5. యోగాభ్యాస నీయమాలు, సూచనలు


శరీర స్థితి సామాన్యంగా ఒకే విధంగా వుండదు. మారుతూ వుంటుంది. కూర్చున్నా నుంచున్నా పడుకున్నా లేచినా, వంగినా, ముడుచుకున్నా ఆసనం క్రింద లెక్కే.

පරථමී ඊෆිර් స్థితి మీద మనస్సు ఏకాగ్రమైనప్పడు అట్టి శరీరస్థితిని యోగాసనం అని అంటారు.

ప్రాచీనకాలంలో మనిషి జీవనం ప్రకృతి మీద ఆధారపడి వుండేది. శరీర స్థితి ර්ණ ලයිට් පරඹී. శరీరస్థితిని బట్టి క్రియల్ని మలిచి మునులు, ఋషులు, యోగులు, యతీంద్రులు పలుయోగాసనాలు కనిపెట్టి, వాటిని తాము ఆచరణలో పెట్టి, తరువాత ప్రపంచానికి అందించారు. ప్రాచీన కాలంలో 84 లక్షల ఆసనాలు వేసేవారని ప్రతీతి. తరువాత అవి 84 వేలకు తగ్గిపోయాయి. యిప్పడు మరీ తగ్గిపోయాయి. ఆరోగ్యానికి ఏ ఏ ఆసనాలు అవసరమో తెలుసుకొని, నిపుణుల సలహాగైకొని ఆ ఆసనాలు ప్రతి రోజూ వేయడం మంచిది. ఆసనాలతో బాటు సూర్య సమస్కార ఆసనాలు కూడా ప్రతి రోజూ వేయడం అలవాటు చేసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. యోగాసనాలు వేసే సాధకులు, యోగాసనాలకు సంబంధించిన నియమాలు తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టడం మంచిది.

పాటించవలసిన నీయమాలు

1) ప్రాతఃకాలం త్వరగా లేచి చెంబెడు మంచినీళ్లు త్రాగాలి. మలమూత్ర విసర్జన చేసి, ముఖం కడుక్కొని, చన్నీటితో స్నానం చేసి, తరువాత యోగాసనాలు ప్రారంభించాలి. ఆరోగ్యం సరిగా లేనప్పడు, చలి ఎక్కువగా వున్నప్పడు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఉదయంపూట కుదరకపోతే మధ్యాహ్నం గాని లేక సాయంత్రం గాని ఆసనాలు వేయవచ్చు.

2) స్నానం చేయకుండా కూడా ఆసనాలు వేయవచ్చు. కాని ఆసనాలు వేసిన తరువాత కొద్దిసేపు ఆగి స్నానం చేయాలి.

3) యోగాసనాలు పరగడుపున పేయాలి. ఒక వేళ ఆహారం తీసుకుంటే 4’/* గంటలసేపు ఆగి ఆసనాలు పేయాలి. తేలికగా టిఫిన్ తీసుకుంటే 2/* గంటల సేపు ఆగి తరువాత ఆసనాలు వేయవచ్చు.

4) తెరపగాలిలో, సమతలంగా వున్నచోట, వెలుగు వచ్చేచోట ఆసనాలు వేయాలి. పెనుగాలిలో వేయకూడదు.

5) శరీరం మీద దుస్తులు కొద్దిగాను, వదులుగాను ధరించాలి. స్త్రీలు కూడా తక్కువ దుస్తులు ధరించాలి. కురాపైజామా ధరిస్తే మంచిది.

6) ఆసనం వేస్తున్నప్పడు మాట్లాడ కూడదు. ముక్కుతో గాలి పీల్చాలి. వదలాలి. నోరుమూసి వుంచడం మంచిది.

7) ఒట్టినేల మీద లేక గచ్చు మీద ఆసనాలు పేయకూడదు. తివాచీ, దుప్పటి, మంచి వస్త్రం, కంబళీ వీటిలో ఏదైనా సేలమీద పరిచి దానిమీద ఆసనాలు పేయాలి.

8) గర్భిణీ స్త్రీలు మూడో నెల వరకు ఆసనాలు పేయకూడదు. తరువాత 7వ నెల వరకు సమర్శలైన యోగ నిపుణుల సలహా ప్రకారం తేలిక ఆసనాలు పేయవచ్చు. బహిషులేక రజస్వల అయిన స్త్రీలు యోగసనాలు వేయకూడదు. ఆపరేషన్ చేయించుకున్న లేక గుండె జబ్బుల వంటి పెద్ద వ్యాధులు వున్న స్త్రీలు పురుషులు నిపుణుల సలహా తీసుకొని ఆసనాలు వేయాలి.

9) యోగాసనాలు వేస్తున్నప్పడు తొందర పడకూడదు. శరీర అవయవాలకు ఎక్కువ శ్రమగాని, వత్తిడిగాని కలుగకూడదు.

10) ఆసనాలు వేసే ముందు, వేసిన తరువాత రెండు అరచేతులతో ముఖం, శరీరం ఒక్క సారి పూర్తిగా నిమరడం అవసరం. ఆసనాలు వేసిన తరువాత కొద్ది సేపు శవాసనం వేసే విశ్రాంతి తీసుకుంటే మంచిది.

11) ప్రతి రోజూ నియమ ప్రకారం ఆసనాలు వేయడం అవసరం. మధ్య మధ్యన మ”నడం మంచిది కాదు.

12) ఆసనాలు పేస్తున్నప్పడు మనస్సును పూర్తిగా దాని మీదనే కేంద్రీకరించాలి. ఆసనాలు చేసేటప్పటు మస్తిష్కాన్ని నియంత్రణలో వుంచడం అవసరం.

13) ప్రశాంతమైన మనస్సుతో ఆసనాలు పేయాలి. నిరాశ, నిస్సత్తువ, భయం, విచారం, ఆవేదనలతో మనస్సు నిండివున్నప్పడు ఆసనాలు వేయకూడదు. ఆ సమయంలో శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవడం మంచిది.

14) ప్రారంభంలో ఏ ఆసనమైనా యధాశక్తి కొద్ది సెకండ్ల సేపేపేయాలి. అలవాటు అయిన తరువాత సమయాన్ని పెంచవచ్చు.

15) ఆసనాలు వేసి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆహారం తీసుకోవచ్చు.

16) స్కూళ్లలో చిన్నపిల్లల చేత బలవంతంగా ఆసనాలు వేయించకూడదు. స్కూలుకు రాగానే పిల్లల చేత వెంటనే ఆసనాలు వేయించకూడదు. స్కూలుకువెళ్లే ముందు పిల్లలు ఆహారం తీసుకొనివుంటారు. కనుక స్కూలు తెరిచిన రెండు గంటల తరువాత పిల్లల చేత ఆసనాలు పేయించాలి,

17) 60 లేక 70 సంవత్సరాల వయస్సు గల పెద్దలు తేలిక ఆసనాలు వేయడం మంచిది.

18) వాహ్యాళికి వెళ్లి వచ్చిన వారు విశ్రాంతి తీసుకొని తరువాత ఆసనాలు పేయాలి. ఆసనాలు వేసిన తరువాత శవాసనం వేసి విశ్రాంతి తీసుకొని వాహ్యాళికి వెళ్లవచ్చు.

19) ఆసనాలు వేసే ముందు సూర్య నమస్కార ఆసనాలు వేయాలి. సూర్య నమస్కార ఆసనాలు వేసిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మిగతా ఆసనాలు పేయవచ్చు.

20) ఆసనాలు వేసేటప్పడు ఆయాసం వచ్చినా, శ్వాసవేగంగా కొట్టుకున్నా గుండె దడ పెరిగినా ఆసనాలు వేయడం ఆపి శవాసనంపేసి విశ్రాంతి తీసుకోవాలి.

21) ఆసనాలు వేసి ప్రాణాయామం చేసిన తరువాత శవాసనం తప్పక పేయాలి.

22) ఆసనాలు వేసిన తరువాత మూత్రం తప్పక విసర్జించాలి. ఆసనాలు వేస్తున్నప్పడు అవసరమైతే మధ్యలో వులమూత్ర విసర్జన చేయాలి. బలవంతాన ఆపుకోకూడదు.

23) దాహంవేస్తే మంచినీళ్లు కొద్దిగా తాగవచ్చు.

24) మలబద్ధకం వున్నవాళ్లు రెండు మూడు గ్లాసుల గోరు వెచ్చటి నీరు త్రాగి శంఖ ప్రవేళన ఆసనాలు రెండు మూడు సారు పేయాలి. మలబద్ధకం తగుతుంది.

25) ఆసనం వేసినప్పడు పొట్టకు, ఛాతీకి వత్తిడి కలిగినప్పడు శ్వాసను బయటికి వదలాలి. వత్తిడి తగ్గినప్పడు శ్వాసనులోనికి పీల్చాలి. ఇది శ్వాస ప్రశ్వాసలకు సంబంధించిన సామాన్య విధానం.

26) యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం యొక్క అభ్యాసానికి యీ క్రమం సరియైనది. అయితే సాధకులు తమ యిష్టం మరియు సదుపాయం ప్రకారం యీ క్రమంలో మార్పు చేసుకోవచ్చును.


పైన తెలిపిన యోగాభ్యాస నియవనాలు, సూచనలతో బాటు ఎన్నో ఉపయోగకరమైన విషయాలు తెలుసుకొని ప్రతివ్యక్తి తన జీవితంలో క్రమశిక్షణను అలవరుచుకోవాలి.

“వపకృశత్వం, వదనే ప్రసన్నతా, నాదస్ఫుటత్వం, నయనే సునిర్మలే, ఆరోగతా, బిందు జయం, అగ్ని దీపనం, నాడీ విశుద్ధి హఠ సిద్ధి లక్షణం ”
(హ.ప్ర.)
యోగాభ్యాసం వల్ల వృద్దత్వ నివారణ, ముఖంపైన ఆనందం, శబ్ద స్పష్టత, కంటి నిర్మలత్వం, ఆరోగ్యం, ఇంద్రియ నిగ్రహం, జఠరాగ్ని సమతుల్యం నాడీశుద్ధి మొదలగు లాభాలు పొందవచ్చును.