష్కరించుటకు ప్రయత్నించాలి. మల మూత్ర విసర్జన సరిగా జరిగితే నిద్రహాయిగా పడుతుంది. చింతలు, దు:ఖాలు, కషాలు పట్టుకుంటే నిద్ర పట్టదు. వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి.

యోగాభ్యాసంలో జలనేతి క్రియ, శవాసనం, యోగనిద్ర అలవాటుచేసుకుంటే నిద్రహాయిగా పడుతుంది. రాత్రిళ్లు పాదాలు గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు వంచితే కూడా నిదబాగా పడుతుంది.

స్త్రీలు పురుషులు 7 లేక 8 గంటలు నిద్రపోవాలి. వయస్సు మళ్లిన వారు 6 గంటలు నిద్రపోతే చాలు. యోగాభ్యాసం చేసేవారికి 4 లేక 6 గంటల నిద్ర సరిపోతుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 15 లేక 20 నిమిషాల సేపు ఎడమవైపుకు తిరిగి పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. అలా పడుకుంటే లివరు బాగా పని చేస్తుంది. చురుకుదనం పెరుగుతుంది. దాని వల్ల ఆహారం జీర్ణం అవుతుంది. దీన్ని వామకుడి అని అంటారు.

కుడివైపుకు తిరిగి పడుకొని, ఎడమ నాసికారంథాన్నుంచి లోనికి గాలి పీల్చాలి. ఎడమ నాసికా రంథాన్నుంచి గాలి పీల్చడాన్ని చంద్రస్వరం అని అంటారు. ఎడమవైపుకు తిరిగి పడుకుంటే కుడి నాసికా రంధాన్నుంచి లోనికి గాలిపేల్చాలి. Cg * పీల్చడాన్ని సూర్యస్వరం ලැබේ. ශ්‍රටථිඩ් “ර්ය.

మొగపిల్లలు పుట్టాలని g*రg” భార్యాభర్తలు, సంభోగానికి ముందు, భర్త ఎడమవైపుకు, భార్యకుడివైపుకు తిరిగి పడుకోవాలి. ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటే పురుషుడు కుడివైపుకు, శ్రీ ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి.

సామాన్యంగా రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పూట త్వరగా లేచేవాళ్లు ఆరోగ్యంగా వుంటారు.

9. ఆలోచనలు

Always be cheerful and happy. This will help your thoughts to be more positive. Negative thoughts result in negative attitude towards life which may be much harmful. One can not change whatever has already happened. Also one can not predict the future right now. So always try to live in presentense. Enjoy this very moment. This will certainly help a lot to maintain your good health, as healthy body and healthy mind go together.


మంచి అలవాట్ల వల్ల మానవజీవితం సార్థకం అవుతుంది.

युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा॥