4. యోగ అష్టాంగాలు


మానవజీవితానికి లక్యం ఏమిటి అను ప్రశ్నకు పలువురు పలు సవూ ధానాలు యిచ్చారు. సుఖసౌఖ్యాలు, భోగవిలాసాలు – అనుభవించ డవేు జీవన లక్యం అను అభిప్రాయంతో బాటు, మనదేశంలో ప్రాచీన కాలాన్నుంచి ధర్మార్ణకావవెూజాలు జీవనలక్ష్యాలనే వాదం ప్రచారంలోకి వచ్చింది. అందుకు అనుకూలంగా వునిషి జీవనాన్ని బ్రహ్మ చర్యాశ్రవుం, గృహస్యాశ్రవుం, వానప్రసాశ్రమం, సన్యాసాశ్రవుం అను నాలుగు భాగాలుగా విభజించి, ఆ విధంగా జీవనం గడపాలని బోధించారు. అయితే ప్రసుతం అందుకు తగిన వాతావరణం ” లేకుండా పోయింది.

ఈ విషయమై వివిధ మతాల వాళ్లు సూచించిన వాదాల్లో ఆధ్యాత్మిక వాదమే ప్రముఖ స్మానం పొందింది. యోగశాస్త్ర ప్రధాన లక్ష్యం కూడా యిదే. యోగమంటే ఆత్మ పరమాత్మల కలంుక అని నిర్మారించారు. Oుది ధ్యానం, $ටර්රථ °ධී వల్ల సాధ్యమవుతుంది. ఆ స్థితిని పొందాలంటే వైరాగ్యం, చిత్తప్రవృత్తుల్ని నిరోధించగలగడం అవసరం. కనుకనే పతంజలి మహర్షి యోగశ్చిత్త వృత్తి నిరోధః అని సూచించారు. వున బుషులు, మునులు, యోగులు, యోగశాస్త్రంలో సిద్దాంతాలతో బాటు ఆచరణకు కూడా লক্ষ কে- “গু০ యిచ్చారు. యోగాభ్యాసం ప్రారంభించిన సాధకుడికి యీ విషయం తేలికగా బోధపడుతుంది. సంసార తాపత్రయాలతో బాటు, పరమాత్మతత్వాన్ని కూడా అర్ధం చేసుకునేందుకు కృషిచేస్తే మానవ జీవితం సార్థకమై ఆనందం పొందుతుందని ఆచరణ ద్వారా బోధించడమే యోగవిద్య యొక్క లక్ష్యం. అందుకు ప్రధాన సాధనం మానవ శరీరం. మానవ శరీరానికి రెండు రూపాలు వున్నాయి.
1) బాహ్యరూపం
2) అంతర్ స్వరూపం

శరీరం, మనస్సు, ప్రాణం, బుద్ధి, ఆత్మ మొదలుగా గల అవయవాలను మరియు ఆనాటి పలు యోగ విధానాలను దృష్టిలో పెట్టుకొని వాటిని పరిశోధించి పతంజలి మహర్షి యోగ అషాంగాల్ని ప్రతిపాదించారు. 1) యమం. 2) నియమం. తి) ఆసనాలు. 4) ప్రాణాయామం, 5) ప్రత్యాహారం. 6) ధారణ. 7) ధ్యానం. 8) సమాధి. ఇవే యోగ అషాంగాలు.

ఇందు యమం, నియమం, ఆసనాలు, ప్రాణాయామం అను నాలుగు అంతర్ బాహ్య రూపాలకు సంబంధించినవే అయీ ముఖ్యంగా వీటి ప్రభావం బాహ్యరూపం మీద అధికంగా ఉండటం వల్ల వీటిని బహిరంగ యోగాంశాలు అని అన్నారు.

అదే విధంగా ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి యూ నాలుగింటి ప్రభావం అంతర్స్వరూపం మీద అధికంగా పడటం వల్ల వీటిని అంతరంగ యోగాంగాలు అని అన్నారు. అందరూ వీటిని గురించి తెలుసుకోవడం అవసరం.

1. యమాలు

ఇది ప్రధమ అంశం, ప్రాచీన కాలంలో యమాలు చాలా వుండేవి. కాని పతంజలి మహర్షి అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అను అయిదింటిని ఎన్నిక చేశారు. యీ అయిదు యువూలు సామాజిక ప్రవర్తనకు సంబంధించినవి. మానవజీవితానికి బాహ్యరూపంగా వున్న శరీరాన్ని సక్రమమైన మారాన నడిపించడమే యీ అయిదు యమాల లక్ష్యం.

1) అహింస :

ప్రతి ప్రాణిని రక్షిసూ వునస్సు, వాక్కు, కర్మల ద్వారా శారీరకంగాను, మానసికంగాను ఎవ్వరికీ హాని కలిగించకుండుట, అందుకు ఇతరులను పేరేపించకుండుట, చేస్తున్నవారిని ప్రోత్సహించకుండుట.

2) సత్యం :

మనస్సు, వాక్కు, కర్మల ద్వారా సత్యం పలుకుట, అసత్యం పలుకకుండుట.

3) ఆస్తేయం :

దొంగతనం, లంచగొండితనం, బ్లాకు మార్కెటు, కత్తీ చేయుట వెుదలుగా గల దుశ్చర్యలు చేయకుండుట, ఇతరులను అందుకు పేరేపించకుండుట, చేస్తున్న వారిని ప్రోత్సహించకుండుట.

4) బ్రహ్మచర్యం :

పంచజనేంద్రియాల్ని పంచకర్మేంద్రియాల్ని మనస్సును వశమునందుంచుకొని ప్రవర్తించుట, సంయమంతో జీవితం గడుపుతూ సత్సంతానం కని మానవాళికి మేలు చేయుట.

5) ఆపరిగ్రహం :

భౌతిక సుఖసాధనాల్ని అవసరానికి మించి అధికంగా నిల్వ చేయకుండుట. పరుల కలిమి కోసం ప్రాకులాడకుండుట.

ప్రతి వ్యక్తి యీ అయిదు యమాలు ఆచరిస్తే ప్రపంచం శాంతి సౌఖ్యాలతో వెల్లివిరుస్తుంది.

2. నీయమాలు :

ఇవి ఆత్మవికాసానికి సంబంధించినవి. పతంజలి మహర్షి బోధించిన నియమాలు అయిదు.

1) బౌచం, 2) సంతోషం. తి) తపం, 4) స్వాధ్యాయం. 5) ఈశ్వర ప్రణిధానం అనగా శరణాగతి.

1) శాచం :

శారీరకంగాను, మానసికంగాను శుచిగా యుండుట. బాహ్యశరీర శుద్ధి కోసం స్నానం చేయుట. ఇంటిని, బట్టల్ని పని చేయు చోటును పరిశుభ్రంగా వుంచుకొనుట. అంతర్ శుద్ధి కోసం షట్కర్మలు చేసి చెడు యోచనల్ని తొలగించుకొని, మనస్సును సద్భావాలతో, సదాశయాలతో నింపి పవిత్రంగాను, శుచిగాను యుంచుకొనుట,

2) సంతోషం :

సంతోషమేు సగం బలం, లభించిన దానితో తృప్తిపడి, ంతోషంగా, హాయిగా వుండుట. నేటి యుగంలో దీన్ని సాధించుట కష్టమైనప్పటికీ, పటుదలతో సాధించుట.

3) తపం :

సహనశక్తి, శ్రమశక్తిని పెంచుకొని, శరీరాన్ని మనస్సును తపస్సు ద్వారా ప్రశాంతంగా వుంచుకొనుట, కషాల్ని ఓర్చుతో సహించుట.

4) స్వాధ్యాయం:

స్వాధ్యాయం ద్వారా జనం పొందుట. తనను గురించి తాను తెలుసుకొనుట అనగా ఆత్మజ్యానం పొందుటకు సత్సాంగత్యం సత్సాహిత్య పఠనం చేయుట.

5) ఈశ్వర ప్రణిధానం :

ఈశ్వర శరణాగతి అను ప్రవృత్తిని అలవరుచుకొనుట. అహంకారం త్యజించుట. చేయుపని యొక్క ఫలితాన్ని భగవంతునికి అర్పించి నిష్కామభావంతో పని చేయుట, సేవ చేయుట.

ఈయమ నియమాలు జీవన విధానాలు, ప్రాచీన కాలంలో ప్రజలంతా వీటిని అచరించినందున ఆకాలానికి స్వర్ణకాలవుని ప్రఖ్యాతి వచ్చింది. ఈనాటి కలియుగంలో వీటిని ప్రతి వ్యక్తి సాధ్యమైనంతవరకు ఆచరించడం అవసరం. అందువల్ల ప్రపంచ మానవాళి సుఖసౌఖ్యాలతో విలసిల్లుతుంది.

3. ఆసనాలు

ఇవి యోగాసనాల పేరిట ప్రఖ్యాతి గడించాయి. యోగశాస్త్ర వుంటే యోగాసనాలే అను భావం సామాన్య ప్రజానీకంలో ఏర్పడింది. కాని నిజానికి ఇవి యోగశాస్త్రంలో ప్రముఖమైన ఒక అంశం మాత్రమే. యోగాసనాలు శరీర శుద్ధికి, అవయవాల పుష్టికి, దీర్గాయువుకు సహకరించే సాధనాలు. యోగాసనాల ద్వారా రోగాలు రాకుండా చూడవచ్చు. వచ్చిన రోగాల్ని త్వరగా నయం చేసుకోవచ్చు.

స్థిరం సుఖం ఆసనం అనగా స్థిరంగా సుఖంగా ఒకే స్థితిలో వుండటం అని పతంజలి వ్యాఖ్య, సామాన్యంగా మనిషి తన అవయవాల్ని ఒకే స్థితిలో వుంచి ఎక్కువ సేపు వుండలేడు. కనుక అవయవాల్ని పేరు పేరు స్థితుల్లో వుంచి, రబ్బరు వలె వాటిని సానుకూలంగాను, సౌలభ్యంగాను మలుచుకుంటూ, తద్వారా రోగాలను దరికి రానీయకుండా చేసుకొనేందుకు ఆసనాల విధానం ఏర్పడింది. అవయవాలకు శక్తి, సామర్యాలు లభింపచేయడమే ఆసనాల ఉద్దేశ్యం. ఏ మాత్రం తొందరపడకుండా అభ్యాసం చేసి ఏకాగ్రతతో, శక్తినిబట్టియోగాసనాలు పేయడం అవసరం. ఆసనాలు అనేకం.

4. ప్రాణాయామం

ప్రాణాయామం అను శబ్దంలో ప్రాణం, ఆయామం అను రెండు శబాలు కలిసి వున్నాయి. ప్రాణం అంటే జీవన శక్తి, శ్వాస అన్నమాట. ఆయామం అంటే పెంచుట, విస్తరింప చేయుట అని అర్థం. అంటే ప్రాణశక్తిని పెంచుట లేక నియంత్రించుట అని చెప్పవచ్చు. ప్రాణాయామ విధానాలు అనేకం.

ప్రాణాయువుం సరిగా, సక్రమంగా చేయగలిగితే వున ఆరోగ్యం వున చేతుల్లోనే వుంటుంది. మనస్సు వశంలో వుంటుంది.

5. ప్రత్యాహారం

మనస్సును, బుద్ధిని శాంతింపచేసి, వాటిని నిర్మలంగా, నిశ్చలంగా యోచనారహితంగా ఉంచడాన్ని ప్రత్యాహారం అని అంటారు. ప్రత్యాహార స్థితి సాధించినచో ఇంద్రియాలు వశంలో వుంటాయి. మనస్సు ఏకాగ్రతను సాధించి తపస్సు వైపు మళ్లుతుంది.

6. ధారణ

ధారణ అంటే ఒకానొక విషయం మీద ఏకాగ్రతను నిలుపుట అని అర్ధం. హృదయం, భృకుటి, జిహ్వ, నాసిక, నాభి మొదలుగా గల సూలసూత్కవిషయాలతో బాటు ఇష్టదేవత ජීජ యిష్టజెపైన చిహ్నాలపై లేక వుం(తాలపై వునస్సును కేంద్రీకరించడాన్నిధారణ అని అంటారు. ఆహార విహారాదులు, నడత, దినచర్యల్లో మార్పు తెచ్చుకొని సాధకులు సాధన ద్వారా ధారణాశక్తిని పెంచుకోవాలి.

7. ధ్యానం

ఒక విషయం మీద మనస్సును మస్తిష్కాన్ని కేంద్రీకరించి, దాన్నేస్మరిస వుండడాన్నిధ్యానం అని అంటారు. ధ్యానయోగ ప్రాశస్త్యం అపారం. ప్రపంచంలో ధ్యానయోగం యొక్క పేరు పేరు విధానాలు అమలులో వున్నాయి.

8. సమాధి

అడ్డంకుల్ని ఆటంకాల్ని అధిగమించి, ఒకే విషయంపై చిత్తాన్ని ఏకాగ్రం చేసే అందు లీనం కావడాన్ని సమాధి స్థితి అని అంటారు. ధ్యానం యొక్క చరమస్థితియే {ටර්රථ “ඩී. ధ్యానస్థితి యందు ధ్యానం, ధ్యానం చేయువాడు, ధ్యానానికి సంబంధించిన విషయం మూడు పేరు పేరుగా వుంటాయి. కాని సమాధి స్థితిలో యీ మూడు ఏకాత్మ్యతను పొందుతాయి. ఆత్మసాకౌత్కారము మరియు ఆత్మపరమాత్మల కలయికయే సమాధి యొక్క పరమావధి.


పైన తెలిపిన యోగ అషాంగాలు వున ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన వరదానం, ప్రతి వ్యక్తి వీటిని తెలుసుకొని నిరంతరం అభ్యాసం చేయాలి.