డాక్టర్ ప్రవీణ్ కాపడియా గారు, 6 డిసెంబరు 1947 న జన్మించారు. తన తండ్రి శ్రీ కున్వార్జీ లాల్జీ కాపడియా వద్ద 8 ఏళ్ళ వయసులో యోగాభ్యాసాన్ని ప్రారంభించారు మరియు ఆ తరువాత ప్రముఖ యోగాచార్యుల వద్ద శిక్షణ పొందారు. తమ మొదటి పరిచయం లోనే వీరు మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేస్తారు.
గౌరవనీయులైన సామాజిక కార్యకర్తల కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ ప్రవీణ్, ప్రఖ్యాత గాంధీ జ్ఞాన మందిర్ యోగా కేంద్ర డైరెక్టర్ గా మరియు ఇంటర్నేషనల్ హెల్త్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా యోగా విజ్ఞాన వ్యాప్తిని విస్తరించే బరువైన బాధ్యతను చేపట్టారు.
వీరి నిరంతర కృషి వలన చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ ‘యోగా కాపిటల్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు పొందడమే కాక ఇక్కడ వేల మంది యోగాభ్యాసాన్ని చేస్తున్నారు మరియు ‘బెటర్ హెల్త్’ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.
ఇక్కడ వీరు మీ పూర్తి పరివర్తన కోసం సూచనలను ఇస్తున్నారు. చదివి అర్థం చేసుకుని పూర్తిగా కొత్త జీవన మార్గాన్ని అనుసరించగలరు.