శరీరస్థితి ప్రతి ఒక్కటి ఒక ఆసనమని చెప్పవచ్చు.
మనస్సును, శరీరాన్ని తాదాత్మ్యం చేసూ వ్యవస్థితంగా వేసే ఆసనవేు యోగాసనం. ప్రాచీన కాలంలో మన వూర్వులు కొన్ని యోగాసనాలు మాత్రమే వేసూవుండేవారు. మధ్యకాలంలో ఋషులు, యోగులు యోగాసనాల మహత్తును గ్రహించి వాటిని గురించి పరిశోధనలు చేసూ లక్షలాది యోగాసనాలను ఆవిష్కరించారు. వాటిలో ఎన్నో ఆసనాలు యీ నాటికీ సాధకులు పేస్తున్నారు. ఇప్పడు పేరు పేరు చోట్ల యోగ నిపుణులు, యోగ బోధకులు వేరు పేరు క్రమాల్లో వీటిని అమలు చేస్తున్నారు.
గాంధీ జాన మందిర యోగ కేంద్రంలో గత 25 సంవత్సరాల అనుభవంతో యోగసనాల ఉపయోగకరమైన ఒక సరళ క్రమం నిర్ణయించాం. యీ క్రమాన్ని సర్వులూ ఆచరించి ప్రయోజనం పొందవచ్చు.
యోగాసనాలు వేసే సమయంలో శరీర స్థితి నాలుగు విధాలుగా వుంటుంది. వాటిని బట్టి యోగాసనాలను వెల్లకిల పడుకొని వేయు ఆసనాలు, బోర్ల పడుకొని వేయు ఆసనాలు, కూర్చొని వేయు ఆసనాలు, నిలబడి వేయు ఆసనాలు అని 4 విధాలుగా నిర్ణయించాము. పాఠకుల ఉపయోగార్థం వాటిని ముందలి నాలుగు ప్రకరణాల్లో సవివరంగా ప్రచురిస్తున్నాము.
సూచనలు
యోగాసనాలకు సంబంధించిన విధానాలు, వాటి లాభాలు లేక వాటివల్ల కలిగే ప్రయోజనాలు, ప్రత్యేక విశేషాలు, సూచనలతో బాటు ప్రతి ఆసనం చివర ఆ ఆసనం వల్ల చేకూరే ముఖ్య ప్రయోజనాన్ని ప్రత్యేకించి పేర్కొన్నాం. ఇందువల్ల పాఠకులు విషయాన్ని సులభంగా గ్రహిస్తారని విశ్వసిస్తున్నాం.