3. శరీర నిర్మాణ విశేషాలు

సృష్టిలో మానవజన్మ శ్రేష్టమైనదని సర్వుల అభిప్రాయం. మనిషి భౌతిక స్వరూపం శరీరం. అట్టి శరీర నిర్మాణానికి, శరీరమనుగడకు, మట్టి, జలము, అగ్ని వాయువు, ఆకాశము అను పంచభూతాలు సహకరిస్తున్నాయి. మనిషి గతించిన తరువాత అతని శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. అయితే జీవించి యున్నంతవరకు నేను, నాది అను భావం మనిషిని వదలదు. కనుకనే మనిషి తన శరీర పోషణకు, రక్షణకు కృషి చేసూ వుంటాడు. అట్టి కృషి ఫలితంగానే వైద్యశాస్త్రం, పలు చికిత్సా విధానాలు, యోగవిద్య వెలుగులోకి వచ్చాయి. శరీరం యొక్క బయటి అవయవాలతో బాటు శరీరంలోపలి అవయవాల శుద్ధికి యోగవిద్య అమితంగా సహకరిస్తుంది.

1. శరీర వీభాగాలు

మానవ శరీర నిర్మాణం అమోఘం, అద్భుతం, శరీర మందలి అవయవాల నన్నిటిని 12 విభాగాలుగా విభజించవచ్చు. యీ విభాగాల సమన్విత స్వరూపమే ඊෆිර්ට.
1) జానేంద్రియాలు
2) కర్మేంద్రియాలు
3) మస్తిష్కం, నాడీ మండలం
4) గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసారం
5) శ్వాసప్రశ్వాసల విభాగం
6) మాంసకండరాల విభాగం
7) జీర్ణకోశం మరియు శరీర పోషక విభాగం
8) ఎముకల విభాగం
9) ప్రధాన గ్రంథులు
10) మూత్రపిండాలు
11) జననేంద్రియాలు
12) మల విసర్జన విభాగం

శరీరమందలి యీ విభాగాలన్నింటి మీద యోగభ్యాసం యొక్క ప్రభావం పడుతుంది. మందులు ఏవీ వాడకుండా, ప్రకృతి నియమాల్ని పాటించుతూ, ఆరోగ్యంగా వుండుటకు యోగవిద్య సహకరిస్తుంది.

మనిషి శరీరానికి సంబంధించిన రెండు రకాల క్రియలు జరుగుతూ వుంటాయి.
1) మనిషి యిష్ట ప్రకారం జరిగే క్రియలు
2) మనిషికి తెలియకుండా సహజంగా జరిగే క్రియలు.
నడవడం, కూర్చోవడం, లేవడం, పడుకోవడం, మాట్లాడటం మొదలుగా గల క్రియలు మనిషి యిష్ట ప్రకారం జరుగుతాయి. గుండె కొటుకోవడం, పేగుల కదలిక, శ్వాస ప్రశ్వాస, కనురెప్పల కదలిక మొదలుగా గల క్రియలు ప్రయత్నం లేకుండా సహజంగా జరుగుతాయి.

శరీర అవయవాలన్నిటి మీద మనస్సు, మనస్సు మీద မဲမဲမဲမွီး ဓါဃမ္မိ మీద అహం అధికారం చలాయిసూ వుంటాయి. వీటన్నింటిని ఆత్మ శాసిస్తుంది.

శరీర అవయవాలను దాని విభాగాలను గురించి క్లుప్తంగా తెలుసుకోవడం అవసరం.

1. జ్ఞానేందియాలు

చెవి, చర్మం, కన్ను నాలుక, ముక్కు యీ అయిదు జనేంద్రియాలు. ఈ జానేంద్రియాలు మట్టి, జలము, అగ్ని వాయువు, ఆకాశము అను పంచభూతాల పనులు చేస ఉంటాయి. మట్టి యొక్క గుణం గంధం, ముక్కుతో మనం గంధాన్ని అనగా వాసనను గ్రహిస్తాము, జలం యొక్క గుణం రసం. నాలుకతో మనం రసాన్ని ఆస్వాదిస్తాము, అగ్ని యొక్క గుణం వెలుగు, కంటితో మనం వెలుగును చూస్తాము. వాయువు యొక్క గుణం స్పర్శ, చర్మం ద్వారా మనం స్పర్శజ్బనం పొందుతాము. ఆకాశం యొక్క గుణం శబ్దం, శబాన్ని మనం చెవుల ద్వారా వింటాము.

2. కర్మేందియాలు

మనిషికి పంచ కర్మేంద్రియాలు వున్నాయి. 1) నోరు ని) చెయ్యి తి) పాదం 4) లింగం లేక యోని 5) మలరంధ్రం. యీ అయిదు కర్మేంద్రియాల ప్రాముఖ్యం ఏమిటో, అవి నిర్వర్తించే విధులేమిటో మనందరికీ తెలుసు.

3. మస్తిష్కం, నాడీ మండలం

మస్తిష్కం లేక మెదడు శిరస్సు నందు వుంటుంది. దీన్ని ఆవరించివుండే అనేక నాడులు, విద్యుత్ తీగల వలె శరీరమందంతట వ్యాప్తమై, శరీరాన్ని నడుపుతూ వుంటాయి. మెదడు ఆఖరోట్ పండు రూపంలో బహు సున్చితంగా వుంటుంది. ఇడ, పింగళ, సుప్తువ్ను నాడులతో బాటు అనేక స్కూల, సూక్క నాడులు వెన్నెముక చివరి భాగాన్నుంచి ప్రారంభ వెు వెదడు వరకు వ్యాపించి వుంటాయి. శరీరాన్ని నడిపించే వెదడు ఎంత శక్తివంతంగా, చురుగా వుంటుందో శరీరం కూడా అంత శక్తివంతంగా వుండి చురుగా పని చేస్తుంది. ఆరోగ్యవంతమైన వుస్తిష్క నిర్మాణానికి, దాని మనుగడకు యోగాసనాలు, ప్రాణాయామము, యోగక్రియలు అమితంగా సహకరిస్తాయి.

4. గుండె, ఊపిరితితులు, రక్తప్రసారం

మనిషి గుండె బిగించిన పిడికిలి అంత వుంటుంది. అది ఛాతీకి ఎడమ వైపున, స్తనం కింద వుంటుంది. పరుగెత్తినప్పడు, వెంటు ఎక్కినప్పడు, భయం వేసినప్పడు, గుండె దడదడ కొటుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అనేక 暹:蠢 「炎 :廬袞王 ధమనులు, సిరలు యిందు అమరి వుంటాయి. వాటి ద్వారా రక్తం శరీరమందంతట ప్రసారం అవుతూ వుంటుంది. కొన్నినాడులు అపరిశుద్ధ రత్తాన్నిలోనికి లాక్కొని, పరిశుద్ధ రత్తాన్ని బయటికి పంపుతూ వుంటాయి. గుండెలో రెండు ఊపిరితిత్తులు సంచుల్లా అమర్చ బడివుంటాయి. అవి ఎప్పడూ కదులుతూ కొటుకుంటూ వుంటాయి. అవి రత్తాన్ని శుభ్రంచేసే ప్రసారం చేసూ వుంటాయి.

ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి 70 లేక 75 సార్లు కొట్టుకుంటుంది. రోజూ అది 24 గంటలు పని చేయడమే గాక, ప్రాణి బ్రతికి వున్నంత కాలం పని చేసునే వుంటుంది. రక్తప్రసారం సరిగా జరగకపోయీ, గుండెలో అనవసర పదార్థం పెరిగినా ప్రమాదకరమైన జబ్బులు వసూ వుంటాయి. ప్రాణాయామం మొదలగు అందుకు సంబంధించిన యోగ క్రియలు సక్రమంగా చేసూ వుంటే గుండె నొప్పి, తదితర గుండె జబ్బులు రావు,

5. శ్వాస ప్రశ్వాసల వీభాగం

మనం ముక్కు రంధాల ద్వారా గాలిని పీలుస్తాం. ఆ గాలి శ్వాస నాళం ద్వారా ఊపిరితితుల్లోకి ప్రవేశిస్తుంది. ఆరోగ్యవంతుడు බීසීඩයඛ්‍ය ශබ්ථි 15 ජීජ 16 సారు శ్వాస పీలుస్తాడు. కాయకష్టం, వ్యాయామం, పరుగెత్తడం చేసినప్పడు, జబ్బు పడి నప్పడు Ο Ο. ” సంఖ్య పెరుగుతుంది. శరీరంలో గల అనవసర పదారాన్ని లోపలి అవయవాలు ప్రశ్వాస, చెమట, మలమూత్రాదుల రూపంలో బయటికి విసర్జిసూ వుంటాయి. ప్రాణవాయువు శ్వాసరూపంలో లోనికి వెళుతుంది. అవశిష్ణవాయువు ప్రశ్వాస రూపంలో బయటికి వచ్చి వేస్తుంది.

యోగశాస్త్రంలో, గాలిని లోనికి పీల్చడాన్ని పూరకం అని, పీల్చిన గాలిని లోపల నిలిపి వుంచడాన్ని కుంభకం అని, ఆ గాలిని బయటికి వదిలివేయడాన్ని రేచకం అని అంటారు. పూరకం, కుంభకం, రేచకం యీ మూడు క్రియలు యోగశాస్త్రంలో మహత్తరమైనవి.

6. మాంస కండరాల వీభాగం

శరీరంలో మాంసకండరాలు చలనం కలిగిస్తాయి. యివి ఎముకలను ఆవరించి, వాటిచే కప్పబడి వుంటాయి. మాంస కండరాల్లో కణాలు ఎన్నోవుంటాయి. వస్తాదుల కండరాలు లావుగా, బలంగా వుంటాంు, కాని యోగాసనాలు వేసే వారి కండరాలు చురుగా, సుదృఢంగా వుంటాయి. అస్థిపంజరాన్ని ఆవరించి వుండే మాంసాన్ని నరాల్ని మాంసకండరాలు అని అంటారు. కదలడం, తిరగడం, వూటెల్లాడటం వెుదలుగా గల పనులన్నీ మ`ంసకండరాల ద్వారా జరుగుతూ వుంటాయి. గుండె నుంచి రక్త ప్రసారం శరీరమందంతట జరగడం, శరీర మందలి అవయవాలన్నింటికి ఆహారం అందజేయడం, శ్వాస ప్రశ్వాసల ప్రక్రియలు మొదలగు పనుల స (కవు నిర్వహణకు వJ” oసు కండరాలు సహకరిసూ వుంటాయి. మెదడు సూచించిన (పకారం ఇచ్చాకండ రాలు సహకరిసూ వుంటాంు. మెదడు సూచించిన (పకారం ఇచ్చాకండరాల చలనం జరుగుతుంది. అనిచ్చాకండరాలు సపూజంగా తవు పనులు నిర్వహిసూ వుంటాయి. రక్తప్రసారం, జీర్ణక్రియ, గుండె ప్రక్రియ మొదలగునవి నిరంతరం సాగుతూ వుంటాయి. శరీర మందలి వివిధ చోట్ల, వివిధ ఆకారంలో వూంస కండరాలు వుంటాంు. మాంసంలో రక్తవాహినీ నాడులు వల మాదిరిగా అలుముకొని వుంటాంు. వనాంసకృతులు ముడుచుకుంటూ, విస్తరిసూ, మళ్లీ యథాస్థితికి వసూ వుంటాయి. వీటి మీద (కొవ్వు అవసరానికి మించి పెరిగితే గుండె జబ్బులు, రకరకాల రుగ్మతలు వస్తాయి. సామాన్యంగా ప్రసూతి అయిన తరువాత స్త్రీల శరీరంలో కొవ్వు ఎక్కువై వారి పిరుదులు, నడుము లావెక్కుతూ వుంటాయి. యోగాసనాల ద్వారా యిట్టి వికారాలు తొలగించు కోవచ్చు.

7. జీర్ణకోశం మరియు శరీర పోషక విభాగం

మనం భుజించే ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసి, తద్వారా ఆహారమందలి పోషక పదార్యాల్ని రక్త వుండలానికి అందజేయడం జీర్ణమండలం యొక్క ముఖ్య కర్తవ్యం. ఆహారనాళం, ఆవూ శంనుం, లివరు, స్పీను, చిన్నపేవు, పెద్దపేవు వెుదలగునవి జీర్ణ వుండలానికి సంబంధించిన అవయవాలు.

ఉదరమునందలి జీర్ణకోశం ఎన్నో రోగాలకు మూలం. మనిషి జీవించి యున్నంత వరకు జీర్ణకోశం స్వస్థతగా వుండి సక్రమంగా పనిచేస్తే ఆరోగ్యం కోసం ఎవ్వరినీ ఆశ్రయించవలసిన అవసరం ఉండదు.

ఆహారనాత్రం

ఇది సామాన్యంగా 25 సెంటీ మీటర్ల పొడవు వుంటుంది. కంఠం దగ్గర ప్రారంభమై అన్నాశయం వరకు వ్యాపించి వుంటుంది. దీని లోపలి ఆవరణలో కొన్ని గ్రంధులు వుంటాయి. ఆహార నాళం దొడవుగాను, గుండంగాను వుంటుంది. మాంసకండరాలతో నిర్మించబడుతుంది. యిందు ఎముకలు వుండవు. మనం తీసుకునే ఆహారం లాలాజలంతో కలిసి గుజగా మారి ఆహారనాళం గుండా ఆమాశయంలోకి వెళుతుంది.

ఆమాశయం (అన్నాశయం)

ఆహారనాళం చివరిభాగం ఆమాశయం. అమాశయం గోడలు దళసరిగాను పెద్దవిగాను వుంటాయి. అందు జఠరరస ఉత్పాదనకు సహకరించే గ్రంధులు వుంటాయి. వీటి ద్వారా పోషక పదార్థం జీర్ణ మండలంలో తయారవుతుంది. అది శరీర అవయవాలన్నిటికీ అవసరమైన పరిమాణంలో అందజేయబడుతుంది.

లివరు

శరీరమందలి గ్రంధులన్నింటిలోను లివరు పెద్దది. ఎరుపు రంగులో వుంటుంది. శరీరంలో కుడివైపున, ప్రక్క ఎముకల వెనుక స్థిరంగా సురక్షితంగా వుంటుంది. ఒక కిలో లేక కిలోన్నర వరకు బరువు వుంటుంది. యిందు జీర్ణ రసం లేక పిత్తరసం ఉత్పత్తి అవుతుంది. యీ పిత్తరససహాయంతో లివరు రక్తంలో వుండే అశుద్ధిని యూరియూ రూపంలోకి మార్చి దాన్ని మూత్రపిండాల్లోకి పంపుతుంది. రక్తం నుంచి వడబోసిన యు” రియు “ను వునా త్ర పిండాలు మూత్రాశయంలోకి పంపుతాయి. లివరు చేసే యీ పని మహత్తరమైనది. పేవుల నుంచి వచ్చే విషపూరిత పదార్ధం లివరు నందు నష్టమై తగ్గిపోతుంది. మిగిలిన శ్వేతరసం లేక సారం శరీర మందు శక్తిని నింపుతుంది. మద్యం తాగేవారి లివరు త్వరగా పాడైపోతుంది. వారు పలురకాల వ్యాధులకు గురి అవుతారు.

స్పీన్

ఇది 12 సెంటీమీటర్ల పొడవుగల గ్రంధి. ఆమాశయానికి, దంతాలకు యిది రక్తప్రసారం చేస్తుంది. ఎర్రని రత్తానికి జన్మనిస్తుంది. యిది క్రోమ్ గ్రంథిపై భాగం అంచు మీద ఒక సంచి రూపంలో నిర్మితమై వుంది. ఏ కారణం చేతనైనా ఆపరేషను చేసి స్త్రీనును తీసివేసినా మనిషి బ్రతుకుతాడు.

చిన్నప్రేవు

చిన్నపేవు పొడవు మనిషి ఎత్తుకంటే అయిదు రెట్లు అధికంగా వుంటుంది. ఆవూశయం క్రింది భాగంలో ప్రారంభమై, వంకరటింకరగా ఉదరంలోకి వెళ్లి పెద్దపేవులో కలిసిపోతుంది. చిన్నపేవుపైభాగం సున్నితంగా వుంటుంది. యిందలి కోళికలు, జీర్ణమైన ఆహారాన్ని శోషితం చేసి రక్తంలోకి పంపుతాయి.

పెద్దప్రేవు

పెద్దపేవు పొడవు మనిషి ఎత్తు అంత వుంటుంది. యిది కుడివైపున క్రిందగా ప్రారంభమై, కొద్ది దూరం పైకి వెళ్లి, ఎడమవైపు నుంచి క్రిందికి వచ్చి ఆమాశయం క్రింద మలద్వారాన్ని కలుస్తుంది. ఆహారంలో మిగిలిపోయిన అనవసర పదార్ధం మలరూపంలో పెద్దపేవు ద్వారా విసర్జించబడుతుంది. పెద్దపేవులో మలం నిల్వవుంటే మలబద్ధకం ఏర్పడుతుంది.

జీర్ణమండల రకణకు, స్వస్థతకు అనేక యోగాసనాలు, యోగశుద్ధి క్రియలు నిర్మారించ బడివున్నాయి. వాటిని సక్రమంగా ఆచరణలో పెడితే జీర్ణకోశానికి సంబంధించిన జబ్బులురొవు.

8. ఎముకల వేభాగం

మనిషి శరీరం అస్థిపంజరం లేక కంకాళం మీద ఆధారపడి వుంటుంది. ఈ కంకాళం దృఢమైన ఎముకలచే నిర్మించబడుతుంది. అస్థిపంజరంలో మొత్తం 206 ఎముకలు వున్నాయి. శిరస్సు నందు 22, మొండెము నందు 52, కాళ్లు చేతుల యందు 126. రెండు చెవుల యందు 6, మొత్తం 206 ఎముకలు వున్నాయి. మెడక్రింద, వీపు మధ్యవెన్నెముక వున్నది. యిందు సన్ననికికి ఎముకలు వున్నాయి. శరీర దృఢత్వానికి వెన్నెముక కీలకమైన అవయవం.

అస్థిపంజరంలో మూడు భాగాలు వున్నాయి.
1. శిరస్సు,
డి. మొండెము,
తీ. కాళ్లు చేతులు.

మొండెము నందలి52 ఎముకల్లో 24 ఎముకలు మనిషి ఛాతీయందు గూడుగా ఏర్పడి వున్నాయి. యిందు సున్నితమైన ఊపిరితిత్తులు, రక్తనాడులు అమరివున్నాయి. యోగశాస్త్రంలో అధికభాగం ఆసనాలు వెన్నెముక దృఢత్వానికి సంబంధించినవే.

9. ప్రధాన గ్రంధులు

మనిషి శరీరంలో చిన్నవి పెద్దవి మొత్తం 108 గ్రంధులు వున్నాయి. వాటిలో కొన్ని ముఖ్య గ్రంధుల్ని గురించి యిక్కడ క్లుప్తంగా తెలియ జేస్తున్నాం.

పీనీయల్ గ్రంధి

ఇది మెదడుకు సంబంధించిన గ్రంధి. యిది సరిగా పనిచేస్తే మేధాశక్తి సరిగా, సక్రమంగా వుంటుంది. శరీరంలో శక్తి, సామర్థ్యం, చురుకుతనం నిండి వుంటాయి.

పిచ్యుటరీ (గంధి

ఇది తలక్రింద, మెడ ద్వారా క్రిందికి దిగి నాభి మండలంతో సంబంధం కలిగి వుంటుంది. యిది ఎముకల్ని కండరాల్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల స్త్రీల అండాశయం, పురుషుల శుక్రకోశం సరిగా పని చేసూ వుంటాయి. ప్రసవించిన తరువాత స్త్రీల స్తన్యంలో దీనివల్ల పాలు నిండి బిడ్డలకు ఉపయోగపడతాయి.

థైరాయిడ్ (గంధి

ఇది గొంతులో వుంటుంది. రసాయనిక ద్రవ్యాల్ని సమంగా వుంచడం, జీర్ణం చేసే క్రియల్ని వృద్ధి చేయడం, జఠరాగ్నిని, పుంసకత్వాన్ని పెంచడం, జననేంద్రియాల అభివృద్ధికి సహకరించడం దీని పని. యీ గ్రంథి సరిగా పనిచేయకపోతే శరీరం లావెక్కుతుంది. సూలకాయం శ్రీ పురుషుల్ని నానా అవస్థలపాలు చేస్తుంది.

క్లోమ్ గ్రంధి

ఇది పొట్ట మధ్య ఆమాశయం దగ్గర వుంటుంది. యిందు జీర్ణం చేసే ద్రవం ఊరుతుంది. దీనివల్ల జఠరాగ్నిపెరిగి, ప్రాణశక్తి హెచ్చుతుంది.

ఎడినల్ గ్రంధి

ఇది నాభి దగ్గర వుంటుంది. రక్త ప్రసారం సరిగా జరిగేలా చూస్తుంది. జీర్ణం చేసే ద్రవ్యాల్ని వృద్ధి చేయడం దీని పని.

పెంక్రియాస్ (గంధి

ఇది హిట్టయందు ఎడమవైపున వుంటుంది. యిందు ఉత్పత్తి అయ్యే రసాన్ని ఇన్సులిన్ అని అంటారు. యీ ఇన్సులిన్ చక్కెరను జీర్ణం చేస్తుంది. యిది సరిగా పనిచేయకపోతే, చక్కెర రక్తంలోకి, మూత్రంలోకి ప్రవేశించి షుగర్ వ్యాధికి నాంది పలుకుతుంది. పెంక్రియాస్ గ్రంధి సరిగా పని చేసినంత కాలం మధుమేహం దరిదాపులకు రాదు.

శుక్ర గ్రంధి

శ్రీ పురుషులిరువురికీ శుక్ర గ్రంధి వుంటుంది. యిది జననేంద్రియానికి సంబంధించినది. పురుషులకు లింగం క్రింద వృషణాల్లో వుంటుంది. వీర్యోత్పత్తితో బాటు, పురుష జననేంద్రియ వికాసానికి తోడ్పడుతుంది. స్త్రీల జననేంద్రియం లోపలి భాగంలో యిది ఉంటుంది. స్త్రీల కంఠస్వరంలో కోమలత్వం తెస్తుంది. శ్రీపురుషుల శరీరంలో ఓజస్సు తేజస్సు నింపుతుంది.

పైన తెలిపిన గ్రంధులన్నింటిని సరిగా వుంచి పనిచేయించేందుకు అవసరమైన యోగాసనాలు నిర్మారించబడ్డాయి.

10. మూత పిండాలు ( కిడ్నీలు)

మనిషి శరీరంలో నిల్వ వుండే వ్యర్థమైన అశుద్ధ పదారాల్ని మూత్ర పిండాలు ఎప్పటికప్పుడు బహిష్కరిస వుంటాయి. అందుకు చర్మం, మూత్ర పిండాలు, మలరంధ్రం, మూత్ర రంధం సహకరిస్తాయి. చర్మం ద్వారా చెమట బయటికి విసర్జించబడుతుంది. మూత్రపిండం మూత్రాన్ని వడబోసి, పనికి రాని ద్రవపదారాన్ని మూత్రం ద్వారా విసర్టిస్తుంది. జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదారాన్ని పెద్ద పేవు మలరూపంలో మలరంధ్రం ద్వారా విసర్టిస్తుంది. మూత్రపిండాల అమ్మకం యిప్పడు పెరిగిపోయింది. మూత్రపిండాలు చెడిపోతే, వాటిని తొలగించి వాటి స్థానంలో వుంచి మూత్రపిండాల్ని అమర్చే ప్రక్రియు విజయవంతంగా సాగుతున్నది. ప్రాణరక్షణకు యీ ప్రక్రియ ఎంతో సహకరిస్తున్నది. మూత్రపిండాల స్వస్థతకు యోగాభ్యాసం అమితంగా సహకరిస్తుంది.

వెన్నెముకకు ఎడమవైపున, కుడివైపున, ప్రక్కన వుండే ఎముకలకు ముందు రెండు మూత్రపిండాలు అమరివుంటాయి. వీటికి చుటూ (కొవ్వు వుంటుంది. మూత్ర పిండాలపై నిర్మితమై వుండే సంచి వంటి అవయవంలో హార్మోన్ అను ద్రవం ఉత్పత్తి అవుతుంది. మూత్ర పిండాల నుంచి ఒక వాహిక బయలుదేరి మూత్రాశయంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా మూత్రం వెడలి వునా త్రాశయంలోకి చేరుతుంది. మూత్రాశయం నిండగానే మూత్ర విసర్జన అవసరమవుతుంది.

మూత్ర పిండాలు రక్త శుద్ధికి సహకరిస్తాయి. ధమనుల ద్వారా మూత్ర పిండాల్లోకి చేరే రక్తంలో యూరియా, యూరిక్ యాసిడ్ మున్నగు పదారాలు వుంటాయి. అవి మూత్రరూపంలో బయటకు వెళ్లిపోతాయి. అలా వెళ్లిపోకుండా, వూలిన్య పదార్థం నిల్వవుండి పోయి, కొందరి మూత్రపిండాల్లో రాళ్లుగా తయారవుతుంది. వాటిని వెంటనే తొలగించడం అవసరం. మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు యిప్పడు ఎక్కువగా వస్తున్నాయి. యోగాసనాల ద్వారా యీ వ్యాధుల్ని రాకుండా చేయవచ్చు.

11. జననేంద్రియాలు

మానవసృష్టి నిర్మాణానికి మూలం శ్రీ పురుషుల జననేంద్రియాలే. యివి బహుసున్నితంగా వుంటాయి. వీటికి దెబ్బ తగిలితే ప్రాణం పోయినంత పని అవుతుంది. పురుష జననేంద్రియం లింగ రూపంలో వుంటుంది. శ్రీ జననేంద్రియం యోని రూపంలో వుంటుంది. అయితే శ్రీ జననేంద్రియంలో గర్భాశయం వుంటుంది. అది వారికి మాతృత్వాన్ని ప్రసాదిస్తుంది. పురుషుని వీర్యకణాలు, శ్రీ రజకణాలతో పిండోత్పత్తికి అవసరమైన అంశాలు వుండి కలిసినప్పడు శ్రీ గర్భం ధరించి బిడ్డను ప్రసవిస్తుంది. కనుక మానవసృష్టికి మూలం శ్రీపురుషుల రజవీర్యకణాల కలయికయే అని చెప్పవచ్చు, యిది కూడా యోగమే.

పురుష జననేంద్రియాన్ని రెండు భాగాలుగా విభజించ వచ్చు.
1) పురుషాంగం
2) వృషణాలు.

పురుషాంగం కండరాలతో నిర్మితమై వుంటుంది. యీ కండరాలకు సాగే గుణం వుంటుంది. మూత్రాంగంలో వుండే మూత్రనాళం, మూత్రాన్ని వీర్యాన్ని బయటికి పంపుటకు సహకరిస్తుంది. మూత్రాశయం, మూత్రనాళం, పురుషాంగం, వృషణాలు, గుదం, బీజకోశం, క్యుపర్స్ గ్రంథులు, ప్రాస్టేట్ గ్రంథి, వీర్యకోశం, వీర్యనాళం, పురీషనాళం, పురుష జననేంద్రియానికి సంబంధించిన ముఖ్య భాగాలు. ඩීඩීඑ”* ఎక్కువ అవయవాలు బయటనే అమరివున్నాయి. శ్రీ జననేంద్రియానికి సంబంధించిన అధిక భాగం అవయవాలు పొత్తి కడుపు మధ్యభాగంలో వుంటాయి. శ్రీ బాహ్య జననేంద్రియాల్లో యోని, బాహ్య అధరాలు, యోనిశీర్ధం ముఖ్యమైనవి. శ్రీ అంతర్జననేంద్రియూలలో అండాశయం, అండవాహిక, గర్భాశయం, మూత్రాశయం, పొత్తికడుపు ఎముక, గర్భాశయ కంఠం, పురీషనాళం, త్రనాళం మొదలగునవి ముఖ్యమైనవి.

శ్రీ పురుష అంతర్ బాహ్య జననేంద్రియాలన్నిటి వికాసానికి, రక్షణకు, స్వస్థతకు పలు యోగాసనాలు నిర్మారించబడ్డాయి. వాటిని ఆచరణలో పెడితే జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు రావు.

12. మలవీసర్జన వీభాగం

చిన్నపెద్ద పేగుల నుంచి అనవసర పదార్థం మలరూపంలో బయటికి పంపు పని మలవిసర్జన విభాగం చేస్తుంది. ఈ విభాగం సరిగా పని చేయకపోతే రకరకాల వ్యాధులు ఆరంభం అవుతాయి. ఈ విభాగం సక్రమంగా తన పనిని నిర్వహించడానికి యోగ క్రియలు ఎంతో సహకరిస్తాయి.

శరీర అవయవాలను గురించి, అవి చేసే పనులను గురించి కుణ్ణంగా తెలుసుకోవడం వల్ల రోగాల్ని రుగ్మతల్ని రాకుండా తమను తాము సంరక్షించు కోవచ్చు.