26. మర్ధన (మాలిష్) చికిత్స


శరీర మందలి అవయవాల్ని పిసకడం, నిమరడం, మర్జన చేయడం సదా జరుగుతూనే వుంటుంది. దీన్నిమర్జనం, మాలీస్ లేక మసాజ్ చేయడం అని అంటారు. తల్లి గర్భాన్నుంచి శిశువు పుట్టగానే ఏదో రూపంలో సహజంగా మర్జన లేక మాలీసు ప్రారంభమవుతుంది. అది జరుగుతూనే వుంటుంది. పుట్టిన బిడ్డ బలంగా, దృఢంగా, దీర్షాయుస్సుతో పుష్టిగా జీవించి యుండాలని తల్లి కాంక్షించి, వూలీసు చేసూ వుంటుంది. మనిషి జీవించినంత కాలం మర్ధన అవసరమే. పిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు వారానికి ఒక్క రోజు మర్దన చికిత్స చేయించుకొని, తలంటి పోసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. యీ క్రియులు స్వయంగా కూడా ప్రతివారూ చేసుకోవచ్చు.

ప్రయోజనాలు:

శరీరంలో నిల్వ అయ్యే చెడు పదారాలు, మలమూత్రాదులు, చెమట, శ్వాసల రూపంలో బయటికి వెళ్లి పోతాయి.
(1) మర్దన వల్ల శరీరమందు రక్త సంచారం సక్రమంగా జరుగుతుంది.

(2) శరీర అవయవాలకు మర్ధనం వల్ల శక్తి లభిస్తుంది.

(3) జీర్ణకోశానికి, పేగులకు, తదితర గ్రంధులకు చైతన్యం కలుగుతుంది. అలసట తగుతుంది.

(4) దేహంలో నిల్వ వున్న వ్యర్థపు కొవ్వు కరుగుతుంది.

(5) పక్షవాతం, పోలియో, నరాల బలహీనత, తలనొప్పి, ఒళ్లు నొప్పలు, కీళ్ల నొప్పలు, వాపులు మున్నగు రుగ్మతలు తగ్గడానికి మాలీసు బ్రహ్మాండంగా పని చేస్తుంది.

(6) బలహీనంగాను, సన్నగాను వున్నవాళ్లు మర్ధనం వల్ల శక్తి వంతులు అవుతారు.

(7) చర్మరంధాలు శుభ్రపడతాయి. తద్వారా రక్తంలో చేరిన మాలిన్యం బయటికి వెళ్లిపోతుంది.

8) చర్మం నునుపు తేలి అందంగా వుంటుంది.

(9) యోగాభ్యాసం లేక ఇతర వ్యాయామాలు చేయు వారు మాలీసు చేసుకుంటే ప్రయోజనం పొందుతారు. ఏ వ్యాయామము చేయని వారు కూడా మాలీసు చేసుకొని ప్రయోజనం పొందవచ్చు.

విధానాలు:

మాలీసు చేయు విధానాలు ముఖ్యంగా 8 వున్నాయి.

1) తైలంతో మాలీసు,
2) క్రీమ్సతో మాలీసు,
3) చల్లనిపదార్థంతో మాలీసు,
4) కాలి పాదంతో మాలీసు,
5) పౌడరుతో మాలీసు,
6) కరెంటు పరికరాలతో మాలీసు,
7) వైద్య తైలాలతో మాలీసు,
8) అయస్కాంతంతో మాలీసు.

నువ్వులనూనె, కొబ్బరినూనె, ఆవ నూనె, ఆలీవ్ ఆయిలు, నెయ్యి, వీటిని మాలీసుకు ఉపయోగించవచ్చు.

దేహంలో చెడు రక్తం క్రింది నుంచి గుండెకు గొంపోబడుతుంది గనుక అరికాళ్ల నుంచి పైకి మౌలీసు చేయడం మంచిదని నిపుణుల అభిప్రాయం. జబ్బును బట్టి, జబ్బుపడిన అవయవాన్ని బట్టి నిపుణుల సలహాతో మాలీసు చేయడం జరుగుతుంది.

అన్నిటి కంటే తైల వర్ధనం ඊරටට ඩී.ධී • శరీరమంతట నూనె పల్చగా రాసి, వూలీసు చేసి సున్ని పిండి తో, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. నొప్పలున్న చోట వుర్జనం చేసి అచ్చట ఇన్ఫారెడ్ లైటుతో కాపడం వేస్తే నొప్పలు త్వరగా తగుతాయి.

మర్థన చికిత్స ఆరోగ్యాన్ని పెంపొందించుకొనుటకే చేసుకోవాలి. అనుచిత పద్ధతిన అవయవాల్ని ఉద్రేకపరుచుటకు చేసుకోకూడదు. చేయించుకోకూడదు.

లాభాలు:

శరీర వుంతట తైలం రాసి వుర్జనం చేసుకున్న తరువాత లేత సూర్యకిరణాలలో కొద్దిసేపు వుండి స్నానం చేస్తే డి-విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది, చర్మ వ్యాధులు రావు, వారానికి ఒక్క సారి చెవుల్లోను, ముక్కు రంధాల్లోను స్వచ్చమైన నూనెగాని, లేక నెయ్యిగాని అయిదారు చుక్కలు చేసుకోవాలి.

వుసాజ్ చేయించుకున్న తరువాత ఆవిరి స్నానం చేస్తే సూలకాయం తగ్గిపోతుంది. శ్వాసకు సంబంధించిన రుగ్మతలు, తలనొప్పి, జలుబు, నిద్ర లేకపోవడం వల్ల కలిగే అలసట తగ్గిపోతాయి. చురుకుదనం, స్ఫూర్తి పెరుగుతాయి.

ఆవిరి స్నానం చేసే ముందు ఒక గ్లాసెడు నీళ్లు తాగాలి. శిరస్సుప్తై తడి గుడ్డ పేసుకోవాలి. వారానికి ఒకసారి గాని, రెండు సార్లు గాని ఆవిరి స్నానం చేయవచ్చు.

నిషేధం:

అధికరక్తపు పోటు, గుండె జబ్బులు వున్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు, మర్దన చికిత్స ఆవిరి స్నానం చేయకూడదు.