19. ధ్యానము

శరీరమందలి అవయవాలన్నీ ప్రధానమైనవే. అయితే వాటిలో మనిషి మనస్సు మూత్రం కడు బలవత్తరమైనది. అది బహుచంచలం, కామం, క్రోధం, మదం, మోహం, లోభం, మాత్పర్యం, భయం మొదలగు ప్రవృత్తుల ప్రభావం మనస్సుప్తై పడినప్పడు దాని ఫలితాన్ని శరీరమంతా అనుభవిస్తుంది.

వెలుగు తరంగాలు ఒక్క సెకండులో 1,86,000 మైళ్ల దూరం ప్రసారం అవుతాయని అంటారు. అయితే మనస్సుప్తేగం మాత్రం అంత కంటే అధికం. మనస్సు కోరికల నిలయం. ఒకటి నెరవేరగానే మరో కోరిక మొదలవుతుంది. జానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మనస్సు బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టకుంటుంది. యొూ ఇంద్రియాల్ని మనస్సును జయించడం, యోగ శాస్త్ర లక్ష్యాలలో ముఖ్యం. భజనలు, కీర్తనలు, పూజలు, యుజాలు, తపస్సు, ప్రాణాయామం, ధ్యానం మొదలగునవి యిందుకు బాగా సహకరిస్తాయి. అయితే మనస్సును జయించడానికి ధ్యానం ఒక ముఖ్యమైన సాధనం. శరీరం కదిలితే మనస్సు కూడా కదులుతుంది. కనుక శరీరాన్ని ఒకే ఆసన స్థితిలో ఎక్కువసేపు కదలకుండా స్థిరంగా వుంచడం యోగ ఆసనాల ఉద్దేశ్యం. స్థిరం, సుఖం, ఆసనం అని పతంజలి మహర్షి కథనం. అట్టి స్థితి ధ్యానానికి అమితంగా తోడ్పడుతుంది. ధ్యానం వునస్సును పరుగెత్తకుండా ఆపుతుంది. ప్రతి రోజూ కనీసం 10 లేక 15 నిమిషాల సేపైనా ఏకాగ్రతతో కూడిన ధ్యానం ప్రతి వ్యక్తికీ అవసరం.

I. ధ్యానానీకి అవసరమైన సౌకర్యాలు:

1) ధ్యానం చేయుటకు చోటు మంచిగాను, ఏకాంతంగాను, శుభ్రంగాను వుండాలి. వెలుగు తక్కువగా వుంటే మంచిది.

2) ప్రాతఃకాల సమయం మంచిది. రాత్రి పూట పడుకొనే ముందు ధ్యానం ప్రయోజనకరం. కుదరకపోతే మరే సమయంలోనైనా ధ్యానం చేసుకోవచ్చు.

3) పద్మాసనం గాని, సిదాసనం గాని, సుఖాసనంగాని, వజ్రాసనంగాని వేసి, మెడ, వీపు, నడుం, వెన్నెముకల్ని నిటారుగా వుంచి, కండు మూసుకొని ధ్యానం చేసూ, మనస్సును అందులీనం చేయాలి.

4) ప్రతిరోజూ ధ్యానం చేసూ వుండాలి. దాన్ని అలవాటుచేసుకుంటే అన్ని విధాల
మంచిది.

II. ధ్యానానీకి సహకరించే సాధనాలు:

ధ్యానానికి సహకరించే సాధనాలలో ఆసనాలు, ప్రాణాయామం, ఆలోచనల దర్శనం, ఆలోచనల సంస్కరణ, ఆలోచనల విసర్జన, త్రాటకం, ధ్వనియోగం, మంత్రజపం ముఖ్యమైనవి.

1. ఆసనాలు:

యోగాసనాలు వేసి నందువల్ల స్థిరం, సుఖం, ఆసనం అనుస్థితికి చేరవచ్చు. ఆసనాల వల్ల ధ్యానానికి శక్తి లభిస్తుంది.

2. ప్రాణాయామం:

ఇది చిత్త ఏకాగ్రతకు అమితంగా సహకరిస్తుంది. ప్రాణాయూవుం చేస్తున్నప్పడు శ్వాస ప్రశ్వాసలపై మనస్సు కేంద్రీకృతం అవుతుంది. అందువల్ల స్థిరత్వం పొంది మనస్సు ధ్యానానికి సిద్ధపడుతుంది.

3. ఆలోచనల దర్శనం:

ధ్యానానికి కూర్చోగానే రకరకాల ఆలోచనలు బయలు దేరుతాయి. ప్రారంభంలో వాటిని ఆపేందుకు ప్రయత్నించకూడదు. వీధిన నడిచిపోతూ వుండే జనాన్ని మనం చూసు వున్నట్లు, ప్రారంభంలో ఆలోచనల్ని కూడా తటస్థభావంతో మనం దర్శిస వుండాలి. యిది అంత తేలిక పని కాదు. అయీ అనవరతం అందుకు కృషి చేసూ వుండాలి.

4. ఆలోచనల సంస్కరణ:

ధ్యానానికి కూర్చోగానే బయలుదేరే ఆలోచనల్ని ఒక్కొక్కటిగా రానివ్వాలి. వాటిని గురించి యోచించి ముందుకు సాగాలి, మెదడును శాంతపరచాలి.

5. ఆలోచనల వీసర్జన:

వసూ వున్న ఆలోచనల్ని మెల్లమెల్లగా వదిలివేయాలి. యిది తేలిక పని కాదు అయీ యీ స్థితికి చేరడం అవసరం. పతంజలి మహర్షి యీ స్థితిని ప్రత్యాహారం అని అన్నారు. యీ స్థితికి మనిషి రాగలిగితే ధ్యాన మార్గంలో ప్రగతి సాధించినట్లే.

6. థారణ లేక ఏకాగ్రత:

మనస్సును ఏదో ఒక శబ్దం, ఆకారం, మంత్రం, విగ్రహం యందు గాని, కంఠం, హృదయ కమలం, భృకుటి వంటి శరీరమందలి శక్తి కేంద్రాలలో ఏదో ఒక దాని మీదగాని కేంద్రీకృతం అనగా ఏకాగ్రం చేయాలి. యిది ధ్యానం యొక్క ప్రారంభ స్థితి.

7. ధ్యానం:

ధారణా స్థితిలో బాగాలోతుకు వెళుతూ, శరీరం, మనస్సు, ఆత్మమూడింటి ఏకాత్మ్యతను సాధించడం గొప్ప విశేషం. ఆ దివ్య స్థితియే ధ్యానం యొక్క చరమస్థితి.

III. ధ్యానానీకి సహకరించే క్రియలు:

పైన తెలిపిన ధ్యాన క్రియల సాఫల్యానికి క్రింద వివరించిన విధులు ఎంతో సహకరిస్తాయి. అందువల్ల వీటిని సమయం చిక్కగానే అభ్యసించడం మంచిది.

1. (తాటకం :

మనస్సు వలె కండు కూడా చంచలమైనవే. కనుక కండ్లను ఒక వస్తువుపై లేక ఒక జ్యోతి పై ఏకాగ్రం చేస్తే మనస్సు కూడా ఏకాగ్రం అవుతుంది. అప్పడు ధ్యానం సుగమం అవుతుంది.

2. ధ్వనీ యోగం:

ఓంకారం గాని, మరేదైనా దివ్యధ్వని గాని నోటి నుంచి వెలువరిసూ, ఆ ధ్వనిలో లీనం కావడం, ధ్యానానికి సహకరించే విధానం. ఓంకార ధ్వని నాభి నుంచి బయల్వెడలి గుండె గుండా బయటికి వెలువడుతుంది. అట్టి నాదంలో లీనం కావడం వల్ల ధ్యానానికి అమితంగా సహకారం లభిస్తుంది. మొల్లమెల్లగా బాహ్య ధ్వని తగ్గి, అంతర్ధ్వని వినబడుతుంది. దానినే బ్రహ్మనాదం అని అంటారు.

3. మంత్రజపం :

గురువు ద్వారా ఉపదేశంగా పొందిన మంత్రాన్నిగాని, మరేదైనా ఆధ్యాత్మిక మంత్రాన్ని గాని, శ్వాస ప్రశ్వాసలతో మిళతం చేసి లోలోన జపిసూ వుంటే ఏకాగ్రత ఏర్పడుతుంది. ఓం, ఓం నమశ్శివాయ, గాయత్రి, అల్లాహలో అక్బర్, వాహే గురు, సోహమ్మొదలుగాగల వివిధ మతాలకు సంబంధించిన మంత్రాల్ని ఉచ్చారణ దోషాలు లేకుండా పరిశుద్ధంగా ఉచ్చరించాలి. యీ పని స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి మంచి చోట కూర్చొని ఎప్పడైనా చేయవచ్చు. దీనివల్ల మానసిక శాంతి లభిస్తుంది. యీ మంత్రాల బాహ్య ఉచ్చారణ కూడా మెల్లమెల్లగా తగుతూ, అంతరంగంలో ధ్వనించాలి. యిది దివ్య స్థితి.

4. కుండలినీ యోగం:

సప్తచక్రాలు ధ్యాన యోగానికి సంబంధించిన పలు విధానాలలో తాంత్రిక శాస్తానికి
సంబంధించిన కుండలినీ జాగృతి మరియు దానికి సంబంధించిన సప్త చక్రాల విధానానికి ఎంతో ప్రశస్తి లభించింది.

శరీరంలో ఏడు చక్రాలు వున్నాయని, అవి సూత్మ నీడల సమూహాలని, వెన్నెముక యందు 4, కఠంలో 1, కనుబొమల మధ్య 1, కపాళంలో మాడు దగ్గర 1, మొత్తం అవి 7 అని యోగుల నిర్వచనం. ఆ 7 చక్రాలకు 7 పేర్లు వున్నాయి.
1) మూలాధార చక్రం, 2) స్వాధిషాన చక్రం, తి) మణిపూర చక్రం, 4) అనాహత చక్రం, ప్) విశుద్ధి చక్రం, 6) ఆజ్య చక్రం, 7) సహస్రారం,

ఈ 7 గాక 8వది బిందు చక్రం కూడా ఒకటి వున్నదని తాంత్రికుల నిర్ణయం, ဘွဲဝိ) ధ్యానానికి అపరిమితంగా దోహదం చేస్తాయి. కాగితాలకు పిన్ను గుచ్చినట్లు ఒక్కొక్క చక్రాన్ని మనస్సుతో గుచ్చాలి. దీన్ని చక్ర భేదనం అని అంటారు. దీన్ని నియమబద్ధంగా గురువు ఆదేశించిన ప్రకారం చేసూ వుంటే కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. అయితే జాగ్రత్తగా చేయకపోతే మాత్రం హానికలుగుతుంది.

1. మూలాధార చక్రం

మల రంధానికి రెండు అంగుళాలపైన, రక్తంరంగుతో ఉజ్వలంగా నాలుగు దళాల పద్మం రూపంలో మూలాధార చక్రం వుంటుంది. అధిపతి గణపతి వాహనం – ఏనుగు, బీజాకరాలు వం, శం, షం, సం. తత్వం – పృధ్వి, బీజం – లం, సానం – అపానం, జానేంద్రియాల్లో ముక్కు, కర్మేంద్రియాల్లో వులరంధం దీనికి సంబంధించినవి. వులం వల్ల రోగాలు వస్తాంు. మలదోషాలు తొలగించుటకు మూలాధార చక్రమందు గల గాంగ్లియాన్ ఇంపార్ అను నాడీ కేందాన్ని ఉత్తేజితం చేయుటకు యోగ క్రియులు ఉపకరిస్తాయి. కనుకనే దీని స్మానం గుదం, మలబద్ధకం, మూలశంక, గాస్టిక్ ట్రబుల్ మొదలుగా గల దోషాలు పోతాయి. కనుక మూలాధార చక్ర జాగృతికి, వికాసానికి మనస్సును ఏకాగ్రం చేయమని తాంత్రిక వేత్తలు ప్రబోధిసూ వుంటారు.

2. స్వాధిష్ణాన చక్రం

ఇది జననేంద్రియం వెనుక, వెన్నెముక యందు వుంటుంది. అధినేత – బ్రహ్మతత్వం – జలం, రంగు – సేందూరం, అరుదళాల పద్మం. అక్షరాలు – బం, భం, మం, యం, రం, లం, బీజం – వం, గుణం – రసం, స్మానం వ్యాసం, వాహనం- మకరం, ఫలం – జిహ్వపై సరస్వతి. జానేంద్రియం – జిహ్వ కర్మేంద్రియం – జననేంద్రియం అనగా లింగా గ్రం లేక యోని భాగం.

జననేంద్రియంలో సుప్తీరియర్ మరియు ఇన్ఫీరియర్ హైపోగాస్త్రిక్ ప్లెక్స్ప్రెస్ అను నాడీ కేంద్రం వున్నది. శుక్ల నష్టం, తెల్లబట్ట, ఎర్రబట్ట, ఋతుదోషాలు, శూల నొప్పలు, నపుంసకత్వం, గొడ్రాలితనం హరిస్తాయి.

3. మణిపూర చక్రం

ఇది నాభి మూలంలో వెన్నెముక యందు వుంటుంది. అధిపతి – విష్ణుమూర్తి, పదిదళాల పద్మం, బంగారు రంగు, అకరొలు – డం, ఢం, 6ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫం, తత్వం – అగ్ని బీజం – రం, వాహనం – తప్ప, గుణం – రూపం, స్మానం – సమానం, జానేంద్రియం – కన్ను కర్మేంద్రియం – కాలు, యంత్రం – త్రికోణం, ఫలం – శరీరజనం, జీర్ణకోశం, కాలేయం, మూత్ర పిండాలు, అడెనల్ గ్రంధి మొదలుగా గల నాడీ మండలం యీ కేంద్రంలో వున్నది.

అజీర్ణం, అగ్ని వనాంద్యం, మలబద్ధకం, మూత్ర పిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు, గర్భాశయ వ్యాధులు హరిస్తాయి.

4. అనాహత చత్రం

ఇది హృదయ కమలం వెనుక, వెన్నెముక యందు వున్నది. అధినేత – రుద్రుడు, రంగు – నీలం, పన్నిండు దళాల పద్మం, అక్షరాలు – కం, ఖం, గం, ఘం, జ్ఞం చం, ఛం, జం, రుం, కొణం, టం, ఠం, తత్వం – వాయువు, బీజం – యుం, వాహనం – లేడి, గుణం – స్పర్శ, స్మానం – ప్రాణం, జానేంద్రియం – చర్మం, కర్మేంద్రియం – చెయ్యి, ఫలం – కవితా శక్తి. కఫ దోషాలు హరిస్తాయి.

5. వీశుద్ధ చక్రం

ఇది కంఠ ముడి యందు వున్నది. అధిపతి జీవుడు, రంగు – నలుపు, పదహారు భౌgు పద్మం, అకరాలు – అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, బుం, బూం, ఏం, ఐం, ఓం, ఔం, అం, అః, తత్వం – ఆకాశం, బీజం – హం, వాహనం – ఏనుగు, గుణం – శబ్దం, స్మానం – ఉదానం, జానేంద్రియం – చెవి, కర్మేంద్రియం – ඡටර්ට, ఫలం-మహాజనం, దీర్గాయుస్సు.

స్వరపేటిక, శ్వాసనాళానికి సంబంధించిన వ్యాధులు హరిస్తాయి

6. ఆజ్ఞా చక్రం

ఇది రెండు కనుబొమల మధ్య భృకుటి యందు వున్నది. అధిపతి – ఈశ్వరుడు, రంగు – తెలుపు, రెండు దళాల పద్మం, అక్షరాలు – హం, కం, బీజం – ఓం, తత్వం – చత్రాలన్నిటి ‘බවෂීරට.

భృకుటికి సూటిగా పిచ్యూటరీ గ్రంధి చేరువన హైపోథాలమస్ అను నాడీ వుండలం వున్నది. ంునా నాడులు పెద్ద వెదడు ంుచ్చే ఆజ్ఞల్ని అమలుపరుస్తాయి. ప్రాణాయామం, يعته విధకుంభకాలు, కపాల భాతి, యోగముద్ర మొదలగు ఆసనాలు సహకరిస్తాయి. పిచ్చి, మెంటల్ ట్రబుల్, రక్తపు పోటు, మధుమేహం, మతిమరుపు, విచారం, ఉద్రేకం హరిస్తాయి.It is applicable to only great Yogis-saints

7. సహస్రార చక్రం

ఇది కపాల మందలి మూడు నందు వుంటుంది. దీన్ని బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. అధినేత – పరమేశ్వరుడు, వెయ్యిదళాల పద్మం, సుషుమ్నానాడిపై కొసన సహసార చక్రం వున్నది. అక్షరాలు – విసర్గలు, బీజం – సున్న *3 epo- ဓံဃဋ္ဌိ- ඊශ්‍රයි శుద్ధ చైతన్యమయం.

8. బీందు చక్రం

ఇది శిరస్సు వెనక భాగంలో వుంటుంది. యిది సన్యాసులకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ చక్రాలలో తనకు అనుకూలమైన దాని యందు మనస్సును లీనం చేసి, ఆయా చక్రాలకు సంబంధించిన క్రియలు ఆచరించి, ధ్యానంలో పరిపూర్ణత సాధించవచ్చు. ధ్యానం అలవాటు అయిపోతే అట్టి వారి మనస్సు శాంతి పొందుతుంది. చంచలత్వం హరించిపోతుంది. నిత్యమూ మనం చేసే పనుల్లో నిపుణత పెరుగుతుంది. అందువల్ల సమాజం, ‘සීර්ට అభివృద్ధి చెందుతాయి.

పైన తెలిపినవే కాక ధ్యానానికి సంబంధించిన విపస్యనా, భావాతీత ధ్యానము, అజపాజపము, సిద్ధసమాధి యోగము, ఓషో ధ్యానము, పేక్షాధ్యానము, జీవనం జీవించే కళలు మొదలుగా గల అనేక ధ్యాన పద్ధతులు ప్రపంచంలో ప్రచారంలో వున్నాయి. సాధకులు పై పద్ధతులలో వేటినైనా ఉపయోగించి ప్రయోజనం పొందవచ్చు.