9. శంఖ ప్రక్షాళనం


ఆరోగ్య రక్షణకు అతి ముఖ్యమైన ప్రక్రియ మల విసర్జనం. తిన్న ఆహారం జీర్ణం కావడం, అజీర్తి లేకపోవడం అవసరం. అందుకు అమితంగా సహకరించే యోగక్రియ శంఖ ప్రకాళనం, మలరంధ్రం శంఖం రూపంలో వుంటుంది. దాన్ని ప్రక్షాళనం చేసే అంటే కడిగే క్రియ కనుక దీనికి శంఖ ప్రక్షాళనం అని పేరు వచ్చింది.

శంఖ ప్రక్షాళనం క్రియ శరీర శుద్ధికి సంబంధించిన యోగ క్రియలన్నింటిలోను శ్రేష్టమైనది. ఇది జాగ్రత్తగా చేయవలసిన క్రియ. దీనికి సంబంధించిన 4 ఆసనాలను ఉపయోగించి ప్రయోజనం పొందాలి. ఆ ఆసనాలు వేసే ముందు ఉప్పనీరు తాగితే, ఆ నీటి ద్వారా నోటి నుంచి మలరంధ్రం వరకు 80 లేక 40 అడుగుల పొడవు గల మార్గాన్ని శంఖప్రక్షాళన క్రియ శుద్ధి చేస్తుంది.

వంకర టింకరగా వుండే గొట్టాన్ని శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు ఎంత అవసరమో, మన పొట్ట యందలి వంకర టింకర మార్గాన్ని పరిశుభ్రం చేయుటకు కూడా ఎక్కువ నీరు చాలా అవసరం. ఈ నీటినంతటిని, నోటి నుంచి పొట్టకు, పొట్ట నుంచి చిన్న పేగుకు, చిన్న పేగు నుంచి పెద్ద పేగుకు, పెద్ద పేగు నుంచి మలరంధానికి నెట్టవలసి వస్తుంది. నీటితో బాటు జీర్ణం కాకుండా మిగిలిపోయిన వ్యర్థపదార్ధమంతా ముందుకు సాగి బయటికి వెళ్లిపోతుంది.

ఈ క్రియ చేసేముందు ఒక్క పర్సెంటు ఉప్ప లేక నాలుగైదు నిమ్మకాయల రసం కలిపిన అయిదారు లీటర్ల గోరువెచ్చని నీరు సిద్ధం చేసి ఉంచుకోవాలి.

శంఖ ప్రక్షాళనం క్రియు చేయుటకు క్రింద తెలిపిన 4 ఆసనాలు వరుసగా పేయాలి.

1) సర్పాసనం,
2) ఊర్ధ్వహస్తాసనం.
3) కటిచక్రాసనం.
4) ఉదరాకర్థనాసనం

ఈ నాలుగు ఆసనాలతో శంఖ ప్రజాళన క్రియ పూర్తి అవుతుంది.

ఈ ఆసనాలు వేయు ముందు ఒక గ్లాసెడు చొప్పన ఉప్ప నీరు లేక నిమ్మనీరు త్రాగాలి.

1. సర్పాసనం:

ఈ ఆసనం పడగవిప్పిన సర్పాకారంలో వుంటుంది. కనుక దీనికి సర్పాసనం అని పేరు వచ్చింది.

విధానం
బోర్లపడుకొని కాళ్లు దగ్గరగా వుంచి కాలివ్రేళ్లపైన, నేలకు ఆన్చిన రెండు చేతులపైన, శరీరం బరువును మోపాలి. మోకాళ్లు నేలకు ఆనకూడదు. శ్వాసవదిలి శిరస్సును కుడి ప్రక్కకు తిప్పి బుజం మీదుగా మడమల్ని చూడాలి. శ్వాసపీలుసూ యధాస్థితికి రావాలి. అదే విధంగా ఎడమ ప్రక్కకు కూడా చేయాలి. & లేక 5 సార్లు రెండు వైపుల మడమల్ని చూడాలి.

ఉపయోగము
త్రాగిన ఉప్ప నీరు యీ ఆసనం వల్ల ఒకటిన్నర అడుగుల పొడవుగల నాళం ద్వారా పొట్టలోకి వెళుతుంది.

2. ఊర్ధ్వహస్తాసనం:

చేతులు పైకెత్తివేయు ఆసనం కనుక దీనికి ఊర్ధ్వహస్తాసనం అని పేరు వచ్చింది.

విధానం
సర్పాసనం స్థితి నుంచి నడుమును పైకిలేపి, ఒక్కొక్క కాలు ముందుకు తెచ్చి నిటారుగా నిలబడాలి. రెండు చేతులు దగ్గరకు తెచ్చిరెండు చేతుల ప్రేళ్ల పరస్పరం
కలిపి పైకి ఎత్తి గట్టిగా మెలికవేయాలి. శ్వాస మొల్లగా వదులుతూ నడుము పైభాగాన్ని చేతులతో సహా కుడివైపుకు వంచాలి. శ్వాస పీలుసూ తిరిగి యధాస్థితికి రావాలి.

అదే విధంగా నడుమును ఎడమవైపుకు వంచి చేయాలి. కుడివైపుకు తీ నుంచి 5 సార్లు, ఎడమ వైపుకు తీ నుంచి 5 సార్లు వంచి లుబా క్రియ చేయాలి, నడువు వూ త్రవేు వంగాలి కాని కాళు చేతులు వంగకూడదు.

ఉపయోగము
పొట్టలోకి ప్రవేశించిన ఉప్ప నీరునిత నుంచి 80 అడుగుల పొడవుగల చిన్నపేగులోకి వ్యర్థ పదార్థంతో సహా చేరుతుంది.

3. కటిచ(కాసనం:

ఈ ఆసనంలో కటి అనగా నడుము చక్రరూపంలో తిరుగుతుంది కనుక దీనికి కటిచక్రాసనం అని పేరు వచ్చింది.

విధానం
కాళ్లు ఎడంగా వుంచి నిలబడి రెండు చేతులు ముందుకు చాచాలి. కుడిచేయి ప్రక్కకు చాచి వెనుకకు తీసుకు వెళ్లి ఎడవు చే తిని రొమ్ము మీదుగా కుడిబుజం దగ్గరకు చేర్చాలి. శ్వాస వదులుతూ వెడ ను, లొవ్మును, నడుమును కుడివైపుకు తిప్పివెనుకకు చూడాలి. తరువాత శ్వాసపీల్చి చేతులను తలను మధ్యస్థితికి తీసుకురావాలి.

ఇదే విధంగా ఎడమ చేతిని చాచి, మెడను, రొమ్మును, నడుమును ఎడమవైపుకు త్రిప్పాలి. యీ క్రియ రెండు దిక్కుల 8 నుంచి 5 సార్లు చేయాలి.

ఉపయోగము
ఉప్ప నీరు వ్యర్థపదార్థంతో సహా చిన్నపేవు నుంచి, ఆరు అడుగుల పొడవుగల పెద్ద పేవులోకి ప్రవేశిస్తుంది.

4. ఉదరాకర్షణాసనం:

కాలును మడిచి తొడను పొట్టకు ఆనించి పొట్టకు వత్తిడి కలిగించే ఆసనం కనుక దీనికి ఉదరాకర్షణాసనం అని పేరు వచ్చింది.

విధానం
దొడ్డికి కూర్చున్న విధంగా రెండు పాదాల మీద కూర్చొని రెండు మోకాళ్ల మీద రెండు చేతులు వుంచాలి. కాళ్లు కొంచెం దూరంగా వుంచి ఎడమ కాలును నేల మీదకు ఆనించాలి. కుడి తొడను పొట్టకు ఆనించి వత్తాలి. দ্য “গুও వదులుతూ మెడ, ఛాతీ, నడుమును కుడివైపుకు తిప్పాలి. శ్వాసపీల్చి యధాస్థితికి రావాలి.

అదే విధంగా ఎడమవైపుకు కూడా చేయాలి. రెండు ప్రక్కల 8 నుంచి 5 సార్లు యీ క్రియ చేయాలి.

ఉపయోగము
40 అడుగుల ప్రయాణం పూర్తి చేసి పెద్ద పేగు నుంచి వస్తున్న వ్యర్థ పదార్థంతో కూడిన ఉప్పనీరు మలరంధ్రం వైపుకు సాగుతుంది.

గమునీంచవలసిన వీవరాలు:

పైన తెలిపిన 4 ఆసనాలు ఒక గ్రూపు అన్నమాట. ఒక్కొక్క గ్రూపు ఆసనాలు వేసే ముందు ఒక్కొక్క గ్లాసెడు ఉప్పనీరు తాగాలి. 5 లేక 6 సార్లు క్రియ చేసిన తరువాత శుద్ధి ప్రారంభం అవుతుంది. గట్టి వ్యర్థ పదార్థం బయటికి రావడం ప్రారంభమవుతుంది. యీ క్రియ చేసూ 4, 5 సార్లు మలశుద్ధి జరిగిన తరువాత వ్యర్థ పదార్ధమంతా ఉప్పనీటితో బాటు బయటికి వెళ్లిపోతుంది. తరువాత తాగిన నీరు తాగినట్లుగా బయటికి వెళ్లిపోతుంది. అప్పడు యీ శుద్ధి క్రియు సఫలం అయినట్లుగా భావించాలి.

శంఖ ప్రక్షాళనం క్రియ చేస్తున్నప్పడు క్రింద తెలిపిన నియమాలను పాటించడం అవసరం.

1. పైన తెలిపిన 4 ఆసనాలు వేయడం వారం రోజుల పాటు అభ్యాసం చేయాలి. అందువల్ల ముఖ్యక్రియ చేయునప్పుడు అలవాటు అయి ఆ క్రియ చేయడం తేలిక అవుతుంది.

2. శంఖ ప్రక్షాళన క్రియ చేయుటకు మూడు రోజుల ముందు వరుసగా గజకర్షి అనగా జలధౌతిక్రియ ఉదయం, పరగడుపున చేయాలి. యిలా చేయడం వల్ల యీ క్రియ చేయునప్పుడు ఎక్కువ నీరు తేలికగా తాగవచ్చు. కక్కులు రావు.

3. ఈ క్రియ చేయుటకు ఒక్కరోజు ముందు సాయంత్రం 4 గంటల తరువాత భోజనం చేయకూడదు. ద్రవపదార్థం తీసుకోవచ్చు.

4. శంఖప్రక్షాళన క్రియ చేయుటకు అర్థగంట లేక గంటసేపు పట్టవచ్చు. అంతలో ఉప్ప లేక నిమ్మనీరు చల్ల బడుతుంది. కనుక ఆ నీటిని మధ్య మధ్యన వేడి చేసూ ఉండాలి లేక కొద్దిపేడి నీటిని కలుపుతూ ఉండాలి.

5. శంఖప్రకాళనం పూర్తి అయిన తరువాత కూడా పొట్టలో కొద్దిగా ఉప్పనీరు మిగిలివుండిపోతుంది. కనుక క్రియ పూర్తికాగానే ఉప్ప కలపని గోరువెచ్చని 5, 6 గ్లాసుల నీరు త్రాగి, కక్కి పేయాలి.

6. ఏదైనా మిషనును శుభ్రంచేసినప్పుడు అందు ఆయిలు పేస్తాము. అదే విధంగా శరీరంలోపలి భాగాన్ని కడిగి శుభ్రం చేసినప్పడు శుద్ధమైన నెయ్యిలోపలికి తీసుకోవడం అవసరం. అప్పడు శరీరమను మిషను యొక్క ఓవరాయిలింగ్ పూర్తవుతుందన్నమాట.

ఈ క్రియు చేయుటకు ముందు 100 గ్రాముల బియ్యం, 100 గ్రాముల పెసరపప్చ కలిపి, కొద్దిగా ఉప్పవేసి ఉడకబెట్టిపులగం తయారుచేసివుంచాలి. శంఖ ప్రక్షాళనం పూర్తి కాగానే పులగంలో 75 గ్రాములు మంచి నెయ్యి బాగా కలిపి కడుపునిండా తినాలి. అదే విధంగా మధ్యాహ్నం, సాయంత్రం కూడా యీ ఆహారం తీసుకోవాలి. మొత్తం మీద సుమారు పావుకిలో నెయ్యి పుచ్చుకోవాలి.

ఈ నెయ్యి లోనికి వెళ్లి శక్తి కలిగిస్తుంది. ఆ రోజున మరింకేమీ తినకూడదు. తాగకూడదు. కొద్దిగా నీరు మాత్రం తాగవచ్చు. రెండో రోజున, మూడో రోజున తేలిక భోజనం చేయాలి.

7. శంఖ ప్రక్షాళన క్రియ చేసే ముందు స్నానం చేయాలి. క్రియ చేసిన తరువాత స్నానం చేయకూడదు. క్రియ పూర్తికాగానే బట్టలు మార్చి పులగం భుజించి శయనించాలి.

8. శంఖ ప్రకాళన క్రియ చేసినప్పుడు శరీరమందలి అవయవాలు ఎంతో సున్నితం అవుతాయి. అందువల్ల 24 గంటలసేపు శరీరానికి, మనస్సుకు విశ్రాంతి నీయడం అవసరం. అప్పడు ఏ పని చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. కేవలం భోజనం కోసం మాత్రమే లేవాలి. విరోచనం వస్తే లేవాలి.

9. అల్సరు, గుండె జబ్బు కలవాళ్ళు, బలహీనంగా వున్న వాశల్ల, పిల్లలు, వయోవృదస్థలు, గర్భిణీ స్త్రీలు, వారం రోజుల్లో బహిషు అయ్యే نن رئ శంఖ ప్రక్షాళనం క్రియ చేయకూడదు. బి. పి. వున్న వాళ్లు ఉప్పకు బదులు నిమ్మరసం కలిపిన నీరు వాడాలి. ఈ క్రియ మొదటిసారి యోగనిపుణుల సమకంలోనే చేయడం అవసరం.

10. వర్షం కురుస్తున్నప్పడు యీ క్రియ చేయకూడదు. యీ క్రియ చేస్తున్నప్పుడు శరీరానికి పెనుగాలి తగలకూడదు.

11. ఈ క్రియ చేస్తున్నప్పడు విరోచనం అమిత ఫోర్సుగా వస్తుంది. కనుక పాయిఖానా దొడ్డి (సమీపంలో) ఖాళీగా ఉండాలి.

12. ఈ శంఖప్రక్షాళన క్రియ పైన తెలిపిన నియమాలు పాటిసూ రెండు లేక మూడు నెలలకు ఒక సారి చేయాలి.

లాభాలు :

శంఖ ప్రయోళన క్రియ నియవు బద్ధంగా చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాంు. ఉదరానికి సంబంధించిన లివరు, మూత్రపిండాలతో సహా అవయవాలన్నిటి శుద్ధి జరగడం వల్ల రోగాలు పోతాయి. గ్యాస్త్రిక్ట్రబుల్స్, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం తొలిగిపోతాయి. పొట్ట, నడుములపై గల వ్యర్థ కొవ్వు తగుతుంది. మధుమేహం, ఆస్తమా వంటి పెద్దలోగాలు నయం కావడానికి యీ క్రియు వల్ల సహకారం లభిస్తుంది.

సర్పాసనం, ఊర్ధ్వహస్తాసనం, కటిచక్రాసనం, ఉదరాకర్షణాసనం యివి నాలుగు ఒక గ్రూపు. ఇవి శరీర అవయవాలన్నింటిని ప్రభావితం చేస్తాయి. కనుక ప్రతిరోజూ ఒక్క గాసు మంచి నీరు లేక ఒక కప్ప సంపూర్ణ ఆరోగ్యామృతం తాగి రోజూ నాలుగు ఆసనాల గ్రూపు అభ్యాసము మూడు నాలుగు సార్లు తప్పక చేయాలి.


“యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబొధస్య, యోగో భవతి దు:ఖహా ||”

ఆహారం, నిద్ర, పని, వ్యాయామం విషయంలో అశ్రద్ధ చూపకుండా ఆరోగ్యం కాపాడుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ వహించిన మహిళ ఇల్లేకదా స్వర్గసీమ !