15. నిలబడి వేయు అన్ని ఆసనాలు (15-20 నిమిషాల కార్యక్రమం)

ఇంతకు ముందు తెలిపిన ఆసనాల వలె నిలబడి వేయు యీ ఆసనాలు సర్వులకూ, ముఖ్యంగా యువతరానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి.

1. వాయుయానాసనం:

వాయుయానం అనగా విమానం. యీ ఆసనంలో శరీర స్థితి విమాన రూపంలో ఉండటం వల్ల దీనికి వాయుయానాసనం అని పేరు వచ్చింది.

విధానం
రెండు చేతులు ప్రక్కలకు చాచి నిలబడాలి. నడుం దగ్గర వంగి ఎడమకాలును వెనుకకు ఎత్తి తిన్నగా చాచాలి. శరీర స్థితి విమానం రూపంలో සීටයි” චී.

అట్లే కాలు మార్చి చెయాల. ఇది వాయుయానాసనం.

లాభాలు
శరీరం, మనస్సుల బాలెన్సును మరియు ఏకాగ్రతను యీ ఆసనం పెంచుతుంది. శరీరం తేలిక అనిపిస్తుంది.

“శరీరం ఆకాశంలో ఎగురుతున్నట్లు అనీపించునది వాయుయానాసనం”

2. రాకెట్ ఆసనం:

ఈ ఆసనంలో శరీరం రాకెట్ రూపంలో ఉంటుంది కనుక దీనికి యీ పేరు వచ్చింది.

విధానం
పై ఆసనంలో వలె నడుము దగ్గర వంగి ఒక కాలు వెనుకకు తిన్నగా ఎత్తి చాచాలి. రెండు చేతులు ముందుకు తిన్నగా చాచి జోడించాలి. శరీరాన్ని రాకెట్ రూపంలో వుంచాలి.

లాభాలు
శరీరం, మనస్సుల బాలెన్సుకు, కాళ్ల నరాల బలమికి సహకరిస్తుంది.

“నరాలకు బలిమీనీచ్చునది – రాకెట్ ఆసనం”

3. హస్తపాదాంగుష్ణాసనం:

చేతితో కాలి బొటన వేలు పటుకొను ఆసనం కనుక దీనికి హస్త పాదాంగుషాసనం అని పేరు వచ్చింది.
విధానం
వెన్నెవుకను నిటారుగా వుంచి నిలబడాలి. కుడికాలును ముందుకు ఎత్తి తిన్నగా చాచాలి. కుడికాలి ప్రేళ్లను రెండు చేతులతో పటు కొని బాలెన్సును సరిచేసుకుంటూ ఒంటికాలిపై నిలబడాలి. కొద్ది సేపు తరువాత కాలు మార్చి చేయాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి.

లాభాలు
అలసట తగుతుంది. శరీరఅవయవాలన్నిటికి శక్తి లభిస్తుంది. చురుకుదనం పెరుగుతుంది. కాళ్ల శక్తి పెరుగుతుంది. నాభి తన స్మానంలో స్థిరంగా ఉంటుంది.

సూచన
ప్రారంభంలో గోడను ఆనుకొని యీ ఆసనం వేయాలి. బాలెన్సు సరిపోగానే గోడ ఆధారం లేకుండా యీ ఆసనం చేయాలి.

“శరీరం, మనసుల బాలెన్సును నలుపునది హస్తపాదాంగుష్ట్రాసనం”

4. కోణాసనం:

ఈ ఆసనంలో శరీరం వివిధ కోణాల్లో వుంటుంది కనుక దీనికి కోణాసనం అని పేరు వచ్చింది.

విధానం
రెండు కాళ్లను సాధ్యమైనంత దూరంలో వుంచి నిటారుగా నిలబడాలి. చేతులు Goč) * (ડી-૦ડે తిన్నగా చాచాలి. ప్రక్కకు పూర్తిగా వంగి ఎడమ చేతితో ఎడవు పాదం తొకాలి. తరువాత ఎడమ వేూకాలు కొద్దిగా వంచి శరీరాన్ని చేతుల్ని ఏటవాలుగా వుంచాలి. కొద్ది సేపు తరువాత కుడి చేతిని తలమీదుగా సాధ్యమైనంత వరకు వంచాలి. శ్వాస సామాన్యంగా వుండాలి. నడుముపై ధ్యానం కేంద్రీకరించాలి. ఇట్లే మరో వైపుకు చేయాలి.

లాభాలు
చేతులకు, కాళ్లకు, నడుమునకు, బుజాలకు, శిరస్సుకు, నరాలకు స్ఫూర్తి లభిస్తుంది. అలసట పోతుంది.

“శరీరానికి స్ఫూర్తినొచ్చునది కోణాసనం”

5. త్రికోణాసనం

శరీరం త్రికోణాకారంలో వుంటుంది కనుక దీనికి త్రికోణాసనం అని పేరు వచ్చింది.

విధానం
1) రెండు కాళ్లు సాధ్యమైనంత దూరంగా వుంచి రెండు చేతులు రెండు ప్రక్కలకు తిన్నగా చాచాలి. నడుమును ప్రక్కకు వంచి ఎడమ చేతితో కుడిపాదం స్పృశించాలి. శ్వాస వదులుతూ పైకి చూడాలి. శ్వాస పీలుస్తూ యధాస్థితికి రావాలి, తిరిగి అదే విధంగా కుడి చేతితో ఎడమ పాదం ప్రేళ్లను స్పృశించాలి. మళ్లీ యధాస్థితికి రావాలి. ఇట్లు వరుసగా 5 లేక్త 6 তত: చేయాలి.

2) రెండవ విధానంలో క్రిందికి వంగి కుడి చేతితో ఎడమ పాదం, ఎడమ చేతితో కుడి పాదం త్వర త్వరగా గబగబా తాకాలి. నడుము, వెన్నెముకపై థ్యానం కేంద్రీకరించాలి.

లాభాలు
పిక్కలు, తొడలు, నడుము, వెన్నెముక బలపడతాయి.

“నడుమునకు స్ఫూర్తినిచ్చేది (తికోణాసనం”

6. ధృవాసనం:

భక్త ధృవుడు 00ూ ఆసనంలో వుండి తపస్సు చేసేవాడు కనుక యీ ఆసనానికి ధృవాసనం అని పేరు వచ్చింది.

విధానం
రెండు పాదాలు ప్రక్క ప్రక్కన వుంచి, రెండు చేతులు రెండు పక్కలకు తిన్నగా చాచి, నిటారుగా నిలబడాలి. తరువాత కుడి మోకాలు మడిచి, కుడిచేతో కుడి పాదం పట్టుకొని, పాదాన్ని వెల్లకిల త్రిప్పి, దాన్ని తొడ పైన వుంచి, వుడవును గజ్ఞకు ఆన్చాలి. ఒంటి కాలి మీద నిలబడాలి. ఆ తరువాత రెండు చేతులు జోడించి నమస్కరించాలి. కొద్దిసేపు తరువాత కాలు దించాలి. కాలు మార్చి కూడా అదే విధంగా ఆసనం పేయాలి.

శ్వాస సామాన్యంగా వుండాలి, భృకుటి లేక హృదయ కమలం పై ధ్యానం కేంద్రీకరించాలి.

లాభాలు
సోమరితనం పోతుంది. మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. జపం, తపం, ధ్యానం చేయుటకు అనుకూలమైన ఆసనం.

“మనస్సుకు ఏకాగ్రత నిచ్చేది ధృవాసనం”

7. వాతాయనాసనం:

ఆయన పేరిట యీ ఆసనానికి వాతాయనాసనం అని పేరు వచ్చింది.

విధానం
పాదాలు, మోకాళ్లు కలిపి నిలబడాలి. వుడవులు, పిరుదులు, శిరస్సు యొక్క వెనుక భాగం సవయంగా వుండాలి. కుడి కాలును ధృవాసనం వలె వూ కాలు ద గ్గర వంచి, కాలిపాదాన్నిఎడమ తొడ దగ్గరకు చేర్చాలి. రెండు చేతులు నమస్కార ముద్రలో వుంచాలి. ఎడమ వెనా కాలును వుందుకు వంచుతూ, కుడి మోకాలును ఎడమ కాలి మడమ దగ్గర భూమి పై ఆన్చాలి. సాధ్యమైనంత సేపు యూ ఆసనంలో వుండాలి. శ్వాస సావూన్యంగా వుండాలి. మూత్రేంద్రియం మీద ధ్యానం కేంద్రీకరించాలి. అదే విధంగా కాలు మార్చి యీ ఆసనం వేయాలి.

లాభాలు
బ్రహ్మచర్య రకణకు సహకరిస్తుంది. మధుమేహం, అతి మూత్ర వ్యాధి, వీర్యసలనం, స్వప్న దోషం, సియాటికా నొప్పలు, హెర్నియా తగ్గిపోతాయి. పిక్కలు, మోకాళ్లు, నడుము, వెన్నెముక, మెడ గట్టిపడతాయి.

నిషేధం
స్త్రీలు, బాలికలు యీ ఆసనం వేయకూడదు.
“(బహ్మ చర్య రక్షణకు వాతాయనాసనం”

8. గరుడాసనం:

ఈ ఆసనంలో శరీర స్థితి గరుడపక్షిలా వుంటుంది కనుక దీనికి గరుడాసనం అని పేరు వచ్చింది.

విధానం
తిన్నగా నిలబడి కాళ్లు చేతులు మెలిక వేయాలి. కుడిపాదం నేల మీద గట్టిగా ఆని వుండాలి. ఎడమ పాదం నేల మీద ఆనకుండా, మోకాలు దగ్గర పై నుండి (ડી-ડે తిరిగి, పిక్క క్రింది భాగాన్ని అంటి వుండాలి. అదే విధంగా కుడి చేతికి ఎడమ చేయి మెలిపేసుకోవాలి. రెండు చేతులు జోడిసూ నమస్కారం చేయాలి. శ్వాస సామాన్యంగా వుండాలి. చేతులు కాల్లు మార్చి కూడా పేయాలి శరీరం, మనస్సుల బాలెన్సు పై ధ్యానం కేంద్రీకరించాలి.

సూచన :
ప్రారంభంలో మెలి వేసిన కాలి ప్రేళ్లను కూడా నేల మీద వుంచి అభ్యాసం చేయాలి

లాభాలు
హెర్నియా, నడుం నొప్పి, పక్షవాతం, వరిబీజం, సియాటికా నొప్పి నయమవుతాయి. నరాలు, కండరాలు శక్తివంతమై చురుగా వుంటాయి.

“కాళ్ల చేతుల నరాల కండరాల బీగువును పెంచేది గరుడాసనం”

9. శీర్షాసనం:

శిరస్సును నేలపై ఆనించి కాళ్లను పైకెత్తి వేసే ఆసనం కనుక దీనికి శీరాసనం అని పేరు వచ్చింది. యోగాసనాలలో ఉత్తమమైనది కనుక దీన్ని రాజాసనం అని కూడా అంటారు. ఇది కఠినమైన ఆసనం.

విధానం
వజ్రాసనంలో కూర్చొని, శశాంకాసనం వలె ముందుకు వంగుతూ, రెండు అరచేతుల్ని కలిపి, పంజాగా తయారుచేసి, తల క్రింద వుంచి, రెండు చేతులపై బరువు మోపి, శిరస్సును నేలకు ఆనించాలి. నేలపై మాడు ఆనకూడదు. నుదురు ఆనాలి. మోకాళ్లు, తరువాత రెండు కాళ్లు కలిపి మొల్లగా పైకి ఎత్తాలి. పిక్కలు, తొడలు, నడుము, వీపు నిటారుగా వుండాలి. కళ్లు మూసుకొని మొదట శీరాసనం పేయాలి. బరువు తలమీద తక్కువగాను, చేతుల మీద ఎక్కువగాను మోపాలి. శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఎత్తుతారో అంత జాగ్రత్తగా నెమ్మదిగా తిరిగి యథా స్థితికి తేవాలి. అరనిమిషం చొప్పన రోజూ శీరాసనం వేసూ నాలుగు వారాల తరువాత రెండు నిమిషాల సేపు వేయాలి.

సూచన
శ్వాస సామాన్యంగా ఉండాలి. శరీరం మొత్తం మీద, శిరస్సు మీద ధ్యానం కేంద్రీకరించాలి. శీరాసనంపేసిన తరువాత తప్పక తాడాసనం, తరువాత శవాసనం, వేసి విశ్రాంతి శ్రీసుకోవాలి.

లాభాలు
గ్రంథులకు పుష్టి చేకూరుతుంది. తలయందలి నాడులన్నింటికీ రక్త ప్రసారం బాగా జరిగి నందున అవి చురుగా వుంటాయి. ఊపిరితితులు, గుండె బాగా పని చేస్తాయి. శరీరమందలి వూలిన్యం బయటికి వెళ్లడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. తెల్ల జుటు నల్లబడుతుంది. కంటి చూపు సరిగా వుంటుంది. స్మరణ శక్తి పెరుగుతుంది వధువేనహం, మూల శంక, వీర్యస్థలనం తగ్గి తేజస్సు పెరుగుతుంది. శీరాసనం వేసూవుండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బిడ్డల సంచికి సంబంధించిన రుగ్మతలు పోతాయని కొందరి అభిప్రాయం.

నిషేధం
కన్ను చెవి జబ్బులు, రక్తపువోటు, గుండెలకు సంబంధించిన ခဲခဲမဲမဲဆွိ)©မဲ ၅ మెడ నొప్పి, స్పాండ లైటిస్ కలవాళ్లు శీరాసనం వేయకూడదు. శిరస్సుకు గాయం తగిలిన వారు, బలహీనంగా వున్నవాళ్లు యీ ఆసనంపేయకూడదు. స్త్రీలు శీరాసనం వేయకూడదని కొంత మంది యోగ నిపుణుల అభిప్రాయం.

సలహా
ప్రారంభంలో గోడ సహాయంతో శీరాసనం వేయాలి. నిపుణుల పర్యవేక్షణలో యీ ఆసనం వేయాలి. రెండు నిమిషాల కంటే మించి యీ శీర్పాసనం వేయడం అనవసరం.

“(కొత్త జీవీతం ప్రసాదించేది శీర్ధాసనం”

10. తాడాసనం:

ఈ ఆసనంలో శరీరం తాటిచెటు రూపంలో వుంటుంది కనుక దీనికి తాడాసనం అని పేరు వచ్చింది.

విధానం
చేతులు పైకి ఎత్తి నిటారుగా నిలబడాలి. మడమలు పైకెత్తి మునికాళ్లపై సాధ్యమైనంత సేపు నిలబబడాలి. మరల చేతులు మడమలు క్రిందికి దింపాలి.

శరీరమందలి నరాల గుంజుడు, బిగింపుపై ధ్యానం కేంద్రీకరించాలి. రెండు మూడు పర్యాయాలు యీ క్రియ చేసిన తరువాత సామాన్య శ్వాసతో తాడాసనం వేసూ మోకాళ్లు వంగకుండా వునికాళ్లతో చిన్న చిన్న అడుగులు వేసూ ముందుకు సాగాలి,

లాభాలు
వెన్నెముకకు, గుండెకు బలం చేకూరుతుంది. ఛాతీ వైశాల్యం పెరిగి ఊపిరితితులు చురుగా ఉంటాంు. సూలకాయం తగుతుంది. శరీర వుందలి నరాలన్నింటికి గుంజుడు, బిగింపు వల్ల స్పూర్తి లభిస్తుంది. 15 ఏండ్లలోపు పిల్లల ఎత్తు పెరుగుతుంది.

సూచన
శీర్షాననంపేసిన తరువాత తాడాసనం తప్పక వేయాలి.

“శరీర మందలి నరాలన్నీంటికి శక్తినిచ్చేది తాడాసనం”


నిలబడి వేయు అన్ని ఆసనాలు శరీరానికి చురుకుదనం ప్రసాదిస్తాయి. వీటిని వేసిన తరువాత కొద్ది సేపు శవాసనం లేక నిస్పంద భావాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.