17. నవ్వు – ఆనందాసనం


నవ్వు ఆనందాసన స్వరూపం. ఆరోగ్యానికి నవ్వు చాలా అవసరం. హృదయం ప్రసన్నంగా వున్నప్పడే నవ్వు వస్తుంది. అదే విధంగా నవ్వు రాగానే హృదయం ప్రసన్నం అవుతుంది. మొత్తం జీవరాశిలో నవ్వు మానవ జాతికే లభించిన వరదానం. ဇိမ်ခံချွံဥ့် ముఖం అందరినీ ఆకర్షిస్తుంది అందువల్లనే నవ్వు ముఖం అవసరమని అంతా భావిస వుంటారు. నవ్వు ముఖం వికసించి ఉంటుంది.

సాహిత్య రసశాస్త్ర ప్రకారం నవరసాల్లో హాస్యరసం ఒకటి. హాస్యరసానికి సాయీ భావం నవ్వు నవ్వు వచ్చినప్పడు శరీరంలో జరిగే మార్చును అనుభావాలు అని అంటారు. చిరు నవ్వు వచ్చినప్పడు ముఖం విప్పారడం, కండు సగంగాని లేక పూర్తిగా గాని మూతపడటం, పళ్లు బయటికి కనబడడం, పకపక నవ్వుతూ వున్నప్పడు ధ్వని రావడం, బుజాలు ఎగురుతూ వుండటం, హాస్యరసానికి సంబంధించిన అనుభావాలు. యీ అనుభావాలను రసశాస్త్రంలో స్మిత, హసిత, విహసిత, అవహసిత, అపహసిత, అతిహసిత అని ఆరు విధాలుగా విభజించారు.

1. స్మితము

చిరునవ్వు: నేత్రాల్లో కొద్దిగా వికాసం, పెదవుల కొద్ది కదలిక, ధ్వని వెలువడక పోవుట, చిరునవ్వు లేక మందహాసం దీనికి లక్షణాలు.

2. హసితము

పై లక్షణాలతో బాటు పళ్ల వరుస కూడా బయటికి కనబడటం హసిత లకణం.

3. విహసితము

ఇందు స్మిత, హసిత లక్షణాలతో బాటు కంఠం నుంచి మధుర ధ్వని వెలువడుతుంది.

4. అవహసితము

విహసిత లక్షణాలతో బాటు శిరస్సు నందు కొంచెం కదలిక, బుజాల కదలిక లేక బుజాలు కొద్దిగా ఎగరడం అవహసిత లక్షణాలు.

5. అపహసితము

అవహసిత లక్షణాలతో బాటు ಜಿಂಜ್ನಲಿ* నీరు నిండటం, ఆనందబాష్పాలు రాలడం, అపహసిత లక్షణాలు.

6. అతిహసితము

పై లక్షణాలతో బాటు కాళ్లు చేతులు కదిలించడం, ఎదురుగా వున్నవారిని చేతులతో పొడవడం, పెద్దగా ధ్వనిచేసూ అట్టహాసంగా నవ్వడం అతిహసిత లక్షణాలు,

సమయానుకూలంగా పై నవ్వులను ఉపయోగిసూ ప్రసన్నంగా ఉండాలి.

లాభాలు:

బాధలు, కష్టాలు, నిరాశలు, నిస్పృహలు తొలిగి మనస్సుకు ఆనందం కలుగుతుంది. జీర్ణ క్రియ, శ్వాస ప్రక్రియ, రక్త ప్రసారం మొదలగు శరీర క్రియలపై మంచి ప్రభావం పడుతుంది. హృదయం లోతుల్లో నుంచి ప్రసన్నత, ఉత్సాహం, ఆపదం పెల్లబుకుతాయి. స్మూల, సూక్ష్మశరీర అవయవాలకు මධ්‍ය කඩු, చురుకుదనం లభిస్తాయి. కార్యశక్తి పెరుగుతుంది. మనిషికి ఆకర్షణా శక్తి పెరుగుతుంది. సూచన : గుండె జబ్బు, అతి బలహీనత ఉన్నవాళ్లు తేలికగా నవ్వును అభ్యసించాలి. ఇట్టి వారు అతి హాస్యం చేయకూడదు.


హాస్యం ుూనాటి యుగంలో టెన్షనును తొలగించుటకు ఉపయోగ పడుతుందని ఆధునిక విజ్యానవేత్తలు అంగీకరించారు. కనుకనే ప్రపంచ వుందంతట హాస్య క్లబ్బులు, (లాఫింగ్ క్లబ్బులు) ఏర్పడుతూ ఉన్నాయి. యోగ శిక్షణా కేంద్రాల్లో దీనిని ఆనందాసనం రూపంలో సాధకులు అభ్యసిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ లో జూ నవ్వుతూ ఆనందానుభూతి పొందుతూ వుండాలి.