21. యోగనిద్ర


యోగనిద్ర క్రియ శరీరానికి, మనస్సుకు సంపూర్ణ విశ్రాంతి కల్పించే ప్రాచీన భారతీయ యోగ ప్రక్రియ. శతాబ్దాల పాటు మరుగున పడిన యీ యోగనిద్రా ప్రక్రియను బీహార్ స్కూల్ ఆఫ్ యోగ సంస్యాపకులు పరమహంస స్వామీ సత్యానంద సరస్వతిగారు పునరుద్ధరించారు. తద్వారా ఎంతో మంది ప్రయోజనం పొందారు. పొందుతున్నారు.

గాంధీ జాన మందిర్ యోగ కేంద్రం, హెదరాబాదుకు 5 సార్లు విచ్చేసి స్వామీజీ యిక్కడి పాఠకులకు యీ క్రియను నేర్చారు. యీ క్రియపై రిసర్చి చేసి, గడించిన అనుభవాన్నిబట్టి యిందు కొద్ది మార్పులు చేయడం జరిగింది. యీ అద్భుత క్రియను తెలుసుకొని సాధకులు ప్రయోజనం పొందవలెనని కోరుతున్నాం.

విధానం:

శవాసనం యొక్క వికసిత రూపమే యోగనిద్రాక్రియ. శవాసనంలో పడుకొని ఆలోచనలన్నింటిని ఆపి, యీ క్రియ ప్రారంభించే ముందు, శ్వాసపై మనస్సును కేంద్రీకరించాలి. శరీరమందలి చిన్న పెద్ద అంగ ప్రత్యంగాల్ని మనస్సుతో వీక్షించి వాటి ఆకారాల్ని మనస్సుతో గ్రహించాలి. తరువాత అంగప్రత్యంగాల్ని వదులు చేయాలి. వాటిని వదులుగానే వుంచాలి. శ్వాసను సామాన్య స్థితిలో సాగించాలి. అంగ ప్రత్యంగాల్ని వదులు చేసే ంూ ప్రక్రియను ఒక్కొక్క అవయవాన్ని తీసుకొని క్రమబద్ధంగా సాగించాలి.

కుడి చేయి:

బొటనవేలు, చూపుడు ప్రేలు, మధ్యమ ప్రేలు, ఉంగరం ప్రేలు, చిటికిన ప్రేలు, అరచేయి వెనుకభాగం, అరచేయి ముందుభాగం, మణికటు, ముంజేయి, మోచేయి, మోచేయి ‘ဒွါ၌ భాగం, భుజం.

కుడి కాలు:

కుడికాలి బ్రౌటన ప్రేలు, రెండవ, మూడవ, నాల్గవ, అయిదవ కాలివేళ్లు, అరికాలు పైభాగం, అరికాలు క్రింది భాగం, కాలి మడమ, కాలి మణికటు, పిక్కలు, మోకాలు, తొడ, తొడజాయింట్లు.

ఎడమ కాలు:

కుడి కాలు వలె

ఎడమ చేయి:

కుడి చేయి వలె

వీపు:

వెన్నెముక క్రింది నుంచి పై వరకు, వెన్నెముక ప్రక్కన గల వీపు కుడిభాగం, కుడి బుజం వెనుక భాగం, వీపు ఎడమ భాగం, ఎడమ బుజం వెనుక భాగం, మెడ వెనుక భాగం.

పొట్టి, ఛాతీ, గొంతు:

నాభి, నాభి ఎడమవైపు, నాభి క్రింది వైపు (మూత్రేంద్రియంతో సహా), నాభికుడివైపు, నాభి పైభాగం, ఛాతీ మధ్య భాగం, కుడి స్తనం, ఎడమ స్తనం, గొంతు యందలి గుంట.

శిరస్సు:

చిబుకం, క్రింది పెదవి, నాలుక, పైపెదవి, కుడి ముక్కు రంధ్రం, కుడి బుగ్గ, కుడి చెవి, కుడికన్ను ఎడమ కన్ను ఎడమ చెవి, ఎడమ బుగ్గ, ఎడమ ముక్కు రంధం, ముక్కు కొస, భృకుబీ, నుదురు, శిరస్సు పైభాగం, శిరస్సు వెనుక భాగం, శిరస్సు ప్రక్క భాగాలు.

ఈ క్రమంలో ప్రతి అవయవానికి 10 సెకండ్ల చొప్పన సమయంకేటాయించి మనస్సును దానిపై కేంద్రీకరించి, తెరిచిన కండ్లతో చూచినట్లుగా, కండు మూసి కూడా వాటి రూపాన్ని ఆకారాన్ని వీక్షిస వాటిని వదులుచేసూ వుండాలి.

పైన తెలిపిన క్రియలన్నింటిని 10-15 నిమిషాల్లో చేయాలి. అది ఒక రౌండు అన్నమాట. యిట్టి రౌండ్లు ఒకటి లేక ఒకటికి మించి కూడా చేయవచ్చు.

ఈ క్రియను రాత్రి నిద్ర పోయే ముందు పక్క మీద పడుకొని చేయడం మంచిది. దీనివల్ల కొద్ది గంటల పాటు గాఢనిద్ర వస్తుంది. శరీరానికి, మనస్సుకు సంపూర్ణ విశ్రాంతి లభిస్తుంది. నిద్రా సమయం కూడా తగుతుంది.

ఈ క్రియ చేస్తున్నప్పడు క్రింద తెలిపిన అనుభవాలు కలుగుతాయి:

1) శరీరం బరువుగానో లేక తేలికగానో వున్నట్లు అనిపించుట.

2) శరీరమందలి ఏదో భాగం మీద కాలుతున్న బొగు వంటి పేడియో లేక మంచు గడ్డ వంటి చల్లని తనమో సోకినట్లు అనిపించుట.

3) చర్మం మీద ఏదో పాకినట్లు, ఏదో కుట్టినట్లు, ఏదో పటుకు లాగినట్లు అనిపించుట.

4) శరీరం ఆకాశంలో ఎగిరినట్లు లేక జలంలో ఈదినట్లు లేక నేల మీద ఆణిగినట్లు అనిపించుట.

5) నాలుకకు ఏదో రుచి కలుగుతున్న చెవులకు ఏదో ధ్వని వినిపిస్తున్నట్లు, వంుక్కుకు సువాసన సోకుతున్నటు, కండ్ల ముందు ఏటో వెలుగు కనపడుతున్నట్లు అనిపించుట.

6) శరీరానికి వేడిగాలియో, చల్లనిగాలియో సోకినట్లు అనిపించుట.

7) శ్వాస సామాన్య స్థితిలో సాగుతూ వున్నప్పటికి, తీవ్రంగా వున్నట్లో లేక ఆగిపోతున్నట్లో అనిపించుట.

పై అనుభూతుల వంటి మరి కొన్ని అనుభవాలు కూడా సాధకులకు కొద్ది సెకండ్ల సేపు కలుగవచ్చు, అయీ ముఖ్య క్రియ నుంచి మనస్సు తొలగకూడదు.

లాభాలు :

1) ప్రతి వ్యక్తి ఎంతో మందిని కలుసు వుంటారు. అలాగే యోగనిద్ర యందు ప్రతి వ్యక్తి తనని తానే కలుస్తాడన్నమాట. శరీరమందలి ప్రతి అవయవంతో పరిచయం ఏర్పడుతుందన్నమాట.

2) యోగనిద్ర వల్ల, నిద్ర మంచిగా పడుతుంది. తద్వారా జానం పెరుగుతుంది. మగతనిద్రకు అవకాశం లభించదు. సమయం వ్యర్థం కాదు.

3) శరీరపు అలసట త్వరగా తగ్గిపోతుంది. నిద్రపోయే సమయం తగ్గినా శరీర అవయవాలన్నింటికి విశ్రాంతి లభించి అవి చురుగా వుంటాయి.

4) టెన్షను, గుండె జబ్బులు, గుండెదడ, హెచ్చు రక్తపుపోటు తగుతాయి.

5) మానసికంగా, శారీరికంగా మనిషికి శాంతి, స్థిరత్వం లభించి, చంచలత్వం తొలిగిపోతుంది.


యోగనిద్ర బహు సూక్క క్రియ, కనుక ఈ క్రియ యందు మనస్సు పూర్తిగా లీనం కావడం అవసరం, యీ యోగనిద్ర క్రియను ప్రారంభంలో నిపుణుల ప్రత్యక్ష శిక్షణ ద్వారా గాని లేక మేము తయారు చేసిన కాసెట్ వింటూ గాని చేయవచ్చును.