10. సూర్యనమస్కారాలు


సూర్యుడు తేజస్సంపన్నుడు. శక్తివంతుడు. కనుకనే అన్నిమతాలవాళ్లు ప్రాచీన కాలం నుంచి సూర్యుణ్ణి శాఘించారు. ఆరాధించారు. సూర్యరశ్మికిగల శక్తి అపారం, సూర్యశక్తి లేకపోతే జీవనమే లేదు. అందు వల్లనే సూర్య నమస్కారం చేయు పద్ధతి అమల్లోకి వచ్చింది.

ఉదయం, సాయంత్రం సూర్యోదయం, సూర్యాస్తమానము జరుగుతూ వున్నప్పడు వాయువునందు ఆక్సిజన్ (ప్రాణవాయువు) అధికంగా వుంటుంది. ఆ సమయాల్లో సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యనమస్కారం చేసూ ఆసనాలు వేయడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆ ఆసనాల్ని యోగవిద్య యందు ඊෆිර් స్థితులు అని అంటారు. సూర్యుని నామమంత్రాలు కూడా నిర్మారించబడ్డాయి. ఒక్కో మంత్రం పఠిసూ12 శరీర స్థితుల్ని అంటే ఆసనాల్ని పేయాలి. మంత్రోచ్చారణ వల్ల శరీరం మనస్సుల యందు శక్తితరంగాలు ఉద్భవిస్తాయి. మంత్రోచ్చారణతో బాటు సూర్యనమస్కార ఆసనాలు వేస్తే సూర్యస్ఫూర్తి లభిస్తుంది. ఆసనాలు వేస్తున్నప్పడు వివిధ ఆవయవాల మీద మనస్సును కేంద్రీకరించాలి. దాని వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

సూర్య నమస్కార ఆసనాలు అందరూ పేయవచ్చు. విద్యారులకు సూర్య నమస్కారాలు దేవుని వరాలే. ప్రారంభంలో మూడు ఆసనాలు అభ్యాసం చేసి, తరువాత ఒక్కొక్కటి చొప్పన పెంచుతూ పోవాలి. 12 ఆసనాలు అనగా 12 శరీర స్థితుల్ని అమలు చేయాలి.

గుండెజబ్బు, అధిక రక్తపువోటు వున్నవాళ్లు ఆ బాధలు తగ్గిన తరువాత సూర్య నమస్కార ఆసనాలు పేయవచ్చు.

సూర్య నమస్కార మం(తాలు:

సూర్య నమస్కారమంత్రాలు 1008 వున్నాయి. వాటిలో 15 మంత్రాలు అమితంగా ప్రచారంలో వున్నాయి.

ఓం సూర్యాయనమః ఓ జీవన ప్రదాతా నమస్కారం.
ఓం ఆదిత్యాయ నమః ఓ రక్షకుడా నమస్కారం.
ఓం అనులే నమః ఓ కిరణ్మయా నమస్కారం
ఓం అర్కాయ నమః ఓ అపవిత్ర నిర్మూలకా నమస్కారం,
ఓం హిరణ్య గర్భాయ నమః ఓ హిరణ్యగర్భుడా నమస్కారం.
ఓం భాస్కరాయ నమః ఓ భాస్కరుడా నమస్కారం.
ఓం ప్రభాకరాయ నమః ఓ దీప్తివంతుడా నమస్కారం.
ఓం దినకరాయ నమః ఓ దినకరుడా నమస్కారం
ఓం భానవే నమః ఓ జ్యోతిపుంజమా నమస్కారం.
ఓం పూప్లే నమః . ఓ పోషకుడా నమస్కారం
ఓం ఖగాయ నమః ఓ చలన కర్తా నమస్కారం
ఓం మిత్రాయ నమః ఓ మిత్రమూ నమస్కారం
ఓం సవిత్రే నమః ఓ విశ్వపితా నమస్కారం
ఓం మరీచయే నమః ఓ కిరణ్మయా నమస్కారం
ఓం రవయే నమః ఓ ఆనందోత్సాహాలు కల్పించువాడా నమస్కారం

ఒక మంత్రం పఠించి సూర్యనమస్కారం ప్రారంభించాలి. ఒక సూర్య నమస్కారం అంటే 12 ఆసనాల గ్రూపు అన్నమాట. 1. మొదటి స్థితి – నమస్కారాసనం (a-b)

I. మొదటి స్థితి – నమస్కారాసనం (a-b):

శ్వాస పీలుస్తూ నమస్కరిసూ నిటారుగా నిలబడాలి. ఒక మంత్రం పఠిస శ్వాస వదులుతూ సూర్య నమస్కారం ప్రారంభించాలి.

మంత్రాక్షరాలపై ధ్యానం కేంద్రీకరించాలి.

II. రెండవ స్థితి – అర్ధ చం(దాసనం:

1వ స్థితిలో నుంచి శ్వాస పీలుస్తూ తలతో బాటు రెండు చేతుల్ని వెనుకకు వంచాలి. కాళ్లు వంచకూడదు. వెనుకకు శరీరం కొద్దిగా వంచినప్పడు బాలెన్సు సరిగా వుండాలి. లేని యెడల వెనుకకు పడిపోవచ్చు.

ఛాతీ మీద ధ్యానం కేంద్రీకరించాలి.

III. మూడవ స్థితి – పాదహస్తాసనం:

2వ స్థితిలో నుంచి శ్వాస వదులుతూ, రెండు చేతులతో పాదాలను తాకాలి. నుదుటిని మోకాళ్లకు ఆనించుటకు ప్రయత్నించాలి. మెడనొప్పి వున్న వాళ్లు తలను ఎక్కువగా వంచకూడదు.

మోకాళ్లు, పిక్కలపై ధ్యానం కేందీకరించాలి.

IV. నాల్గవ స్థితి – అశ్వసంచాలనాసనం లేక ఆంజనేయాసనం:

3వ స్థితిలో నుంచి చేతులు నేలకు ఆనించి ఎడమకాలును పూర్తిగా వెనుకకు తీసుకు వెళ్లి తరువాత శ్వాస పీలుస్తూ చేతులు పైకి లేపాలి. కుడి పాదం నేలమీద ఆనించవచ్చు.
భృకుటిపై ధ్యానం కేంద్రీకరించాలి.

V. అయిదవ స్థితి – పర్వతాసనం:

4వ స్థితిలో నుంచి రెండు చేతులు క్రిందికి తెచ్చి నేలను తాకాలి. కుడికాలును ఎడమ కాలు దగ్గరకు చేర్చి నడుమును పైకి లేపాలి. మడమలను పైకి క్రిందికి కదుపుతూ వుండాలి. శ్వాస పీలుస్తూ వదులుతూ వుండాలి.

నడుం మీద ధ్యానం కేంద్రీకరించాలి.

VI. ఆరవ స్థితి – సాష్టాంగ లేక ఆష్టాంగ నమస్కారాసనం (a-b):

5వ స్థితిలో నుంచి రెండు కాళ్లు, ఛాతీ, చిబుకం నేలకు ఆన్చాలి. నడుము, పొట్టలను కొద్దిగా ఎత్తివుంచాలి, శ్వాస వదలాలి.

పొట్ట మీద ధ్యానం కేంద్రీకరించాలి.

VII. ఏడవ స్థితి – సర్పాసనం:

6వ స్థితిలో నుంచి చేతులను భూమిపై అణచి, శ్వాస పీలుస్తూ శిరస్సును పైకి లేపాలి. కాళ్ల ప్రేళ్ల మీద, చేతుల మీద శరీరం ఆని వుండాలి.

కంఠంపై ధ్యానం కేంద్రీకరించాలి,

VIII. ఎనీమీదవ స్థితి – భూకంపాసనం:

7వ స్థితిలో నుంచి , చేతులు, కాళ్లు నేలకు ఆనించి శరీర మధ్య భాగాన్ని శ్వాసవదులుతూ పైకి లేపాలి. నడుమును, కాలి మడమల్ని కుడి ఎడమలకు కదుపుతూ వుండాలి.

నడుం మీద ధ్యానం కేంద్రీకరించాలి.

IX. తొమ్మీదవ స్థితి – ఆశ్వసంచాలనాసం:

8వ స్థితిలో నుంచి నడుమును మడమలను కదుపుట ఆపి, ఎడమకాలు ముందుకు తెచ్చి, రెండు చేతులు పైకి ఎత్తి, శ్వాస పీలుస్తూ మెడను చేతులను వెనుకకు చాచాూలి.

భృకుటిపై ధ్యానం కేంద్రీకరించాలి.

X. పదవస్థితి – పాదహస్తాసనం:

9వ స్థితిలో నుంచి రెండు చేతులు భూమికి ఆనించి కుడి కాలును, ఎడమకాలు ప్రక్కకు తెచ్చి, శ్వాస వదులుతూ ఫాలభాగాన్ని మోకాళ్లకు එ9බීටඩ්

పిక్కలపై ధ్యానం కేంద్రీకరించాలి.

XI. పదకొండవ స్థితి – వృక్షాసనం:

10వ స్థితిలో నుంచి రెండు చేతులు తిన్నగా శ్వాసపీలుస్తూ పైకి లేపాలి. రెండు చేతుల బొటన ప్రేళ్లు కలిసి ఒక దాని నొకటి తాకి వుండాలి. శరీరమంతా నిటారుగా నిలిచి వుండాలి,

శరీరం బిగువపై ధ్యానం కేంద్రీకరించాలి.

XII. పన్నెండవ స్థితి – నమస్కారాసనం:

11వ స్థితిలో నుంచి, రెండు చేతులు పై నుంచి రెండు పక్కలకు తిప్పతూ ముందుకు తెచ్చి శ్వాసవదులుతూ రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

ఛాతీ యందలి గుంట అనగా హృదయ కమలం మీద ధ్యానం కేంద్రీకరించాలి.

సూర్యనమస్కారాలు రోజూ చేసూ ఉండాలి. అయితే క్రింద తెలిపిన నాలుగు విధాలుగా చేసూ ముందుకు సాగాలి.

1. మొదటి విధానం : ఇందు పైన తెలిపిన స్థితులలో నుంచి 1,2,3,11,12 యీ అయిదు స్థితులు అభ్యసించాలి.
2. రెండవ విధానం : ఇందు పైన తెలిపిన స్థితులలో నుంచి 1,2,3,5,10,11,12 యీ ఏడు స్థితులు అభ్యసించాలి.
3. మూడవ విధానం : ఇందు పైన తెలిపిన స్థితులలో నుంచి 1,2,3,4,5,9,10,11,12 యీ తొమ్మిది స్థితులు అభ్యసించాలి.
4. నాలుగవ విధానం : పై మూడు విధానాలు అభ్యసించి 1 నుండి 12 వరకు స్థితులను పూర్తిగా అభ్యసించాలి.

ఇలా చేయుట వల్ల సూర్యనమస్కారాలు తేలికగా చేయవచ్చు.

పై క్రమంలో సూర్యనమస్కారాలు, శరీర శక్తిని బట్టిచేసి కొద్దిసేపు కూర్చున్న తరువాత శవాసనం పేసి కొద్దిసేపు తప్పక పూర్తి విశ్రాంతి తీసుకోవాలి.

సూర్యనమస్కారాలకు ప్రాచీన కాలాన్నుంచి సూర్యభగవానుని పూజ రూపంలోను మరియు శారీరిక మానసిక స్వస్థతను చేకూర్చు సాధనం రూపంలోను ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. యీ క్రియను సూర్యోదయ సమయంలో చేయాలి. కాని యీ యుగంలో కొందరు ఆలశ్యంగా నిద్రలేస్తున్నారు. అయీ యీ క్రియలు ఎప్పడైనా సరే చేసూ లాభాలు పొందవచ్చు.

లాభాలు:

ఈ క్రియల వల్ల శరీర అవయవాలన్ని చురుకుదనంతో నుండి స్పూర్తివంతం అవుతాయి. స్యూలకాయం తగుతుంది. వ్యర్థపు కొవ్వు తగుతుంది. బుగ్గలునున్నగా అందంగా రూపొందుతాయి. అజీర్ణం, మలబద్ధకం మొదలగు ఎన్నో జబ్బులు తగుతాయి. نرئ గర్భాశయం శుద్ధి అవుతుంది. అధిక రక్త (సావం వంటి نع رخ జిబ్బలు తగుతాయి.


సమయం లభించనివారు రోజూ సూర్యనమస్కారాలు కొన్నిఅయీ చేసూ శరీరానికి, మనస్సుకు అవసరమైన వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల్ని పొందవచ్చు.