మహాత్మాగాంధీ అమితంగా పేమించి, ఆచరణలో బెట్టి, పలువురికి ప్రకృతి చికిత్స చేసి ప్రజలను ప్రోత్సహించారు. స్వయంగా పూనా దగ్గర ఉరళీకంచన్లో ప్రధమ ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు.
సూర్యరశ్మి మట్టి, జలం సులభంగా లభిస్తాయి. ఇవి సహజంగా లభించే వనరులు. వీటి సాయంతో కొన్ని చికిత్సలు ఎవరికి వారు చేసుకోవచ్చు.
1. మట్టి పట్టీలు:
బంకమట్టి, నల్లరేగడి మట్టి ఎంతో ఉపయోగకరమైనవి. బంక లేక రేగడి మట్టితో పట్టి తయారుచేసే పొట్ట, కండు, బుగ్గలు, చెవులు, గొంతు, పాదం, వీపు, వెన్నెముక, మొదలుగా గల అవయవాల మీద వేస్తే అక్కడి చెడును, మాలిన్యాన్ని వేడిని పీల్చి వేస్తుంది. మట్టిని పౌడరుగా జల్లించి, నీటిలో నానబెట్టి పరిశుభ్రమైన బట్ట మీద వేసి నాలుగు మూలల పట్టీగా మడిచి, 30 నిమిషాల పాటు అవసరమైన చోటున పేసి వుంచాలి. గ్యాసు, అజీర్ణం మున్నగు వ్యాధులు తగుతాయి. మట్టి లేపనం వల్ల ముఖం మీది మొటిమలు తగ్గిపోతాయి. పగలని పుండు మీద వేస్తే అది పగిలి, అందలి మలిన పదార్థం బయటికి వెళ్లిపోతుంది. శరీరమంతా బంక మట్టి రాసి ఒక అరగంట సేపు వుంటే చర్మవ్యాధులు తగ్గిపోతాయి. శరీరం కాంతి పెరుగుతుంది. మట్టిలో జారగుణం వుంది కనుక మట్టి పట్టీలను రుగ్మతలకు వాడి ప్రయోజనం పొందవచ్చు.
శరీర రుగ్మతలు పోవుటకు లోతు గొయ్యి త్రవ్వి అందు మెడ వరకు మనిషిని వుంచి పూడ్చి కొద్దిసేపు వుంచుతున్నారు. తల భూమిపైనే వుంటుంది. ఇది పాత పద్ధతియే.
2. కటి స్నానం:
దీన్ని నడుం స్నానం, ఉదర స్నానం, నాభి స్నానం అని కూడా అనవచ్చు.
కటిస్నానానికి పనికి వచ్చే తొట్టెలు బజారులో దొరుకుతాయి. తొట్టిలో నాభి వరకు వచ్చే విధంగా నీళ్లు నింపి, అందు పడకకుర్చీలో కూర్చొనే విధంగా, ఏటవాలుగా కూర్చోవాలి. తొట్టి బయట పీట వేసి దానిపై కాళ్లు వుంచాలి. చిన్నతువాలు తడిపి దాన్ని తల మీద పేసుకోవాలి. ఒక చిన్న జేబు రుమాలు తీసుకొని, నాలుగు మడతలు మడిచి, నాభి క్రింది భాగాన, అటు యిటు అడ్డంగా, సున్నితంగా దానితో రుదాలి. గట్టిగా రుద్దకూడదు. ప్రతి రోజు పది నిమిషాలు లేక అరగంట సేపు కటిస్నానం చేయాలి. అనారోగ్యంగా వున్నవ్యక్తి20 నిమిషాలు కటిస్నానంచేయాలి. పిరుదులు, నాభి క్రింది భాగం నీటిలో మునగాలి. చన్నీళ్లతో స్నానం మంచిది. జబ్బుపడినప్పడు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. కటి స్నానం కాగానే తువాలుతో తుడుచుకోవాలి, చలివేస్తే కంబళి కప్పకొని పడుకోవాలి. తరువాత తీ కిలోమీటర్లు నడవాలి లేక తేలిక పాటి వ్యాయామం చేయాలి. అలా చేసినందున శరీరానికి వేడి కలుగుతుంది. కటి స్నానం చేశాక ఒక గంటసేపు ఆగి స్నానం చేయాలి. గంటసేపు ఏమీ తినకూడదు.
లాభాలు :
కటి స్నానం వల్ల పేవులపై మంచి ప్రభావం పడి అందలి ఉష్ణం తగుతుంది. అందలి మలం కూడా తగుతుంది. గుండె జబ్బులు, పెట్టా బి.పి. జలుబు, నిద్రలేమి, నీరసం మున్నగు వ్యాధులు నయమవుతాయి.
ஆலs సంబంధించిన బుతు క్రమం జబ్బులు నయమవుతాయి. ఋతుక్రమం సక్రమంగా జరుగుతుంది. కటి స్నానం ఉదయం, సాయంత్రం రెండు పూటల రోజూ చేయవచ్చు. కటి స్నానం చేసే ముందు ప్రకృతి చికిత్సా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
3. సూర్య స్నానం:
సూర్యరశ్మిలో వెల్లకిల గాని లేక బోర్లగాని పడుకొని సూర్యకిరణాల పేడిని శరీరానికి పట్టడాన్ని సూర్యస్నానం అని అంటారు. అందరూ సూర్య స్నానం చేయవచ్చు. లంగోటిగాని కట్ డ్రాయర్ గాని ధరించాలి. మిగతా శరీరంపై బట్టలుండకూడదు. స్త్రీలు తక్కువ బట్టలు ధరించాలి. సూర్య స్నానానికి ముందు నీటితో తలను శుభ్రంగా తడపాలి. తర్వాత పడుకొని, తడిపిన బట్టను తలమీద కప్పకోవాలి. ఎండలో నేలపై గాని లేదా చాపపై గాని పడుకోవచ్చు. సూర్య కిరణాలు సూటిగా దేహం పైకి సోకుటకు అనువుగా సూర్యుని వైపు కాళ్లు చాచి పడుకోవాలి. ఈ విధంగా సూర్య స్నానం తీ0ని.లు చేయవచ్చు. పరగడుపున సూర్యోదయ సమయంలో సూర్య స్నానం చెయ్యాలి. సూర్య స్నానం చేశాక చెమట పడితే తుడుచుకొని మామూలుగా స్నానం చెయ్యాలి. సూర్య స్నానం వల్ల శరీరానికి శక్తి, నూతనోత్తేజం, బలం చేకూరుతాయి. డి-విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. రికెట్స్ మున్నగు జబ్బులు, చర్మవ్యాధులు పోతాయి. ప్రకృతివైద్య విధానం ప్రకారం రంగుటదాలలో సూర్య స్నానం మరియు అరటి ఆకులలో పడుకోబెట్టి ఆతపస్నానం చేయించి అనేక దీర్ఘకాలిక చర్మరోగాలను నయం చేస్తారు.
4. తడి బట్టతో పట్టి:
చిన్నచేతి రుమాలును గాని లేదా ఖద్దరు గుడ్డను కాని తీసుకొని ఫ్రిజ్ నీళ్లలో తడిపి పిండి ముఖం మీదగాని, నాభి మీదగాని లేక ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ వేసి కొద్దిసేపు అలా ఎండే వరకు ఉంచాలి. తడి బట్ట పొట్ట మీద వేస్తే, గ్యాస్ తగుతుంది. ముఖం మీద వేస్తే జ్వరం యొక్క తీవ్రత తగుతుంది. దెబ్బ తగిలినా, కోసుకున్నా దాని మీద చల్లని పట్టీ వేస్తే రక్తస్రావం తగుతుంది.
5. వేడి నీటి పాద స్నానం:
కుర్చీ మీద కూర్చొని బక్కెట్లో పేడి నీళ్లు పోయాలి. గోరువెచ్చని పేడి నీళ్ళలో రెండు అరికాళ్లను ఉంచాలి. ఆ నీళ్ల పేడి తగ్గిన తరువాత, 5, 6 సార్లు అందులో పేడి నీళ్లను పోసూ ఉండాలి. ఆ బక్కెట్తో సహా శరీరాన్నంతటిని కంబళితో గాని లేదా బ్లాంకెట్తో గాని కప్పాలి. తల మీద పిండిన తడిగుడ్డ ఉంచాలి. 20 నిముషముల సేపు అలా ఉంచితే, ఒళ్లంతా, కాళ్లతో సహా చెమట పడుతుంది. ఈ పాదస్నానం చేసే ముందు ఒక గ్హాసెడు నీళ్లు తాగాలి. 20 నిమిషాల సేపు పాదస్నానం చేసి తువాలుతో చెమటను తుడిచి, బట్ట కప్పకొని నిద్ర పోవాలి. యీ వేడి నీటి స్నానం వల్ల కాళ్లతీత తగ్గుతుంది. వాతం, కీళ్లనొప్పలు, ఒళ్ల నొప్పలు తగ్గుతాయి. నిద్రపట్టని వాళ్లకు వేడి నీటి పాదస్నానం రామబాణంలా పని చేస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది.
నిషేధాలు
పెట్టా బి. పి. వున్నవాళ్లు, మనశ్శాంతి లేని వాళ్లు, గుండె జబ్బు వున్నవాళ్లు పాద స్నానం చేయకూడదు.
పై క్రియలతోబాటు యిప్పడు ప్రకృతి చికిత్సపై పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాటిని తెలుసుకొని సాధకులు, రోగులు ప్రయోజనం పొందాలి.