32. కొన్ని కఠిన యోగాసనాల చిత్రాలు

గ్యాలరీ:

అనుభవజ్ఞులైన విశేషజ్ఞలు బోధించిన కొన్ని కఠిన యోగాసనాల చిత్రాలు ఇక్కడ ప్రచురిస్తున్నాము. ఈ యోగాసనాలు చాలా కాలం పాటు స్వయంగా పేసి, అనేక ప్రయోగాలు చేసి అనుభవం గడించి వారు యీ ఆసనాలు వేయ గలిగారు. ఇట్టి ఆసనాలు వేయుటకు ప్రయత్నించు వారు క్రింద తెలిపిన నియమ నిబంధనలను తప్పక పాటించడం అవసరం.

నియమ నిబంధనలు:

1. ఈ యోగాసనాలు వేయడం ప్రారంభించినప్పడు అనుభవజ్ఞలగు యోగా చార్యుల సలహాలు తప్పక తీసుకోవాలి.

2. ఈ ఆసనాలు వేయుటకు ముందు, ప్రారంభిక ఆసనాలు సులభంగా వేయ
గలిగిన అభ్యాసం కలిగి యుండాలి. (ఇంతకు ముందలి అధ్యాయాలలో చూచి, వాటిని గమనించ వచ్చును.)

3. ఈ ఆసనాలువేయునప్పుడు శరీరం, కాళ్లు, చేతులు, అవయవాల జాయింట్ల మొదలగునవి మంచిగా, హుషారుగా, చురుకుగా ఉండాలి, ఇవి సులభమైన, అవసరమైన స్థితులను చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలి.

4. ఈ ఆసనాలు వేయునప్పుడు వాటి బరువు ప్రభావం శరీరమందలి ఏ భాగం మీద పడుతుందో తెలుసుకోవాలి. లేని ఎడల ఆయా అవయవాలు దెబ్బ తినవచ్చును.

5. ఈ ఆసనాలు చరమస్థితికి చేరునప్పుడు అమితంగా యోచించడం, తొందర పడటం ప్రమాదకరం, క్రమం తప్పకుండా, నెమ్మదిగా ఈ ఆసనాలు వేస వుండటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

6. ఈ ఆసనాలు వేస్తున్నప్పడు వెదడును వాటిపై కేంద్రీకరించాలి. ఆ సమయంలో మనశ్శాంతి, ఏకాగ్రత అత్యవసరం, మనస్సు చంచలమైతే ప్రమ”దం సంభవించును.

7. ఈ ఆసనాలు నాలుగు రకాలు 1. ముందుకు వంగి వేయునవి డి. వెనుకకు వంగి వేయునవి 3.బాలెన్సు నిలపి వేయునవి 4. తదితరములు. వీటిని తమ తమ శారీరిక శకి, సౌకర్యాన్ని బటి అభ్యసించాలి.