22. ప్రశాంతి లేక విశ్రాంతి యోగ సాధన


2004 డిసెంబర్, ఆదివారం 11 వ తేదీన మా యోగ కేంద్రంలో aട് ప్రత్యేక యోగ క్లాసు నడుసూవుంది, అందు 120 మంది యోగ సాధకులు శాంతి ఆసనం వేసి విశ్రాంతి పొందున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా నాకు ఒక ఆలోచన కలిగింది. తత్ఫలితంగా నా నోటి నుండి ఒక యోగ ఆదేశం వెలువడింది. వెంటనే అందుకు సరిపోయే యోగ సాధన చేశాను. సాధకులు కూడ 30-40 నిమిషాల పాటు అదే సాధన చేశారు. వెంటనే వారందరికి శారీరికంగా, మానసికంగా ప్రశాంతి పొందిన అనుభూతి కలిగింది. అప్పటినుంచి ఆ క్రియకు ప్రశాంతి యోగ సాధన అని పేరు వచ్చింది.

విధానం

సాధకుడు పడుకొని కండు, చేతులు, కాళ్ళు, నొసలు, నోరు, ఛాతి, నడుము, మొదలగు అవయవాలను కదిలించుతూ క్రియలు చేయవలయును, వాటిలో ప్రాణాయామమునకు సంబంధించిన కొన్ని క్రియలు కూడా చేర్చిచేయవలయును. యోగానికి సంబందించిన కొన్ని చిన్న క్రియలు కూడా యిందు చేర్చబడినవి ఈ సాధనలన్నింటిని 30 లేక 40 నిమిషాలపాటు వత్తిడి లేకుండా చేయవలెను. ఈ క్రియలు చేయునప్పుడు మనస్సును, శరీరమందలి ఒక్కొక్క భాగముపై కేంద్రీకరించుచు ప్రతి అవయములోని వత్తిడి తగ్గినటు అనుభవించవలెను.

లాభాలు:

సంపూర్ణ ప్రశాంతి లేక్ష విశ్రాంతి పొందుటకు యీ క్రియ ఎంతో సులభసాధనము. ఈ సాధనను బలహీనులు, జబ్బుపడి మంచం పట్టినవారు సైతం సులభముగా చేయవచ్చును, ఆసుప్తత్రుల యజమానులు తమ రోగులలో ప్రశాంతి కలిగించుటకు ఈ క్రియలు తేలికగా చేయించవచ్చును. ఇందువలన వారి రోగ చికిత్సకు ఎంతో లాభము కలుగును.

ఈ క్రియ లేక సాధనకు సంభందించిన క్యాసెట్, సీడిలు, మా యోగకేంద్రంలో, అమ్మకమునకు లభించును.


శారీరక మానసిక విశ్రాంతి కోసం ఉపయుగపడు క్రియయే ప్రశాంతి యోగసాధన.