30. గాంధీ జ్ఞాన మందిర్

హైదరాబాదు నగరం సుల్తాన్ బజారు(కోరీ) లో జంటనగరాలకు చెందిన పలువురు సాంఘిక కార్యకర్తలు, నాయకులు కలిసి తిలక్ పార్కు నందు కొంత భూమిని హైదరాబాద్ పురపాలక సంఘం దగ్గర పొంది, అందు 1969 డిసెంబరు 27వ తేదీన సరిహద్దు గాంధీ భారత రత్న ఖాన్ అబుల్ గఫార్ఖాన్ గారి చేత గాంధీ జ్ఞాన మందిర్ భవనానికి శంఖుస్తాపన చేయించారు. కీ.శే. టోకర్సీలాల్జీ కాపడియా యీ భవన నిర్మాణానికి నడం కట్టి క్రీ.శే. పి.ఎల్. భండారీ, కీ.శే. రామకృష్ణ ధూత్, కీ.శే. సత్యనారాయణ గుప్త, కీ.శే. బిరధీచంద్ చౌధరి, కీ.శే. ఉత్తమ్చంద్, శ్రీ కమల్ నారాయణ అగ్రవాల్ మొదలగు పెద్దలతో బాటు ఇంటింటికీ తిరిగి యీ భవన నిర్మాణం కోసం ధనం పోగు చేశారు. జంట నగరాలకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారస్తులు, దాతలు విరాళాలు యిచ్చారు. గాంధీ జట్టాన మందిర్ లో గల విశాలమైన హాలు నిర్మాణానికి శ్రీ బాలాజీ శివనారాయణ అండ్ కంపెనీ ద్వారా పెద్ద మొత్తం విరాళంగా లభించింది. భవన నిర్మాణం పూర్తి కాగానే 1974 అక్టోబరు 2వ తేదీన కేంద్రీయ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు కీ.శే. శ్రీమన్నారాయణ్గారు యీ భవన ప్రారంభోత్సవం చేశారు.

గాంధీ লুণ্ঠ మందిర్ కార్యక్రమాల నిర్వహణకు ఒక సహయోగీ సంఘం ఏర్పాటు చేయబడింది. యీ సమితి అధ్యక్షులుగా శ్రీ సత్యనారాయణ్ గుప్త, గౌరవ కార్యదర్శిగా శ్రీ సురేంద్రలూణియా నియమించ బడ్డారు. గాంధీ జ్ఞాన్ మందిర్లో జరిగే కార్యక్రమాలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించబడి జరుగుతాయి.

గాంధీ జ్ఞాన మందిర్లో గాంధీజీ చిత్రాల ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. సమాజంలో తరిగిపోతున్న నైతిక విలువల్ని పెంచడం, జాతీయ సంస్కృతీ సంరక్షణ గాంధీ జ్ఞాన మందిర్ లక్ష్యాలు. మహాత్మాగాంధీ, వినోబాభావేలకు సంబంధించిన ఫిల్ములు ప్రదర్శించబడుతూ ఉంటాయి. గాంధీ జ్ఞాన మందిర్లో గాంధీ పుస్తకకేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. గాంధీ సిద్ధాంతాలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై పలు సభలు, ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి.

ఈ సంస్థ అధ్వర్యాన నుమాయిష్ మైదానంలో గాంధీ దర్శన్ పేరట పేరట రెండతస్తుల భవన నిర్మాణం చేయబడింది. ప్రారంభంలో శ్రీ టోకర్సీలాల్జీ కాపడియా యీ గాంధీ దర్శన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీ బిరధీచంద్ చౌధరి బాధ్యత వహించి కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం శ్రీ సీ.వి. చారి బాధ్యత వహిస్తున్నారు.

గాంధీ స్మారక నిధి కార్యాలయాన్ని కీ.శే. కోదాటి నారాయణరావు ఈ గాంధీ జ్ఞాన మందిర్ భవనంలో నిర్వహించేవారు. ప్రస్తుతం శ్రీ కోదాటి రంగారావు బాధ్యత వహిస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తక ప్రచురణ యీ సంస్థ లక్ష్యాలలో ఒకటి. ప్రకృతి చికిత్సా కేంద్రంతో బాటు యోగ కేంద్రం కూడా స్థాపించపడి పని చేస్తున్నది. లక్షలాది మంది స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు యీ యోగ కేంద్రం ద్వారా ఆరోగ్యవంతులైనారు. అవుతున్నారు. అనేక చోట్ల ఉపకేంద్రాలు కూడా స్థాపించబడి పని చేస్తున్నాయి. శ్రీ టోకర్స్ లాల్జీ కాపడియా యీ యోగ కేంద్రాభివృద్ధికి ఎంతో సహకించారు. ఇప్పుడు గాంధీ జ్ఞాన మందిర్ యోగ కేంద్రానికి అధ్యక్షులు – శ్రీకమల్ నారాయణ్ అగ్రవాల్ గౌరవ కార్యదర్శి – శ్రీ సురేంద్రలూణియా డైరెక్టరు – డాప్రవీణ్కాపడియా నియమింపబడి పని చేస్తున్నారు.

గాంధీజీ మరియు సర్వోదయ గ్రంధాల ప్రచురణకు సర్వోదయ విచార్ ప్రచార్ ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది. యియో ట్రస్ట్ ఆధ్వర్యాన నవజీవన ట్రస్తు, అహమదాబాదు వారు మహాత్మాగాంధీగారి ఆత్మకథను తెలుగులో ప్రచిరించారు. కీ.శే. వేమూరి రాధాకృష్ణ మూర్తి యీ గ్రంధానువాదం చేశారు. తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాదు పక్షాన ఆత్మకథ తెలుగు అనువాదాన్ని ఉత్తమ అనువాదంగా నిర్ణయించి శ్రీ రాధాకృష్ణ మూర్తి గారిని 1996 లో అయిదువేల రూI పారితోషికం యిచ్చి సన్మానించారు. ప్రత్యేకించి ఎట్టి ప్రచారం లేకుండానే యిప్పటికి ఆత్మకథ ఒక లక్ష ప్రతుల అమ్మకం జరిగింది.

గాంధీ జ్ఞాన మందిర్ మహాత్మాగాంధీ, వినోబాభావేగార్ల సిద్ధాంతాల ప్రచార ప్రసారాలకు, నైతిక విలువల వ్యాప్తికి, యోగాభ్యాసానికి సాధనాస్థలి. సర్వోదయ విచార్ ప్రచార్ ట్రస్తు ఆదర్శాలకు మంచి కేంద్రం, ప్రతి రోజు 500 మందికి పైగా సాధకులు యిక్కడ యోగాభ్యాసం చేసి ఆరోగ్యవంతులు అవుతున్నారు. భారతీయ ప్రాచీన సంస్కృతి, సత్యము, అహింస, మానవ ప్రేమ వీటికి సంబంధించిన దివ్య సందేశాలను ఆకళింపు చేసుకుంటున్నారు. గాంధీ స్మారక భవనంగాను, సేనా సంస్థగాను రూపొంది యీ గాంధీ జ్ఞాన మందిరం మానవాళికి ఎనలేని సేవ చేస్తున్నది.

ఇప్పటి సర్వోదయ విచర ప్రచార్ ట్రస్ట్ నిర్వాహక మండలి

అధ్యక్షులు:
శ్రీ కమల్ నారాయణ్ అగ్రవాల్

మేనేజింగ్ ట్రస్టీ:
శ్రీ సురేంద్రీలూణియా

సభ్యులు:
శ్రీ పూరణమల్ అగ్రవాల్,
శ్రీ గుల్లారీలాల్ కేడియా
శ్రీ కీర్తి కుమార్టోకర్సీ కాపడియా
శ్రీ సుశీల్ ధీరజ్లాల్ కాపడియా